Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీకి నిజంగా స్వార్థం ఉంటే 2004, 2009లోనే ప్రధాని కావాలి కదా..? అని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన నాది, మాది అనే పదం నుంచి మనది అనే పదానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
ఈ దేశ భవిష్యత్, దిక్సూచి రాహుల్ గాంధీనే
టాలెంట్ హంట్ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం
పార్టీలకతీతంగా అధికార ప్రతినిధులు, రీసెర్చర్స్
ప్రతిభ ఉన్న యువతకు సువర్ణావకాశం
గాంధీ భవన్‌లో వెల్లడించిన టీ పీసీసీ చీఫ్
Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీకి నిజంగా స్వార్థం ఉంటే 2004, 2009లోనే ప్రధాని కావాలి కదా..? అని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన నాది, మాది అనే పదం నుంచి మనది అనే పదానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గాంధీ భవన్‌లో మీడియా కమిటీ చైర్మన్ సామ రాంమోహన్ రెడ్డితో కలిసి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సోమవారం మీడియాతో మాట్లాడారు.
దేశ యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాహుల్ గాంధీ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. గతంలో అధికార ప్రతినిధులను పీసీసీ చీఫ్ నియామకం చేసుకునేవారు. తాజాగా రాహుల్ అధికార ప్రతినిధుల నియామకానికి కూడా కొత్త పద్ధతిని తీసుకువచ్చారు. ఆ పద్ధతి ఏంటంటే టాలెంట్ హంట్.. ప్రతిభ ఉన్న వ్యక్తులను వెలికితీసి అధికార ప్రతినిధులుగా అవకాశం ఇవ్వడం. కాంగ్రెస్ పార్టీ వారే కాకుండా జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై పరిపూర్ణంగా అవగాహన ఉన్న వారిని టాలెంట్ హంట్‌లో వెలికితీస్తారు. లౌకిక వాదం గురించి అవగాహన ఉన్న యువకులను, మేధావులను ఎంపిక చేయాలని రాహుల్ గాంధీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని మహేశ్ కుమార్ తెలిపారు.

రాజకీయాల మీద అవగాహన ఉంటే.. అధికార ప్రతినిధులుగా
దేశ, రాష్ట్ర రాజకీయాల మీద అవగాహన ఉంటే.. అధికార ప్రతినిధులుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇందులో 50 శాతం మంది కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలే ఉంటారు. బహిరంగంగా మాట్లాడలేని వారు, ఈ దేశ, రాష్ట్ర చరిత్ర గురించి తెలిసిన వారు, పార్టీలకతీతంగా వారు న్యూట్రల్ ఓపీనియన కలిగి ఉన్నవారిని కూడా పరిశోధకులుగా ఎంపిక చేస్తారు. రాజకీయాల మీద ఆసక్తి కలిగి ఉండి, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వారిని కో ఆర్డినేటర్స్‌గా నియామకం చేయడం జరుగుతుంది అని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు.
రాహుల్ ఆలోచనల్లో నుంచి పుట్టిందే టాలెంట్ హంట్
దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పత్రికలే సమాచార సాధనాలుగా ఉండేవి. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు మించి సోషల్ మీడియా అతిపెద్ద ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో యువతకు అపారమైన అవకాశాలు లభించే అవకాశం ఉంది. విశాలమైన ఆలోచనలు కలిగిన ఉన్న యువతను దేశ నిర్మాణంలో పాలుపంచుకునేలా రాహుల్ చర్యలు తీసుకుంటున్నారు. రాహుల్ ఆలోచనల్లో నుంచి పుట్టిన టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని ఇవాళ తెలంగాణలో ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ఈ దేశానికి భవిష్యత్, దిక్సూచి రాహుల్ గాంధీనే
నాది, మాది అనే పదం నుంచి మనది అనే పదానికి శ్రీకారం చుట్టారు. రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004, 2009లో ప్రధాని కావాలి కదా..? దేశ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు పోతున్నారు. రాహుల్ గాంధీ ప్రజల గుండెల్లో ఉన్నారని సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. ఆయా రాష్ట్రాల్లో తిరుగుతున్న తీరుతో తెలుస్తోంది. ఈ పన్నేండ్ల కాలంలో మోదీ ఈ దేశ ప్రజలను వంచించారు, మోసం చేశారు. ఈ దేశ ప్రజలు మోదీని సమర్థించే పరిస్థితుల్లో లేరు. ఈ దేశానికి భవిష్యత్, దిక్సూచి రాహుల్ గాంధీనే అని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తేల్చిచెప్పారు.
తాజావార్తలు
- ●Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- ●Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
- ●BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని

Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..





