త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Freshers | ఫ్రెష‌ర్ల‌కు ఈ రంగాల్లో చ‌క్క‌ని ఉద్యోగావ‌కాశాలు.. కాస్త క‌ష్ట‌ప‌డితే అద్భుత‌మైన కెరీర్‌..

Freshers | భారత ఉద్యోగ మార్కెట్‌లో 2026 సంవత్సరంలో ఫ్రెషర్లకు అనేక కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా టెక్నికల్ లేదా ఇంజినీరింగ్ నేపథ్యం లేని యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి.

S

Business | Published On Mar 16, 2026, 10.27 am IST

Freshers | ఫ్రెష‌ర్ల‌కు ఈ రంగాల్లో చ‌క్క‌ని ఉద్యోగావ‌కాశాలు.. కాస్త క‌ష్ట‌ప‌డితే అద్భుత‌మైన కెరీర్‌..
Advertisement

Freshers | భారత ఉద్యోగ మార్కెట్‌లో 2026 సంవత్సరంలో ఫ్రెషర్లకు అనేక కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా టెక్నికల్ లేదా ఇంజినీరింగ్ నేపథ్యం లేని యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. డిజిటల్ సేవలు, మార్కెటింగ్, ఫైనాన్స్, కస్టమర్ సపోర్ట్ రంగాల్లో వ్యాపారాలు విస్తరిస్తున్న నేపథ్యంలో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సృజనాత్మకత కలిగిన ఫ్రెషర్లను సంస్థలు పెద్ద సంఖ్యలో నియమించుకుంటున్నాయి. 2026లో భారత ఉద్యోగ మార్కెట్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో డిజిటల్ మార్కెటింగ్ ఒక‌టిగా నిలిచింది. అనేక కంపెనీలు సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించగలిగే, ఆన్‌లైన్ మార్కెటింగ్ క్యాంపెయిన్లు రూపొందించగలిగే, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలపై తమ ఉత్పత్తులను ప్రచారం చేయగలిగే ఫ్రెషర్లను నియమించుకుంటున్నాయి. ఈ ఉద్యోగానికి ప్రత్యేకమైన సాంకేతిక నైపుణ్యాలు అవసరం లేకపోయినా, సృజనాత్మకత, ఆన్‌లైన్ మార్కెటింగ్ సాధనాలపై ప్రాథమిక అవగాహన అవసరం ఉంటుంది.

కంటెంట్ రైటింగ్‌, హ్యూమ‌న్ రిసోర్సెస్‌..

మరో ప్రముఖ రంగంగా కంటెంట్ రైటింగ్, కాపీరైటింగ్ నిలిచింది. స్టార్టప్‌లు, మీడియా సంస్థలు, ఈ-కామర్స్ కంపెనీలు తమ వెబ్‌సైట్ల కోసం బ్లాగులు, ఇతర కంటెంట్ రాయడానికి రచయితలపై ఆధార పడుతున్నాయి. మంచి ఇంగ్లీష్ లేదా ప్రాంతీయ భాషలపై పట్టు ఉన్న ఫ్రెషర్లు ఈ రంగంలో సులభంగా ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. హ్యూమన్ రిసోర్సెస్ (HR) రంగం కూడా ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న మరో ముఖ్యమైన విభాగంగా నిలిచింది. కంపెనీల్లో నియామకాలు, కొత్త ఉద్యోగుల పరిచయ కార్యక్రమాలు, సంస్థలో కమ్యూనికేషన్‌ను నిర్వహించడానికి హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్‌లను సంస్థలు నియమించుకుంటున్నాయి. బిజినెస్, ఆర్ట్స్ నేపథ్యం ఉన్న ఫ్రెషర్లకు ఈ రంగం ఒక మంచి కెరీర్ ఎంపికగా మారింది. ఎందుకంటే ఇందులో మంచి ఎదుగుదల అవకాశాలు ఏర్ప‌డుతున్నాయి.

సేల్స్‌, క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్‌..

సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగంలో కూడా పెద్ద సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకుంటున్నారు. ఇందులో కస్టమర్లతో ప్రత్యక్షంగా మాట్లాడటం, సంస్థ సేవలను వారికి పరిచయం చేయడం వంటి బాధ్యతలు ఉంటాయి. మార్కెట్‌లో ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న మరో కొత్త ఉద్యోగ రంగం కస్టమర్ సపోర్ట్, కస్టమర్ సక్సెస్ స్పెషలిస్ట్ అని చెప్ప‌వ‌చ్చు. ఆన్‌లైన్ సేవలు పెరుగుతున్న నేపథ్యంలో అనేక కంపెనీలు ఈ విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఈ విధంగా 2026లో భారత ఉద్యోగ మార్కెట్‌లో ఫ్రెషర్లకు అనేక కొత్త, విభిన్నమైన అవకాశాలు ఏర్పడుతున్నాయి. సరైన నైపుణ్యాలు, మంచి కమ్యూనికేషన్ సామర్థ్యం, నేర్చుకునే ఆసక్తి ఉంటే టెక్నికల్ నేపథ్యం లేని యువత కూడా ఈ రంగాల్లో విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement