త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్‌.. బులియ‌న్ మార్కెట్ల వైపు పెట్టుబ‌డిదారుల చూపులు..

Gold And Silver Prices Today | జాతీయ‌, అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు గ‌త వారం రోజుల నుంచి తీవ్ర న‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికీ పెట్టుబ‌డిదారులు మాత్రం బంగారం, వెండి లోహాల ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. గ‌త కొద్ది నెల‌ల క్రితం ఆల్ టైం హై స్థాయిలో ఉన్న‌ప్పుడు ఈ సేఫ్ హావెన్ ఆస్తుల‌ను కొనుగోలు చేసేందుకు వారు ఆస‌క్తి చూప‌లేదు.

S

Business | Published On Aug 22, 2026, 11.43 am IST

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్‌.. బులియ‌న్ మార్కెట్ల వైపు పెట్టుబ‌డిదారుల చూపులు..
Advertisement

Gold And Silver Prices Today | జాతీయ‌, అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు గ‌త వారం రోజుల నుంచి తీవ్ర న‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికీ పెట్టుబ‌డిదారులు మాత్రం బంగారం, వెండి లోహాల ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. గ‌త కొద్ది నెల‌ల క్రితం ఆల్ టైం హై స్థాయిలో ఉన్న‌ప్పుడు ఈ సేఫ్ హావెన్ ఆస్తుల‌ను కొనుగోలు చేసేందుకు వారు ఆస‌క్తి చూప‌లేదు. కానీ ప్ర‌స్తుతం ధ‌ర‌లు ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌డంతో మ‌ళ్లీ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర ఒక్క రోజే ఏకంగా 1.86 శాతం మేర ఎగ‌సి 4,602 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 1.29 శాతం మేర పెరిగి 68 డాల‌ర్ల‌కు చేరుకుంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3,013 పాయింట్ల‌కు పైగా పెరిగి 1,62,438 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3,354 పాయింట్ల మేర పెరిగి 2,46,597 వ‌ద్ద స్థిర‌ప‌డింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ భారీగా పెరిగాయి. అయితే వెండి ధ‌ర‌ల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.16,309 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,30, 472గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,63,090 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.16,30,900 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.15,200 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,950 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,19,600గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,49,500 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,95,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.14,000 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.12,232 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.97,856గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,22,320 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.12,23,200గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.11,400 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,60,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,70,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,700 గా ఉంది.

Advertisement
Advertisement