Credit Card Reward Points | క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లు.. క్యాష్‌బ్యాక్ పాయింట్లు.. వీటిలో ఏ క్రెడిట్ కార్డులతో ఎక్కువ లాభం?
Credit Card Reward Points | క్రెడిట్ కార్డులు వాడినప్పుడు క్యాష్‌బ్యాక్, రివార్డు పాయింట్ల రూపంలో బ్యాంకులు ప్రోత్సాహకాలను అందిస్తుంటాయి. అందుకే చాలామంది కస్టమర్లు క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు వీటిని చూసుకుంటారు. ఏ కార్డులో ఎక్కువ ప్రయోజనాలు వస్తాయో బేరీజే వేస్తుంటారు. చివరకు తమకు నచ్చిన కార్డులను తీసుకుంటారు. కానీ క్యాష్‌బ్యాక్, రివార్డు పాయింట్లు వీటిలో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయో తెలియక అయోమయంలో పడిపోతారు. మరి ఆ రెండింటిలో ఎందులో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయో ఒకసారి అంచనా వేద్దాం..
Credit Card Reward Points | క్రెడిట్ కార్డులు వాడినప్పుడు క్యాష్‌బ్యాక్, రివార్డు పాయింట్ల రూపంలో బ్యాంకులు ప్రోత్సాహకాలను అందిస్తుంటాయి. అందుకే చాలామంది కస్టమర్లు క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు వీటిని చూసుకుంటారు. ఏ కార్డులో ఎక్కువ ప్రయోజనాలు వస్తాయో బేరీజే వేస్తుంటారు. చివరకు తమకు నచ్చిన కార్డులను తీసుకుంటారు. కానీ క్యాష్‌బ్యాక్, రివార్డు పాయింట్లు వీటిలో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయో తెలియక అయోమయంలో పడిపోతారు. మరి ఆ రెండింటిలో ఎందులో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయో ఒకసారి అంచనా వేద్దాం..
అసలు క్యాష్‌బ్యాక్.. రివార్డు పాయింట్లు అంటే ఏంటి?
క్రెడిట్ కార్డు ఉపయోగించి ఆన్‌లైన్‌లో లేదా ఏదైనా షాపింగ్ చేసినప్పుడు బ్యాంకులు క్యాష్‌బ్యాక్ ఇస్తాయి. అంటే మీరు కార్డును ఉపయోగించి రూ.20వేలు ఖర్చు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇచ్చింది అనుకుందాం.. అప్పుడు రూ.1000 మీ కార్డులో జమ అవుతుంది. వాటితో క్రెడిట్ కార్డు బిల్లులు సర్దుబాటు చేసుకోవచ్చు. అదే రివార్డు పాయింట్లు వస్తే అవి మన క్రెడిట్ కార్డు అకౌంట్‌లోకి యాడ్ అవుతాయి. వాటిని ఉపయోగించి టికెట్ల బుకింగ్, గిఫ్ట్ వోచర్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇతరత్రా షాపింగ్‌ల కోసమే వినియోగించాల్సి ఉంటుంది. వాటితో క్రెడిట్ కార్డుల పేమెంట్లు చేయలేం.
ఏది బెటర్?
రివార్డు పాయింట్లు అనేవి మన క్రెడిట్ కార్డు అకౌంట్‌లోకి వస్తాయి. ఈ పాయింట్లను అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. రివార్డు పాయింట్ల పోర్టల్ ఓపెన్ చేసి వీటిని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర ఎన్ని రివార్డు పాయింట్లు ఉన్నాయో చూసుకుని.. వాటితో మనకు ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చెక్ చేసి క్లైయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికోసం కనీస రివార్డు పాయింట్లు అవసరమవుతాయి. అలా మనకు ఉన్న రివార్డు పాయింట్ల ఆధారంగా విమాన టికెట్ల నుంచి మొదలు.. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వరకు వేటినైనా కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ రివార్డు పాయింట్ల విలువ అన్నింటికీ ఒకలా ఉండదు. ఒక్కో ప్రొడక్ట్‌కు ఒక్కోలా రివార్డు పాయింట్ల విలువ ఉంటుంది. ఇది కాకుండా ఈ రివార్డు పాయింట్లకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఆ గడువు తేదీలోపు వాటిని వాడకపోతే పనికిరావు.
ఇక క్యాష్‌బ్యాక్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. వీటిని అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. క్యాష్‌బ్యాక్ అమౌంట్ అనేది నేరుగా మన అకౌంట్‌లో యాడ్ అయిపోతుంది. దీనిని క్రెడిట్ కార్డు బిల్లులో సర్దుబాటు చేసుకోవచ్చు. ఒక్కోసారి ఈ క్యాష్‌బ్యాక్ అనేది వోచర్ రూపంలో జారీ అవుతుంది. దీనికి గడువు తేదీ ఉండదు.దీనిని దేనికైనా ఉపయోగించుకోవచ్చు.
ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
క్యాష్‌బ్యాక్ వచ్చే క్రెడిట్ కార్డులు తక్కువగా ఉంటాయి. వీటికి వార్షిక ఫీజులు ఉండవు. ఉన్నా కానీ నామమాత్రంగా ఉంటుంది. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేసేవారికి క్యాష్‌బ్యాక్ కార్డులు అనుకూలంగా ఉంటాయి. అదే ట్రావెలింగ్, షాపింగ్ ఎక్కువగా చేసేవారికి రివార్డు పాయింట్ల కార్డులు అనుకూలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






