త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PAN Card | పాన్ కార్డు విష‌యంలో  ఈ త‌ప్పు చేస్తే అంతే.. జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంది..!

PAN Card | ప్ర‌స్తుతం ఆధార్ కార్డులాగే పాన్ కార్డు కూడా మ‌న‌కు ఒక అత్య‌వ‌స‌ర‌మైన ప‌త్రంగా మారింది. గతంలో కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే, ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేస్తే పాన్ వాడేవారు. కానీ క్ర‌మంగా పాన్‌ను అన్ని ఆర్థిక లావాదేవీలు, ఇత‌ర ప‌నుల‌కు కూడా ఉప‌యోగిస్తున్నారు. బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు పాన్ త‌ప్పనిస‌రి.

S

Business | Published On Jan 11, 2026, 6.35 am IST

PAN Card | పాన్ కార్డు విష‌యంలో  ఈ త‌ప్పు చేస్తే అంతే.. జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంది..!
Advertisement

PAN Card | ప్ర‌స్తుతం ఆధార్ కార్డులాగే పాన్ కార్డు కూడా మ‌న‌కు ఒక అత్య‌వ‌స‌ర‌మైన ప‌త్రంగా మారింది. గతంలో కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే, ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేస్తే పాన్ వాడేవారు. కానీ క్ర‌మంగా పాన్‌ను అన్ని ఆర్థిక లావాదేవీలు, ఇత‌ర ప‌నుల‌కు కూడా ఉప‌యోగిస్తున్నారు. బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు పాన్ త‌ప్పనిస‌రి. అలాగే పలు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు కూడా పాన్‌ను అడుగుతున్నారు. ఇక ఆర్థిక లావాదేవీల‌కు కూడా పాన్ అవ‌స‌రం అవుతోంది. వ్యాపారులు త‌మ వ్యాపార లావాదేవీలు, పన్ను చెల్లింపుల కోసం కూడా పాన్ ను వాడుతున్నారు. ఇలా పాన్ అంద‌రికీ అత్య‌వ‌స‌రంగా మారింది. అయితే చాలా మంది తెలిసీ తెలియ‌క పాన్ విషయంలో కొన్ని త‌ప్పులు చేస్తుంటారు. వాటిల్లో డూప్లికేట్ పాన్ కార్డుల‌ను క‌లిగి ఉండ‌డం కూడా ఒక‌టి.

జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంది..

కొంద‌రికి ఒక‌టిక‌న్నా ఎక్కువ పాన్ కార్డులు ఉంటాయి. వాటినే డూప్లికేట్ పాన్ కార్డులు అంటారు. అయితే మొద‌ట తీసుకున్న పాన్ కార్డు పోయింద‌ని లేదా తెలియ‌కుండానే ప‌లు కార‌ణాల వ‌ల్ల కొంద‌రు ఒక‌టి క‌న్నా ఎక్కువ పాన్ కార్డుల‌ను తీసుకుంటుంటారు. ఈ క్ర‌మంలో వాటిల్లో కేవ‌లం ఒక్క పాన్ కార్డునే వాడుతారు. ఇలా జ‌రిగితే ఆ వ్య‌క్తికి ఉండే మిగిలిన పాన్ కార్డుల‌ను గుర్తించ‌లేరు. కానీ ఇలా ఒక‌టి క‌న్నా ఎక్కువ పాన్ కార్డుల‌ను క‌లిగి ఉండ‌డం చ‌ట్ట ప్ర‌కారం నేర‌మే అవుతుంది. ఇక అలాంటి వారు ప‌న్ను చెల్లించ‌కుండా ఎగవేస్తే అలాంటి వారిపై ఇంకా క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారు. ఏకంగా జైలుకే వెళ్లాల్సి వస్తుంది. సాధార‌ణంగా ఆదాయ‌పు ప‌న్ను చట్టం ప్ర‌కారం ఒక వ్య‌క్తి కేవ‌లం ఒకే పాన్‌ను క‌లిగి ఉండాలి. కానీ ఎక్కువ సంఖ్య‌లో పాన్ కార్డుల‌ను క‌లిగి ఉంటే నేరంగా ప‌రిగ‌ణిస్తారు.

జ‌రిమానా కూడా..

ఒక‌టి క‌న్నా ఎక్కువ పాన్ కార్డుల‌ను క‌లిగి ఉండ‌డంతోపాటు ప‌న్ను చెల్లించ‌కుండా ఎగ‌వేస్తే అలాంటి వారిపై ఆదాయ‌పు పన్ను శాఖ వారు చ‌ర్య‌లు తీసుకుంటారు. అలాంటి వారిపై ఇన్‌క‌మ్ ట్యాక్స్ చ‌ట్టం సెక్ష‌న్ 272బి ప్ర‌కారం క్రిమిన‌ల్ కేసులను న‌మోదు చేస్తారు. ఇక నిందితుల‌కు రూ.10వేల జ‌రిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. క‌నుక అధికంగా ఆదాయం ఉన్న‌వారు క‌చ్చితంగా ఆదాయ‌పు ప‌న్ను చెల్లించాలి. అలాగే ఒక‌టి క‌న్నా ఎక్కువ పాన్ కార్డుల‌ను కూడా క‌లిగి ఉండ‌కూడ‌దు.

ఇలా ర‌ద్దు చేసుకోవ‌చ్చు..

ఇక ఒక‌టిక‌న్నా ఎక్కువ పాన్ కార్డులు ఉంటే పౌరులు ఆ విష‌యాన్ని తెలియజేసి అనంత‌రం ఏదైనా ఒక పాన్ కార్డును ఉంచుకుని మిగిలిన కార్డులు అన్నింటినీ స‌రెండ‌ర్ చేయాల్సి ఉంటుంది. లేదా ఆదాయ‌పు పన్ను శాఖ‌కు చెందిన వెబ్‌సైట్ల‌లో డూప్లికేట్ పాన్ కార్డుల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు కూడా చేసుకోవచ్చు. దీంతో వారు ప‌రిశీలించి డూప్లికేట్ పాన్‌ల‌ను ర‌ద్దు చేస్తారు. ఇలా పౌరులు స‌హ‌క‌రించాల్సి ఉంటుంది. అయితే పాన్ కార్డును జారీ చేసే ఎన్ఎస్డీఎల్ లేదా యూటీఐటీఎస్ఎల్ వెబ్‌సైట్ల‌లో పౌరులు త‌మ డూప్లికేట్ పాన్ కార్డుల‌ను ర‌ద్దు చేసుకునేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆయా సైట్ల‌లో ఉండే రిక్వెస్ట్ ఫ‌ర్ స‌రెండ‌ర్ ఆఫ్ డూప్లికేట్ పాన్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకుని త‌మ‌కు ఉన్న డూప్లికేట్ పాన్ కార్డుల‌ను ర‌ద్దు చేయించుకోవ‌చ్చు. దీంతో ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉంటుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement