త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Constable Suicide | ఎల్బీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

Constable Suicide | హైదరాబాద్లోని (Hyderabad) ఎల్బీనగర్ (LB Nagar) ఏసీపీ ఆఫీస్లో ఓ కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌కు (Constable Suicide) పాల్ప‌డిన‌ ఘటన కలకలం రేపింది. రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ (Constable) బుధ‌వారం తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల‌కు రెస్ట్‌రూమ్‌లో ఉరివేసుకున్నాడు.

G

Telangana | Published On Aug 12, 2026, 9.25 am IST

Constable Suicide | ఎల్బీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌
Advertisement

Constable Suicide | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్లోని (Hyderabad) ఎల్బీనగర్ (LB Nagar) ఏసీపీ ఆఫీస్లో ఓ కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌కు (Constable Suicide) పాల్ప‌డిన‌ ఘటన కలకలం రేపింది. రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ (Constable) బుధ‌వారం తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల‌కు రెస్ట్‌రూమ్‌లో ఉరివేసుకున్నాడు. గుర్తించిన సిబ్బంది వెంట‌నే స‌మీపంలోని కామినేని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించారు. అయితే పోలీసులు ఈ వివ‌రాల‌ను గోప్యంగా ఉంచ‌టంతో అనుమానాల‌కు తావిస్తున్న‌ది.

రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండ‌లంలో బండ‌లేమురు గ్రామ రెవిన్యూ ప‌రిధి అర్జున తండ కు చెందిన సాయి కుమార్ (13128).. 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌. ఎల్బీన‌గ‌ర్ పీఎస్‌లో విధులు నిర్వ‌హిస్తున్న సాయి కుమార్‌ను ప్ర‌స్తుతం ఈ-కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ ఆఫీస్‌లో రైట‌ర్‌గా అటాచ్ చేశారు. ఈ క్ర‌మంలోనే బుధ‌వారం తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల స‌మ‌యంలో ఏసీపీ కార్యాల‌యంలోని రెస్ట్‌రూమ్‌లో (Rest Room) అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. అక్కడ ఉద్యోగం చేయడం ఇష్టం లేదని నోట్ రాసినట్లు సమాచారం.

అయితే ఒంటిపై రక్తపు గాయం ఉందని, ఎవరో హత్య చేసి ఉంటారని కానిస్టేబుల్ కుటుంబ‌ సభ్యులు ఆరోపించారు. ఉరి వేసుకుంటే ర‌క్తం ఎలా వస్తుందని ఏదో చేసి దాస్తున్నారని ఆందోళనకు దిగారు. హత్య చేసి ఉరి వేశారంటున్నారు. ఏం చేయకపోతే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఉస్మానియాకు ఎలా త‌ర‌లిస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా, కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement