Gold And Silver Prices Today | భారీగా తగ్గిన వెండి ధర.. పసిడి ధరల్లో మార్పు లేదు..
Gold And Silver Prices Today | పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా గత కొంత కాలంగా బంగారం, వెండి ధరల్లో అనిశ్చితి కొనసాగుతోంది. పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆయా లోహాల ధరలు ఆల్ టైమ్ హై స్థాయిల్లో ఉండడంతో యుద్ధం ముగిశాకే కొందామని వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.
Gold And Silver Prices Today | పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా గత కొంత కాలంగా బంగారం, వెండి ధరల్లో అనిశ్చితి కొనసాగుతోంది. పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆయా లోహాల ధరలు ఆల్ టైమ్ హై స్థాయిల్లో ఉండడంతో యుద్ధం ముగిశాకే కొందామని వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. దీంతో ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు తప్ప పెద్ద తేడాలు కనిపించడం లేదు. ఇక మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 32 డాలర్లు తగ్గి 4,787 వద్ద ఉండగా, వెండి ధర 0.70 డాలర్లు తగ్గి 79 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 193 పాయింట్లు తగ్గి 1,53,750 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1,645 పాయింట్లు తగ్గి 2,50,900 వద్ద ఉంది. అయితే దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సోమవారం నాటి ధరలే ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. కానీ వెండి ధర మాత్రం భారీగా తగ్గింది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,529 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,24,232 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,55,290 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,52,900 గా ఉంది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,235 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,880గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,23,500గా ఉంది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,647 ఉండగా, 8 గ్రాముల ధర రూ.93,176గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,16,470 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,64,700గా ఉంది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కేజీకి రూ.10వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,75,000 ఉండగా, తులం ధర రూ.2,750 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



