త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | స్వల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. కొనుగోలుకు ఇదే మంచి స‌మ‌య‌మా..?

Gold And Silver Prices Today | ఇరాన్‌తో ఒప్పందం కుదిరింద‌ని, హోర్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద నౌక‌ల దిగ్బంధ‌నాన్ని ఎత్తేస్తున్నామ‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించ‌డంతో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో జోష్ వ‌చ్చింది. గ‌త సెష‌న్‌లో అమెరికా బెంచ్ మార్క్ సూచీలు నాస్డాక్‌, డౌజోన్స్‌, ఎస్ అండ్ పీ 500 భారీగా ఎగ‌బాకాయి.

S

Business | Published On May 30, 2026, 11.07 am IST

Gold And Silver Prices Today | స్వల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. కొనుగోలుకు ఇదే మంచి స‌మ‌య‌మా..?
Advertisement

Gold And Silver Prices Today | ఇరాన్‌తో ఒప్పందం కుదిరింద‌ని, హోర్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద నౌక‌ల దిగ్బంధ‌నాన్ని ఎత్తేస్తున్నామ‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించ‌డంతో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో జోష్ వ‌చ్చింది. గ‌త సెష‌న్‌లో అమెరికా బెంచ్ మార్క్ సూచీలు నాస్డాక్‌, డౌజోన్స్‌, ఎస్ అండ్ పీ 500 భారీగా ఎగ‌బాకాయి. దీంతో సోమ‌వారం అన్ని దేశాల మార్కెట్ల‌లోనూ బల‌మైన బుల్ ర్యాలీ ఖాయ‌మ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇక దీని ప్ర‌భావం బంగారం, వెండి ధ‌ర‌ల‌పైనా ప‌డింది. గ‌త కొద్ది రోజులుగా తీవ్ర ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటున్న క‌మోడిటీస్ మార్కెట్‌కు భారీ ఊర‌ట ల‌భించింది. దీంతో అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ భారీగా పెరిగాయి. ఔన్స్ బంగారం ధ‌ర 0.94 శాతం ఎగ‌సి 4,538 డాల‌ర్ల వ‌ద్ద ముగియ‌గా, వెండి ధర 0.44 శాతం త‌గ్గి 75.29 డాల‌ర్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు గ‌త సెషన్‌లో 1350 పాయింట్లు త‌గ్గి 1,55,575 వ‌ద్ద ముగియ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 2.539 పాయింట్లు త‌గ్గి 2,66,998 వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గ‌గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,704 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,25, 632 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,57,040 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,70,400 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.6వేలు త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,395 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,15,160గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,43,950 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,39,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,778 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.94,224గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,17,780 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,77,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,500 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,80,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,800గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,90,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,900 గా ఉంది.

Advertisement
Advertisement