Disney Layoffs | ఉద్యోగులకు షాకిచ్చిన కొత్త సీఈవో.. డిస్నీలో వెయ్యి మందిపై వేటు
Disney Layoffs | ప్రపంచంలోనే అతిపెద్ద వినోద సంస్థల్లో ఒకటైన అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ The Walt Disney Company ఉద్యోగులకు షాకిచ్చింది. ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టింది.
Disney Layoffs | ప్రపంచంలోనే అతిపెద్ద వినోద సంస్థల్లో ఒకటైన అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ The Walt Disney Company ఉద్యోగులకు షాకిచ్చింది. ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టింది. వివిధ విభాగాల్లో పలువురు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. మార్కెటింగ్, స్టూడియోలు, టెలివిజన్ వ్యాపారం, ESPN, ప్రొడక్ట్, టెక్నాలజీ వంటి విభాగాల్లోని సుమారు వెయ్యి మంది ఉద్యోగులపై ఈ ప్రభావం ఉండనుంది. ఈ విషయాన్ని డిస్నీ సీఈవో (Disney CEO) జోష్ డి అమారో (Josh D Amaro) స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఉద్యోగులకు ఒక మెమో పంపారు.
వేగంగా మారుతున్న ఇండస్ట్రీ పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని గురించి అందులో పేర్కొన్నారు. క్వాలిటీ కంటెంట్‌ను అందిస్తూనే, మరింత చురుకైన , సమర్థవంతమైన సంస్థను నిర్మించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.సీఈవోగా బాధ్యతలు చేపట్టిన నెలరోజుల వ్యవధిలోనే ఆయన ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీవీ ఆదాయాలు తగ్గడం, బాక్సాఫీస్ వసూళ్లు తగ్గిపోవడంతోపాటూ అమెజాన్, యూట్యూబ్ వంటి టెక్ దిగ్గజాల నుంచి పెరిగిన పోటీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, 2022 నుండి ఇప్పటివరకు డిస్నీ 8,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది.
Also Read..
జీర్ణవ్యవస్థకు, నిద్రకు ఏంటి సంబంధం..? శాస్త్రవేత్తలు ఏం గుర్తించారు..?
ఎంపీ రాఘవ్ చద్దా జెడ్ ప్లస్ భద్రత తీసేసిన పంజాబ్.. వెంటనే జెడ్ సెక్యూరిటీ కల్పించిన కేంద్రం
దేశంలోనే తొలిసారి.. పట్టాలెక్కనున్న క్లోజ్డ్ డోర్ నాన్ ఏసీ లోకల్ రైలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






