త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల‌లో భారీ న‌ష్టాలు.. బంగారం వైపు పెట్టుబ‌డిదారుల ప‌రుగులు..

Gold And Silver Prices Today | దేశీయ‌, అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో భారీ న‌ష్టాలు కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ బంగారం, వెండి మాత్రం పెట్టుబ‌డిదారుల‌కు మ‌ళ్లీ కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాయి. ముడి చ‌మురు ధ‌ర‌ల పెరుగుద‌ల నేప‌థ్యంలో పెట్టుబ‌డిదారుల‌పై అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొన‌గా, ఈక్విటీల నుంచి వారు సేఫ్ హావెన్ ఆస్తుల వైపు త‌మ పెట్టుబ‌డుల‌ను మ‌ళ్లిస్తున్నారు.

S

Business | Published On Aug 12, 2026, 11.33 am IST

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల‌లో భారీ న‌ష్టాలు.. బంగారం వైపు పెట్టుబ‌డిదారుల ప‌రుగులు..
Advertisement

Gold And Silver Prices Today | దేశీయ‌, అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో భారీ న‌ష్టాలు కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ బంగారం, వెండి మాత్రం పెట్టుబ‌డిదారుల‌కు మ‌ళ్లీ కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాయి. ముడి చ‌మురు ధ‌ర‌ల పెరుగుద‌ల నేప‌థ్యంలో పెట్టుబ‌డిదారుల‌పై అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొన‌గా, ఈక్విటీల నుంచి వారు సేఫ్ హావెన్ ఆస్తుల వైపు త‌మ పెట్టుబ‌డుల‌ను మ‌ళ్లిస్తున్నారు. దీంతో బంగారం, వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ రికార్డు స్థాయిని చేరేందుకు పోటీ ప‌డుతున్నాయి. బుధ‌వారం ఒక్క రోజే అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధ‌ర ఔన్స్‌కు 0.39 శాతం పెరిగి 4,385 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.62 శాతం మేర ఎగ‌బాకి 65 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 455 పాయింట్లు ఎగ‌బాకి 1,54,220 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1538 పాయింట్లు పెరిగి 2,37,158 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,486 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,23,888 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,54,860 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,48,600 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.10,400 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,195 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,13,560గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,41,950 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,19,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,500 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,614 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.92,912గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,16,140 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,61,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,700 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,55,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,550గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,60,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,600 గా ఉంది.

Advertisement
Advertisement