త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన ప‌సిడి ధ‌ర‌.. పెట్టుబ‌డిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Gold And Silver Prices Today | అమెరికా బాండ్ ఈల్డ్స్ త‌గ్గ‌డం, అగ్ర రాజ్యం పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోవ‌డంతో ఆ దేశ క‌రెన్సీ డాల‌ర్‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. దీంతో స‌హ‌జంగానే బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో బంగారాన్ని అమెరికా డాల‌ర్‌ల‌తో పోల్చి విక్ర‌యాలు చేప‌డ‌తారు.

S

Business | Published On Aug 20, 2026, 11.01 am IST

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన ప‌సిడి ధ‌ర‌.. పెట్టుబ‌డిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
Advertisement

Gold And Silver Prices Today | అమెరికా బాండ్ ఈల్డ్స్ త‌గ్గ‌డం, అగ్ర రాజ్యం పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోవ‌డంతో ఆ దేశ క‌రెన్సీ డాల‌ర్‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. దీంతో స‌హ‌జంగానే బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో బంగారాన్ని అమెరికా డాల‌ర్‌ల‌తో పోల్చి విక్ర‌యాలు చేప‌డ‌తారు. అందువ‌ల్ల డాల‌ర్ విలువ బ‌ల‌హీన‌ప‌డితే స‌హ‌జంగానే బంగారం ధ‌ర పెరుగుతుంది. ఈ క్ర‌మంలోనే తాజా ట్రెజ‌రీ డేటా విడుద‌ల‌య్యాక బంగారం ధ‌ర‌లు అమాంతం పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర ఈ సెష‌న్‌లో స్వ‌ల్పంగా త‌గ్గిన‌ప్ప‌టికీ గ‌త సెష‌న్‌తో పోలిస్తే భారీగానే పెరిగింది. గురువారం సెష‌న్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.81 శాతం మేర త‌గ్గి 4,486 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 0.21 శాతం పెరిగి 67 డాల‌ర్ల‌కు చేరింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 134 పాయింట్లు పెరిగి 1,58,130 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1.25 శాతం మేర ఎగ‌సి 2,39,674 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే బంగారం ధ‌ర రూ.43వేలు పెర‌గ్గా, వెండి ధ‌ర రూ.10వేలు పెరిగింది.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,927 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,27, 416 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,59,270 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,92,700 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.43వేలు పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,600 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,16,800గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,46,000 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,60,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.39,500 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,946 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.95,568గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,19,460 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,94,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.32,300 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,55,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,550గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.10వేలు పెరిగింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,60,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,600 గా ఉంది.

Advertisement
Advertisement