EPF Account | EPF ఖాతాలో డేట్ ఆఫ్ జాయినింగ్ లేదా ఎగ్జిట్ తప్పుగా ఉన్నాయా.. అయితే వెంటనే మార్చుకోండి..
EPF Account | కొత్త ఉద్యోగంలో చేరిన ఆనందంలో ఉద్యోగులు తరచూ తమ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాను పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి బదిలీ చేయడానికి సమయం తీసుకుంటూ చివరకు ఆ విషయాన్ని మరిచిపోతుంటారు. సాధారణంగా కొందరికి తరచూ ఇలా జరుగుతుంటుంది.
EPF Account | కొత్త ఉద్యోగంలో చేరిన ఆనందంలో ఉద్యోగులు తరచూ తమ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాను పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి బదిలీ చేయడానికి సమయం తీసుకుంటూ చివరకు ఆ విషయాన్ని మరిచిపోతుంటారు. సాధారణంగా కొందరికి తరచూ ఇలా జరుగుతుంటుంది. అయితే ఈ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకునే అవకాశాలు ఉంటాయి. చాలా కాలం పాటు ఉపయోగించని EPF ఖాతా ఇనాక్టివ్ గా మారే అవకాశం ఉండటంతోపాటు కొన్ని సందర్భాల్లో వడ్డీ కూడా ఆగిపోయే చాన్సులు ఉంటాయి. అందుకే ఉద్యోగంలో చేరిన తేదీ (Date of Joining), విడిచిపెట్టిన తేదీ (Date of Exit) వివరాలను EPFO ఖాతాలో తప్పకుండా మార్చాల్సి ఉంటుంది.
భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం..
ఇటీవల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా వెల్లడించింది. ఉద్యోగులు తమ Date of Joining లేదా Exitలో చిన్న తప్పిదం చేసినా కూడా వారి భవిష్యత్ ప్రయోజనాలను ప్రభావితం చేస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయొద్దని, వెంటనే ఉద్యోగులు తమ వివరాలను చెక్ చేసి సరిచేసుకోవాలని సూచించింది. ఉద్యోగులు PF, పెన్షన్‌ను సురక్షితంగా ఉంచుకోవాలని EPFO తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. EPFO ప్రకారం 2017 అక్టోబర్ 1 తర్వాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) క్రియేట్ అయిన ఖాతాలు, ఆధార్‌తో ధ్రువీకరించబడిన సభ్యులు తమ పేరు, పుట్టిన తేదీ, లింగం, వివాహ స్థితి, ఉద్యోగంలో చేరిన, విడిచి పెట్టిన తేదీలను స్వయంగా ఆన్‌లైన్‌లో సవరించుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని తెలియజేసింది. అంతేకాకుండా సభ్యులు తమ జాతీయతను కూడా రెండు సందర్భాల్లో స్వయంగా మార్చుకోవచ్చు. ఒకటి కాలమ్ ఖాళీగా ఉన్నప్పుడు ఇండియన్ గా నమోదు చేయవచ్చు. రెండోది ఇండియన్ నుంచి ఇంటర్నేషనల్ వర్కర్‌గా మార్చవచ్చు.
https://twitter.com/officialepfo/status/2040283793270120596
2017 అక్టోబర్ 1కి ముందు ఖాతా అయితే..
అయితే 2017 అక్టోబర్ 1కి ముందు UAN పొందిన, ఆధార్‌తో ధ్రువీకరించబడిన ఖాతాల విషయంలో మార్పుల అభ్యర్థనలు ఎంప్లాయర్ ద్వారా ఆన్‌లైన్‌లో EPFOకి పంపిస్తారు. అనంతరం సంబంధిత అధికారి వాటిని పరిశీలించి ఆమోదిస్తారు. ఉద్యోగంలో చేరిన, విడిచి పెట్టిన తేదీల మార్పులు EPFOలో నమోదైన కాంట్రిబ్యూషన్‌తో సరిపోతేనే అమలులోకి వస్తాయి. ఏవైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే సంబంధిత అధికారుల అనుమతి అవసరం అవుతుంది. ఈ పరిస్థితిలో సభ్యుడి వివరాల్లో మార్పులు చేయడానికి ఎంప్లాయర్ ఆమోదం తప్పనిసరి. ఈ ప్రక్రియలో ఎంప్లాయర్ బాధ్యత ముఖ్యమైనది. సభ్యుడు ఆన్‌లైన్ జాయింట్ డిక్లరేషన్ సమర్పించడం ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించాలి.
UAN లేకున్నా, ఆధార్ ధ్రువీకరించకపోయినా..
అయితే ఆధార్ ధ్రువీకరణ లేని UAN ఖాతాలు లేదా UAN లేనివి ఉంటే మార్పులు చేయడానికి మాన్యువల్ విధానం అనుసరించాల్సి ఉంటుంది. మరణించిన సభ్యుడి తరఫున క్లెయిమ్ చేస్తున్న సందర్భాల్లో కూడా ఇదే విధానం అమల్లో ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సభ్యుడు లేదా క్లెయిమెంట్ ఫిజికల్ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ పూరించి ఎంప్లాయర్‌కు ఇవ్వాలి. ఎంప్లాయర్ తమ పోర్టల్ ద్వారా ఈ డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత EPF కార్యాలయంలో దీనిపై సమీక్ష జరిగి అధికారి ఆమోదం ఇస్తారు. ఒకవేళ ఎంప్లాయర్ అప్‌లోడ్ చేయలేని పరిస్థితి ఉంటే సభ్యుడు లేదా క్లెయిమెంట్ నేరుగా EPF కార్యాలయంలో ఫామ్ సమర్పించాలి. అక్కడ అధికారుల ద్వారా అది సిస్టమ్‌లో నమోదు చేయబడిన తరువాత దానికి తుది ఆమోదం లభిస్తుంది. దాంతో ప్రక్రియ పూర్తవుతుంది.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



