Cognizant | ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 25వేల మందిని రిక్రూట్ చేసుకోనున్న కాగ్నిజెంట్
Cognizant | ఐటీ రంగంలో లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ.. అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) శుభవార్త చెప్పింది.
Cognizant | ఐటీ రంగంలో లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ.. అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) శుభవార్త చెప్పింది. ప్రస్తుత ఏడాది 25 వేల మంది ఫ్రెషర్స్‌ను (freshers) నియమించుకోనున్నట్లు ప్రకటించింది. 2025లో చేపట్టిన 20,000 నియామకాలతో పోలిస్తే ఇది 20 శాతం అధికం. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో రవి కుమార్ ఎస్ అధికారికంగా ప్రకటించారు.
"ఫ్రెషర్స్‌ను అధిక సంఖ్యలో చేర్చుకుంటున్నాం. 2025లో దాదాపు 20వేల మంది ఫ్రెషర్స్‌ను తీసుకున్నాం. ప్రస్తుత ఏడాదికి అది 20 శాతం పెంచాలని ప్లాన్ చేస్తున్నాం. 2026లో 24వేల నుంచి 25 వేల మందిని రిక్రూట్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది" అని ఆయన తెలిపారు. కొత్తగా నియమించుకునే వారిలో ఏఐ టెక్నాలజీపై మంచి పట్టున్న వారిని తీసుకోనున్నట్టు చెప్పారు. నూతన టెక్నాలజీ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, గతేడాది కంపెనీ ఆదాయంలో 6.4 శాతం వృద్ధి నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సంస్థలో 3,51,600 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్రకటనతో ఐటీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






