త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Flipkart | ఫ్లిప్ కార్ట్‌లో ఫ్యాష‌న్ ఉత్ప‌త్తుల‌పై భారీ రాయితీలు.. కొత్త స‌మ్మ‌ర్ సేల్‌..

Flipkart | ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వేస‌వి నేప‌థ్యంలో క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రో అద్భుత‌మైన సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. GRWM GRWM పేరిట ప్ర‌త్యేక ఫ్యాష‌న్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ మే 29న ప్రారంభం కాగా జూన్ 7 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా సుమారు 10 ల‌క్ష‌ల‌కు పైగా ట్రెండీ స్టైల్ ఉత్ప‌త్తుల‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంచిన‌ట్లు కంపెనీ తెలిపింది.

S

Business | Published On May 30, 2026, 12.27 pm IST

Flipkart | ఫ్లిప్ కార్ట్‌లో ఫ్యాష‌న్ ఉత్ప‌త్తుల‌పై భారీ రాయితీలు.. కొత్త స‌మ్మ‌ర్ సేల్‌..
Advertisement

Flipkart | ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వేస‌వి నేప‌థ్యంలో క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రో అద్భుత‌మైన సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. GRWM GRWM పేరిట ప్ర‌త్యేక ఫ్యాష‌న్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ మే 29న ప్రారంభం కాగా జూన్ 7 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా సుమారు 10 ల‌క్ష‌ల‌కు పైగా ట్రెండీ స్టైల్ ఉత్ప‌త్తుల‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంచిన‌ట్లు కంపెనీ తెలిపింది. గెట్ రెడీ విత్ మి అనే గ్లోబ‌ల్ జెన్‌జీ ట్రెండ్‌కు భార‌తీయ మ‌సాలాను జోడిస్తూ గ‌రం గ‌రం శైలిలో రూపొందించిన ఈ సేల్‌లో ఫ్యాష‌న్ షాపింగ్‌ను ఒక క‌ల్చ‌ర‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌గా మార్చ‌నున్నామ‌ని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇందులో భాగంగా అనేక ఉత్ప‌త్తుల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ముఖ్యంగా జెన్‌జీని దృష్టిలో ఉంచుకుని ఈ సేల్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు సంస్థ తెలిపింది. సుమారు 55 కోట్ల వ్యూస్ ఈ సేల్‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు వెల్ల‌డించింది.

భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ఉత్ప‌త్తులు..

ఈ సేల్‌లో అంత‌ర్జాతీయ, దేశీయ బ్రాండ్ల‌తోపాటు డైరెక్ట్ టు క‌న్‌జ్యూమ‌ర్ బ్రాండ్ల‌ను అందుబాటులో ఉంచారు. మార్కెట్ ప్లేస్ విక్రేత‌లు కూడా ఇందులో పాల్గొంటున్నారు. అందువ‌ల్ల వినియోగ‌దారుల‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌కే ఆయా ఉత్ప‌త్తులు ల‌భ్యం కానున్నాయి. ముఖ్యంగా బ్యాగీ జీన్స్‌, కొరియ‌న్ ట్రౌజ‌ర్స్‌, ఫ్లోర్ డ్రెస్‌లు, ప‌లాజో సెట్లు వంటి తాజా ఫ్యాష‌న్ ట్రెండీ ఉత్ప‌త్తుల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తున్నారు. లీవైస్‌, టైటాన్‌, రెడ్ టేప్‌, నైకీ, ప్యూమా, ఆసిక్స్‌, స‌ఫారి, రేర్ రాబిట్‌, ది బేర్ హౌస్ వంటి ప్ర‌ముఖ బ్రాండ్ల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌పై ఏకంగా 90 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అలాగే సూప‌ర్ కాయిన్స్ ఆఫ‌ర్లు, స్క్రాచ్ కార్డులు, బ్యాంక్ డిస్కౌంట్ల‌ను కూడా వినియోగ‌దారులు పొంద‌వ‌చ్చు. దేశ‌వ్యాప్తంగా వివిధ బ‌డ్జెట్ల వినియోగ‌దారుల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సేల్‌ను, ఆఫ‌ర్ల‌ను అందిస్తున్న‌ట్లు సంస్థ తెలిపింది.

Advertisement
Advertisement