త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Credit Card Bill | క్రెడిట్ కార్డు బిల్లును డ్యూ డేట్ నాడు చెల్లించాలా..? ముందే చేయాలా..?

Credit Card Bill | ప్ర‌స్తుతం చాలా మంది క్రెడిట్ కార్డుల‌ను విరివిగా ఉప‌యోగిస్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు నిబంధ‌న‌ల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డంతో త‌క్కువ ఆదాయం లేదా వేత‌నం క‌లిగిన వారికి కూడా క్రెడిట్ కార్డులు సులభంగా ల‌భిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్ కొనుగోళ్లు, ప్ర‌యాణాలు, రోజువారి ఖర్చులు, ఇత‌ర వ్య‌యాల‌కు క్రెడిట్ కార్డుల‌ను అధికంగా ఉప‌యోగిస్తున్నారు.

S

Business | Published On Feb 20, 2026, 10.21 am IST

Credit Card Bill | క్రెడిట్ కార్డు బిల్లును డ్యూ డేట్ నాడు చెల్లించాలా..? ముందే చేయాలా..?
Advertisement

Credit Card Bill | ప్ర‌స్తుతం చాలా మంది క్రెడిట్ కార్డుల‌ను విరివిగా ఉప‌యోగిస్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు నిబంధ‌న‌ల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డంతో త‌క్కువ ఆదాయం లేదా వేత‌నం క‌లిగిన వారికి కూడా క్రెడిట్ కార్డులు సులభంగా ల‌భిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్ కొనుగోళ్లు, ప్ర‌యాణాలు, రోజువారి ఖర్చులు, ఇత‌ర వ్య‌యాల‌కు క్రెడిట్ కార్డుల‌ను అధికంగా ఉప‌యోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డుల‌ను వాడ‌డం వ‌ర‌కు బాగానే ఉంటుంది. కానీ బిల్లు చెల్లించే విష‌యంలో మాత్రం స‌రైన జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం లేదు. దీంతో అది సిబిల్ స్కోరుపై ప్ర‌భావం చూపిస్తోంది. పైగా బిల్లు చెల్లింపులు ఆల‌స్యం అవుతున్నందున జ‌రిమానాల‌తోపాటు అధిక వ‌డ్డీ కూడా చెల్లించాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే క్రెడిట్ కార్డు వినియోగ‌దారులు బిల్లు చెల్లింపుల విష‌యంలో ప‌లు సూచ‌న‌లు పాటించాల‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

క‌నీసం 3 రోజులు అయితే..

క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించేందుకు కొంద‌ర‌కు డ్యూ డేట్ వ‌ర‌కు వేచి చూస్తారు. స‌రిగ్గా అదే రోజు చెల్లింపు చేస్తారు. అయితే ఇలా చేయ‌డం స‌రికాద‌ని, బిల్లును క‌నీసం 3 రోజుల ముందు చెల్లించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బిల్లు చెల్లించిన తేదీ త‌రువాత కొన్ని సార్లు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థ‌లు ఆ బిల్లును కార్డులో చూపించేందుకు క‌నీసం3 రోజుల స‌మ‌యం తీసుకుంటాయ‌ని క‌నుక డ్యూ డేట్ నాడు చెల్లించిన‌ప్ప‌టికీ కొన్ని సార్లు డేటాలో ఆల‌స్యం అవ‌డం వ‌ల్ల ఇంకా బిల్లు చెల్లించ‌లేద‌నే వ‌స్తుంద‌ని, దీంతో ఇబ్బందులు క‌లుగుతాయ‌ని చెబుతున్నారు.

థ‌ర్డ్ పార్టీ యాప్స్ ద్వారా..

సాధార‌ణంగా బ్యాంకుల‌కు చెందిన యాప్‌లు లేదా ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అదే బ్యాంకుల‌కు చెందిన క్రెడిట్ కార్డు బిల్లుల‌ను చెల్లిస్తే పేమెంట్ అదే రోజు జ‌రిగిన‌ట్లు వారు నిర్దారిస్తారు. కానీ ప్ర‌స్తుతం చాలా మంది క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల కోసం థ‌ర్డ్ పార్టీ యాప్స్ లేదా సైట్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. వాటిల్లో పేమెంట్ల‌ను చేస్తే అవి కార్డుల్లో అప్‌డేట్ అయ్యేందుకు క‌నీసం 3 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. కొన్ని సార్లు ఇంకా ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంది. అలాంట‌ప్పుడు క్రెడిట్ కార్డును ఇచ్చిన బ్యాంకు లేదా సంస్థ బిల్లు చెల్లించ‌లేద‌ని సిబిల్ స్కోరులో మార్కు వేస్తుంది. వాస్త‌వానికి అప్ప‌టికే బిల్లు చెల్లించి ఉంటే ఇది అన‌వ‌స‌ర రిమార్క్ అని చెప్పాలి. అలాగే ఆయా బ్యాంకులు బిల్లు కోసం కాల్స్ చేసి విసిగిస్తాయి కూడా. క‌నుక ఈ బాధల‌న్నీ వ‌ద్దు అనుకుంటే ఎలాగూ బిల్లు చెల్లిస్తారు, చెల్లించాలి క‌నుక క‌నీసం 3 రోజుల ముందు అయినా బిల్లు చెల్లిస్తే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement