Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. మార్కెట్‌లలో తీవ్ర హెచ్చు తగ్గులు..
Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటుండడం, పశ్చిమ ఆసియాలో క్రమంగా పరిస్థితులు సద్దుమణుగుతుండడంతో బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తులను కొనేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే గత కొద్ది వారాలుగా ఈ లోహాల ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటుండడం, పశ్చిమ ఆసియాలో క్రమంగా పరిస్థితులు సద్దుమణుగుతుండడంతో బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తులను కొనేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే గత కొద్ది వారాలుగా ఈ లోహాల ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. అయితే ఈక్విటీ మార్కెట్లలో ప్రస్తుతం ఉన్న అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో బంగారం, వెండి ధరల్లోనూ తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇలాంటి సమయాల్లో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇక అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో సోమవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఔన్స్ బంగారం ధర 0.18 శాతం తగ్గి 4,334 డాలర్లకు చేరగా, వెండి ధర 0.40 శాతం పెరిగి 63 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 324 పాయింట్లు పెరిగి 1,52,065 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2096 పాయింట్లు పెరిగి 2,33,562 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,197 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,21, 576 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,51,970 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,19,700 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3,800 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,930 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,440గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,39,300 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,93,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,398 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,184గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,13,980 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,39,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,800 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold Recycling | భారతీయుల కొత్త ట్రెండ్.. బంగారాన్ని అమ్మడం లేదు..
ఆగస్టు 8, 2026

Gold And Silver Prices Today | మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. పెట్టుబడిదారుల ఉత్సాహం..
ఆగస్టు 8, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Security Guard | ఉద్యోగంలో చేరిన నాలుగు రోజులకే.. మహిళపై సెక్యూరిటీ గార్డ్ అఘాయిత్యం
- ●IPO | ఈ వారంలో ఐపీవోల జాతర.. ఇన్వెస్టర్లకు అలర్ట్..
- ●Stock Markets | స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత..
- ●Somasila | కృష్ణానదిలో పెరిగిన నీటిమట్టం.. సోమశిలలో బోటింగ్ సేవలు మళ్లీ ప్రారంభం
- ●Narsingi | హిట్ అండ్ రన్.. నార్సింగిలో కారు బీభత్సం.. ఆర్మీ జవాన్ మృతి
- ●Village | ఊరు ఒకటే.. కానీ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు వేర్వేరు..

Security Guard | ఉద్యోగంలో చేరిన నాలుగు రోజులకే.. మహిళపై సెక్యూరిటీ గార్డ్ అఘాయిత్యం

IPO | ఈ వారంలో ఐపీవోల జాతర.. ఇన్వెస్టర్లకు అలర్ట్..

Stock Markets | స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత..

Somasila | కృష్ణానదిలో పెరిగిన నీటిమట్టం.. సోమశిలలో బోటింగ్ సేవలు మళ్లీ ప్రారంభం



