త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బంగారం ధ‌ర‌ల‌కు రెక్క‌లు.. ఒక్క రోజులోనే రూ.31వేలు జంప్‌..

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో మిశ్ర‌మ స్పంద‌న క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ బులియ‌న్ మార్కెట్ల‌లో మాత్రం జోరు కొన‌సాగుతోంది. గ‌త కొద్ది రోజులుగా బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి. వ‌ర‌ల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా గ‌ణాంకాల ప్ర‌కారం స‌మీప భ‌విష్య‌త్తులో బంగారం ధ‌ర‌లు భారీగా పెర‌గ‌నున్నాయ‌ని వెల్ల‌డైంది. దీంతో పెట్టుబ‌డిదారుల్లో నూత‌నోత్సాహం వ‌చ్చింది.

S

Business | Published On Aug 11, 2026, 11.03 am IST

Gold And Silver Prices Today | బంగారం ధ‌ర‌ల‌కు రెక్క‌లు.. ఒక్క రోజులోనే రూ.31వేలు జంప్‌..
Advertisement

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో మిశ్ర‌మ స్పంద‌న క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ బులియ‌న్ మార్కెట్ల‌లో మాత్రం జోరు కొన‌సాగుతోంది. గ‌త కొద్ది రోజులుగా బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి. వ‌ర‌ల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా గ‌ణాంకాల ప్ర‌కారం స‌మీప భ‌విష్య‌త్తులో బంగారం ధ‌ర‌లు భారీగా పెర‌గ‌నున్నాయ‌ని వెల్ల‌డైంది. దీంతో పెట్టుబ‌డిదారుల్లో నూత‌నోత్సాహం వ‌చ్చింది. మంగ‌ళ‌వారం ఒక్క రోజే బంగారం ధ‌ర భారీ స్థాయిలో పెరిగింది. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర ఏకంగా 0.18 శాతం మేర పెరిగి 4,397 డాల‌ర్ల స్థాయికి చేరింది. వెండి ధ‌ర 0.72 శాతం త‌గ్గి 65 డాలర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1202 పాయింట్లు పెరిగి 1,54,301కు చేర‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 703 పాయింట్లు పెరిగి 2,37,564 వ‌ద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధ‌ర‌లు ఒక్క రోజులోనే భారీగా పెరుగుద‌ల‌ను న‌మోదు చేశాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,513 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,24, 104 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,55,130 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,51,300 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.31,600 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,220 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,13,760గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,42,200 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,22,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.29,000 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,635 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.93,080గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,16,350 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,63,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.23,700 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,55,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,550గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.10వేలు పెరిగింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,60,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,600 గా ఉంది.

Advertisement
Advertisement