SIP | రూ.33 పెట్టుబడి.. రూ.5 లక్షలకు పైగా ఫండ్.. ఎలా సాధ్యం ?
SIP | ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంటి అద్దె, ఈఎంఐలు, రోజువారీ ఖర్చుల కారణంగా ప్రతి నెల పెద్ద మొత్తంలో పొదుపు చేయడం చాలా మందికి కష్టంగా మారింది. దీంతో చేతిలో మంచి మొత్తం వచ్చిన తర్వాతే పెట్టుబడి ప్రారంభిద్దామని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇది ఒక పెద్ద అపోహ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
SIP | ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంటి అద్దె, ఈఎంఐలు, రోజువారీ ఖర్చుల కారణంగా ప్రతి నెల పెద్ద మొత్తంలో పొదుపు చేయడం చాలా మందికి కష్టంగా మారింది. దీంతో చేతిలో మంచి మొత్తం వచ్చిన తర్వాతే పెట్టుబడి ప్రారంభిద్దామని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇది ఒక పెద్ద అపోహ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా చాలా చిన్న మొత్తంతో కూడా దీర్ఘకాలంలో భారీ సంపదను నిర్మించుకోవచ్చు. రోజుకు కేవలం రూ.33 లేదా నెలకు రూ.1వేయి పెట్టుబడి పెట్టినా, కాలక్రమేణా అది లక్షల రూపాయల ఫండ్‌గా మారే అవకాశం ఉంటుంది. నెలకు రూ.100, రూ.500, రూ.1వేయి ఎస్ఐపీ చేస్తే 5, 10, 15 ఏళ్లలో ఎంత మొత్తం సమకూరుతుందో నిపుణులు వివరాలను వెల్లడిస్తున్నారు.
ఓర్పు అవసరం..
ఎస్ఐపీ ప్రత్యేకత ఏంటంటే, ప్రతి నెల నిర్దిష్ట మొత్తాన్ని ఆటోమేటిక్‌గా పెట్టుబడి రూపంలో కేటాయించే అలవాటును పెంపొందిస్తుంది. దీంతో అనవసర ఖర్చులు తగ్గి, భవిష్యత్తు కోసం క్రమబద్ధమైన పెట్టుబడి కొనసాగుతుంది. దీనికి స్టాక్ మార్కెట్‌పై ప్రత్యేక పరిజ్ఞానం అవసరం లేదు. చిన్న మొత్తంతోనే ఈక్విటీ లేదా బాండ్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తుంది. అంతేకాదు, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొనేలా డబ్బు విలువను దీర్ఘకాలంలో కాపాడటానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రఖ్యాత పెట్టుబడిదారు వారెన్ బఫెట్ చెప్పినట్లు, స్టాక్ మార్కెట్ అంటే ఓర్పు లేని వారి నుంచి డబ్బును తీసుకుని, ఓర్పు ఉన్న వారికి అందించే వ్యవస్థ. అలాగే కాంపౌండింగ్ ప్రభావం వల్ల అసలు పెట్టుబడిపైనే కాకుండా వచ్చిన లాభాలపై కూడా మరింత లాభం లభిస్తూ, కాలక్రమేణా సంపద వేగంగా పెరుగుతుంది.
ఎస్ఐపీ లెక్కలు ఇలా..
దీర్ఘకాల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు సగటున వార్షిక రాబడి 12 శాతం వస్తుందని భావించి, సెబీ ప్రామాణిక కాలిక్యులేటర్‌తోపాటు ఇతర ఫైనాన్షియల్ పోర్టల్స్ ఆధారంగా లెక్కలు పరిశీలిస్తే ఆసక్తికరమైన ఫలితాలు కనిపిస్తాయి. నెలకు రూ.1వేయి ఎస్ఐపీ చేస్తే, 5 సంవత్సరాల్లో మొత్తం పెట్టుబడి రూ.60వేలు కాగా, అది సుమారు రూ.82,760గా పెరుగుతుంది. 10 సంవత్సరాల్లో మొత్తం పెట్టుబడి రూ.1.20 లక్షలు ఉండగా, అది దాదాపు రూ.2.33 లక్షలకు చేరుతుంది. అదే 15 సంవత్సరాల పాటు కొనసాగిస్తే మొత్తం పెట్టుబడి రూ.1.80 లక్షలు మాత్రమే అయినప్పటికీ, కాంపౌండింగ్ ప్రభావంతో అది సుమారు రూ.5.06 లక్షల ఫండ్‌గా మారుతుంది. బడ్జెట్ ఇంకా తక్కువగా ఉన్నా కూడా ఎస్ఐపీ ప్రారంభించవచ్చు. నెలకు రూ.100 పెట్టుబడి పెడితే, 5 సంవత్సరాల్లో సుమారు రూ.8,276, 10 సంవత్సరాల్లో రూ.23,351, 15 సంవత్సరాల్లో రూ.50,630 సమకూరే అవకాశం ఉంటుంది.
పెట్టుబడిని పెంచితే..
నెలకు రూ.500 ఎస్ఐపీ చేస్తే, 5 సంవత్సరాల్లో సుమారు రూ.41,380, 10 సంవత్సరాల్లో దాదాపు రూ.1.16 లక్షలు, 15 సంవత్సరాల్లో సుమారు రూ.2.53 లక్షల ఫండ్‌గా పెరిగే అవకాశం ఉంటుంది. నెలకు రూ.1వేయి ఎస్ఐపీ చేస్తే, 5 సంవత్సరాల్లో రూ.82,760, 10 సంవత్సరాల్లో రూ.2.33 లక్షలు, 15 సంవత్సరాల్లో రూ.5.06 లక్షల వరకు ఫండ్ సమకూరుతుంది. ఈ లెక్కలు పరిశీలిస్తే, నెలవారీ పెట్టుబడిని రూ.100 నుంచి రూ.500కు పెంచడం ద్వారా 15 సంవత్సరాల తర్వాత సమకూరే మొత్తం నేరుగా రూ.2.5 లక్షలను దాటుతుందని స్పష్టమవుతోంది. ఎస్ఐపీలో అత్యంత ముఖ్యమైన అంశం సమయం. ఎంత త్వరగా పెట్టుబడి ప్రారంభిస్తే, డబ్బు అంత ఎక్కువ కాలం కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పొందుతుంది. అందుకే పెద్ద మొత్తం కోసం ఎదురు చూడకుండా, చేతనైన చిన్న మొత్తంతోనే వెంటనే పెట్టుబడి ప్రారంభించడం ద్వారా భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను నిర్మించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jagga Reddy | క్యూరింగ్ కాక మేడిగడ్డ కూలిపోయింది : జగ్గారెడ్డి
- ●Jaggareddy | హరీశ్‌రావు.. ఖమ్మం జిల్లా కొట్టుకుపోయినా పర్వాలేదా..? : జగ్గారెడ్డి
- ●OpenAI | రూ.2 కోట్ల జీతం.. ఓపెన్ఏఐలో భారీ ఉద్యోగ అవకాశం..
- ●Ponguleti | ప్రజలపై బీఆర్ఎస్ రూ.8.5 లక్షల కోట్ల అప్పుభారం.. రెండేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు : పొంగులేటి
- ●Hardeep Singh Nijjar | ట్రూడోకు షాక్.. నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం లేదన్న కెనడా
- ●Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్

Jagga Reddy | క్యూరింగ్ కాక మేడిగడ్డ కూలిపోయింది : జగ్గారెడ్డి

Jaggareddy | హరీశ్‌రావు.. ఖమ్మం జిల్లా కొట్టుకుపోయినా పర్వాలేదా..? : జగ్గారెడ్డి

OpenAI | రూ.2 కోట్ల జీతం.. ఓపెన్ఏఐలో భారీ ఉద్యోగ అవకాశం..

Ponguleti | ప్రజలపై బీఆర్ఎస్ రూ.8.5 లక్షల కోట్ల అప్పుభారం.. రెండేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు : పొంగులేటి






