Salary In Cities | నెలకు రూ.2 లక్షల జీతం వచ్చినా చాలట్లేదా..? సీఏ చెబుతున్న మాటలు..!
Salary In Cities | నెలకు రూ.2 లక్షల జీతం అంటే ఆర్థికంగా సురక్షితంగా ఉన్నట్లు చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో నివసించే ఉద్యోగులకు ఈ జీతం కూడా చాలడం లేదన్న భావన పెరుగుతోంది.
Salary In Cities | నెలకు రూ.2 లక్షల జీతం అంటే ఆర్థికంగా సురక్షితంగా ఉన్నట్లు చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో నివసించే ఉద్యోగులకు ఈ జీతం కూడా చాలడం లేదన్న భావన పెరుగుతోంది. పెరుగుతున్న ఖర్చులు, అప్పులు, జీవన వ్యయాలు కలిసి అనేకమందిని ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ అంశంపై ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ స్పందిస్తూ, భారత మధ్యతరగతి నిరంతర ఆర్థిక ఒత్తిడిలో చిక్కుకుపోతుందని అన్నారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.
ఖర్చులు తడిసి మోపెడు..
గత పదేళ్లలో ప్రైవేట్ స్కూల్ ఫీజులు దాదాపు 160 శాతం వరకు పెరిగాయని నితిన్ కౌశిక్ పేర్కొన్నారు. ఆదాయ వృద్ధిని మించిపోయిన ఈ పెరుగుదల వల్ల, మధ్యతరగతి కుటుంబాలు పిల్లల చదువు కోసం ఇతర అవసరాలపై రాజీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాథమిక విద్య కూడా విలాసంగా మారుతోందని అన్నారు. వైద్య రంగంలో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. భారతదేశంలో వైద్య ద్రవ్యోల్బణం సుమారు 14 శాతానికి చేరిందని ఆయన తెలిపారు. ఇది ఆసియాలోనే అత్యధిక స్థాయి. సాధారణ వైద్య సేవలకే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుండటంతో, అనుకోని మెడికల్ ఎమర్జెన్సీలు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భయంగా మారాయని అన్నారు.
హోమ్ లోన్‌కే సగం వేతనం..
దేశంలోని పట్టణాల్లో గృహ నిర్మాణ వ్యయం మరో పెద్ద భారంగా మారిందని కౌశిక్ అన్నారు. ముంబైలో ధర-ఆదాయ నిష్పత్తి 15 రెట్లు ఉండగా, ఢిల్లీలో ఇది 12 రెట్లుగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో సగటు జీతభత్యాలపై ఆధారపడే ఉద్యోగులు ఇల్లు కొనాలంటే 20 ఏళ్ల హోమ్ లోన్ తప్పనిసరి అవుతోంది. దాంతో నెలవారీ ఆదాయంలో దాదాపు 50 శాతం ఈఎంఐలకే వెచ్చించాల్సి వస్తోందని అన్నారు. మనం ఒక ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతున్నట్టే జీవిస్తున్నాం. 30 శాతం పన్నులకు, 25 శాతం అద్దెకు, 20 శాతం ప్రభుత్వం సరిగ్గా అందించని మౌలిక సేవలకు ఖర్చవుతోంది. నిజంగా చెప్పాలంటే మధ్య తరగతి వర్గం సంపదను నిర్మించడం లేదు. రియల్ ఎస్టేట్, విద్యా, వైద్య రంగాలకు అప్పులు తీర్చే యంత్రంగా మారిందన్నారు. ఈ క్రమంలోనే కౌశిక్ ఎక్స్ వేదికగా ఓ పోస్టులో ఆయా విషయాలను పేర్కొన్నారు.
భిన్న రకాలుగా నెటిజన్ల స్పందన..
అయితే కౌశిక్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. నెలకు రూ.2 లక్షల జీతం అంటే మామూలు కాదు. అలాంటి జీతం చాలా మందికి ఉండదు, అంత జీతం వచ్చినా మిగలకపోవడం ఏంటి.. అని కొందరు ప్రశ్నించగా, రూ.2 లక్షలు జీతం ఉన్న చాలా మంది హ్యాపీగానే ఉన్నారు, మీ అంచనా తప్పు.. అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక కొందరు మాత్రం, జీతం ఎంత ఉందన్నది ముఖ్యం కాదు, మనీని ఎలా మేనేజ్ చేశాం అన్నది ముఖ్యం.. మనీ మేనేజ్‌మెంట్ తెలియకపోతే జీతం రూ.10 లక్షలు వచ్చినా నెల తిరిగే సరికి ఏమీ మిగలదు.. అని కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టణాల్లో వేతనాలు, జీవన వ్యయాలు అనే అంశం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
⚠️ The Indian middle class is being crushed by a MATHEMATICAL impossibility
that no one wants to admit.Earning ₹2 lakh a month in a Tier-1 city sounds like a win —
until you realize:📚 Private school fees have surged 160% in a decade
🏥 Medical inflation is running at 14% —…— CA Nitin Kaushik (FCA) | LLB (@Finance_Bareek) January 27, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



