త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni Apprenticeship | సింగ‌రేణిలో అప్రెంటిస్‌లు.. ఇంజినీరింగ్‌, నాన్ ఇంజినీరింగ్‌, డిప్లొమా చేసినవారు అర్హులు

Singareni Apprenticeship | ఇంజినీరింగ్​, నాన్​ ఇంజినీరింగ్​, డిప్లొమా పూర్తిచేసిన వారికి ఉద్యోగాల గ‌ని సింగరేణి గుడ్‌న్యూస్ చెప్పింది. అప్రెంటిస్‌షిప్ (Singareni Apprenticeship) చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

G

Telangana | Published On Aug 12, 2026, 10.01 am IST

Singareni Apprenticeship | సింగ‌రేణిలో అప్రెంటిస్‌లు.. ఇంజినీరింగ్‌, నాన్ ఇంజినీరింగ్‌, డిప్లొమా చేసినవారు అర్హులు
Advertisement

Singareni Apprenticeship | త్రినేత్ర‌.న్యూస్‌: ఇంజినీరింగ్​, నాన్​ ఇంజినీరింగ్​, డిప్లొమా పూర్తిచేసిన వారికి ఉద్యోగాల గ‌ని సింగరేణి గుడ్‌న్యూస్ చెప్పింది. అప్రెంటిస్‌షిప్ (Singareni Apprenticeship) చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. కంపెనీ 300 మంది సంస్థ ఉద్యోగుల‌తో పాటు ఇత‌రుల‌కు అవ‌కాశం క‌ల్పించింది. 2023-24 నుంచి 2025-26 మధ్య కాలంలో కోర్సులు పూర్తి చేసిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్​ విభాగంలో 150 మంది, నాన్​ ఇంజినీరింగ్​ గ్రాడ్యుయేట్లు 100, డిప్లొమా పూర్తి చేసిన 50 మందికి అప్రెంటిస్​షిప్​ చేసేందుకు అవకాశం కల్పించారు.

అప్రెంటిస్‌ల సంఖ్య‌: 300

ఇంజినీరింగ్- 150 (మైనింగ్​ 40, ఈఈఈ 35, ఈసీఈ 10, ఈఎస్​ఈ 10, ఐటీ 5, మెకానికల్ 35, సివిల్ 15)
నాన్​ ఇంజినీరింగ్​- 100 (బీఏ 25, బీఎస్సీ 30, బీకాం 25, బీ-ఫార్మసీ 10, బీబీఏ 5, బీసీఏ 5)
డిప్లొమా- 50 (మైనింగ్​ 20, ఈఈఈ 10, మెకానికల్​ 10, సివిల్​ 10)

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మార్కుల ఆధారంగా. సింగ‌రేణి ఉద్యోగుల పిల్ల‌ల‌కు ప్రాధాన్యం ఇస్తారు. అప్రెంటిస్‌ సమయంలో ఇంజినీరింగ్​, నాన్​ ఇంజినీరింగ్​ అభ్యర్థులకు నెలకు రూ.12,300, డిప్లొమా వారికి రూ.10,900 ఉపకార వేతనం అందిస్తారు.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో
అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా www.education.gov.in ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత సింగరేణి అప్రెంటిస్​షిప్​ పోర్టల్​ www.scclmines.com/apprenticeship దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం వీటితో పాటు అవసరమైన ధ్రువపత్రాలు జత చేసి ఈ నెల 16 సాయంత్రం 5 గంటల్లోపు ఏరియాల్లోని గనుల వృత్తి శిక్షణ కేంద్రాల్లో అందజేయాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 16
వెబ్‌సైట్‌: www.scclmines.com/apprenticeship

మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Advertisement
Advertisement