త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahalakshmi Smart Card | ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల ఉచిత ప్ర‌యాణం.. మ‌హాలక్ష్మీ స్టార్ట్ కార్డులు పొంద‌డం ఎలా..?

Mahalakshmi Smart Card | మీరు టీజీఎస్ ఆర్టీసీ( TGSRTC ) బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణానికి అర్హులా..? అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆధార్ కార్డు లేదా ఓట‌రు ఐడీ కార్డు చూపించి ప్ర‌యాణించి ఉంటారు. ఇక నుంచి ఈ రెండింటి స్థానంలో కొత్త‌గా మ‌హాల‌క్ష్మీ స్మార్ట్ కార్డులు( Mahalakshmi Smart Card ) రాబోతున్నాయి. ఈ స్మార్ట్ కార్డుల‌ను పొంద‌డం ఎలాగో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

S

Telangana | Published On Jun 1, 2026, 12.38 pm IST

Mahalakshmi Smart Card | ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల ఉచిత ప్ర‌యాణం.. మ‌హాలక్ష్మీ స్టార్ట్ కార్డులు పొంద‌డం ఎలా..?
Advertisement

Mahalakshmi Smart Card | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌హిళా ప్ర‌యాణికుల‌కు( Woman Passengers ) ఆర్టీసీ బ‌స్సుల్లో( RTC Bus ) ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఉచిత ప్ర‌యాణానికి మ‌హిళ‌లు త‌మ ఆధార్ కార్డు లేదా ఓట‌రు కార్డు చూపించాలి. లేదంటే ఉచిత ప్ర‌యాణానికి ఆస్కారం లేదు.

అయితే ఈ రెండు కార్డుల స్థానంలో మ‌హాలక్ష్మీ స్మార్ట్ కార్డు( Mahalakshmi Smart Card ) తీసుకురావాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జూన్ 2వ తేదీ నుంచి ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చేయాల‌ని అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రి మ‌హాలక్ష్మీ స్మార్ట్ కార్డు పొంద‌డం ఎలాగో తెలుసుకుందాం.

మీ సేవ లేదా బ‌స్‌పాస్ సెంట‌ర్ల‌లో ద‌ర‌ఖాస్తు

మ‌హాలక్ష్మీ స్మార్ట్ కార్డు కోసం మీకు ద‌గ్గ‌ర్లో ఉన్న మీ సేవ లేదా టీజీఎస్ఆర్టీసీ బ‌స్ పాస్ సెంట‌ర్ల‌ను సంప్ర‌దించాలి. ల‌బ్ధిదారు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, మొబైల్ నంబ‌ర్ ఇవ్వాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 50 ఉంటుంది. ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌ర్వాత మీకు స్మార్ట్ కార్డు అంద‌జేస్తారు.

జూన్ 2 నుంచి స్మార్ట్ కార్డులు పంపిణీ

మ‌హాల‌క్ష్మీ స్మార్ట్ కార్డుల‌ను జూన్ 2 నుంచి పంపిణీ చేయ‌నున్నారు. అయితే మొద‌ట‌గా పైల‌ట్ ప్రాజెక్టు కింద ప్ర‌తి జిల్లాకు ఒక మండ‌లంలో అమ‌లు చేయ‌నున్నారు. అంద‌రికీ ఈ కార్డులు అందే వ‌ర‌కు మాత్రం ఆధార్, ఓట‌ర్ కార్డుతో ఉచితంగా ప్ర‌యాణించే వీలుంది.

మ‌హాల‌క్ష్మీ కార్డు ఎలా ప‌ని చేస్తుందంటే..?

మ‌హాలక్ష్మీ స్మార్ట్ కార్డులు చిప్ బేస్డ్ టెక్నాల‌జీతో ప‌ని చేస్తాయి. ఇందులో ల‌బ్ధిదారుల ఆధార్ వివ‌రాల‌ను డిజిట‌ల్‌గా కార్డుకు అనుసంధానం చేస్తారు. ల‌బ్ధిదారు పేరు, ఫొటో, ఐడీ నంబ‌ర్, క్యూర్ కోడ్ వంటి వివ‌రాలు ఉంటాయి. బస్సులో ప్ర‌యాణించే స‌మ‌యంలో ఈ కార్డును స్వైప్ చేయాల్సి ఉంటుంది. జ‌ర్నీ వివ‌రాలు న‌మోదు చేస్తే టికెట్ జ‌న‌రేట్ అవుతుంది.

Advertisement
Advertisement