General Motors | 1,000 మంది ఉద్యోగులను తొలగించి.. 50 రోబోలను నియమించుకున్న సంస్థ
General Motors | అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ (General Motors) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. డెట్రాయిట్‌లోని తన ప్రధాన అసెంబ్లీ ప్లాంట్ (Detroit Plant)లో దాదాపు 1,000 కంటే ఎక్కువ మందిపై వేటు వేసింది.
General Motors | ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఏఐ టూల్, రోబోల కారణంగా పెద్ద పెద్ద కంపెనీలు సైతం భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ (General Motors) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. డెట్రాయిట్‌లోని తన ప్రధాన అసెంబ్లీ ప్లాంట్ (Detroit Plant)లో దాదాపు 1,000 కంటే ఎక్కువ మందిపై వేటు వేసింది. వారి స్థానంలో 50 కొత్త రోబోలను (Robots) రంగంలోకి దించింది.
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. మిచిగాన్‌లోని ‘ఫ్యాక్టరీ జీరో’ (Factory ZERO) ప్లాంట్‌లో ఈ కొత్త రోబోలను ప్రవేశపెట్టారు. వీటిని కోబోట్స్ లేదా కొలాబరేటివ్ రోబోట్స్ అని పిలుస్తారు. అసెంబ్లీ లైన్‌లో మిగిలిన సిబ్బందితో కలిసి ఇవి వాహనాల బాడీ ప్యానెల్స్‌ను అమర్చే పని చేస్తున్నాయి. తమ కార్యకలాపాల్లో అధునాతన టెక్నాలజీని తీసుకురావడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. మార్కెట్‌లో పోటీని తట్టుకుని నిలబడటంతోపాటూ కార్మికుల భద్రత, పని సౌలభ్యం మెరుపరచడానికి ఈ కోబోట్లు అవసరమని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
యాహూ ఫైనాన్స్ (Yahoo Finance) నివేదిక ప్రకారం.. 2026 మొదటి త్రైమాసికంలో జనరల్ మోటార్స్ (GM) ఏకంగా 4.25 బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22% అధికం. లాభాలు గడిస్తున్నప్పటికీ ఉద్యోగులను తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మానవ కార్మికుల (Human Workers) స్థానంలో యంత్రాలను నియమించడంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read..
నీట్ రీఎగ్జామ్ పేపర్ లీక్..? ఎన్‌టీఏ ఏమన్నదంటే..?
అదే జరిగితే భారత్‌తో యుద్ధమే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు
తాజావార్తలు
- ●Free Bus | సీనియర్ సిటిజన్స్‌కు ఫ్రీ బస్?
- ●Raashi Khanna | సమంత భర్త బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి రాశీఖన్నా ఔట్ - టాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్
- ●Vikarabad | వికారాబాద్‌లో మహిళ అదృశ్యం.. నారాయణపేటలో సగం కాలిన స్థితిలో మృతదేహం..
- ●Medicover | కంగ్రాట్స్ రేవంత్ రెడ్డిగారు.. రూ.13,200 కోట్లు.. హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు..
- ●Singeetham Srinivasa Rao | చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో సింగీతం సినిమాలు - అనౌన్స్మెంట్తోనే సంచలనం ..కానీ...
- ●పెగ్‌తో నిద్ర ఓకే… మరి ఫ్రెష్‌నెస్ ఎక్కడ?

Free Bus | సీనియర్ సిటిజన్స్‌కు ఫ్రీ బస్?

Raashi Khanna | సమంత భర్త బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి రాశీఖన్నా ఔట్ - టాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్

Vikarabad | వికారాబాద్‌లో మహిళ అదృశ్యం.. నారాయణపేటలో సగం కాలిన స్థితిలో మృతదేహం..

Medicover | కంగ్రాట్స్ రేవంత్ రెడ్డిగారు.. రూ.13,200 కోట్లు.. హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు..



