త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Credit Card | బ్యాంకు ఖాతా లేకుండా క్రెడిట్ కార్డు పొంద‌వ‌చ్చా..?

Credit Card | సాధారణంగా బ్యాంకు ఖాతాకు అనుసంధానం లేకుండానే క్రెడిట్ కార్డు పొందాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆర్థిక సౌలభ్యం, సులభమైన వినియోగం, వేగవంతమైన అప్రూవ‌ల్‌ ప్రక్రియ కోరుకునే అభ్యర్థులకు ఇది ఇప్పుడు సాధ్యమవుతోంది.

S

Business | Published On Feb 6, 2026, 9.25 am IST

Credit Card | బ్యాంకు ఖాతా లేకుండా క్రెడిట్ కార్డు పొంద‌వ‌చ్చా..?
Advertisement

Credit Card | సాధారణంగా బ్యాంకు ఖాతాకు అనుసంధానం లేకుండానే క్రెడిట్ కార్డు పొందాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆర్థిక సౌలభ్యం, సులభమైన వినియోగం, వేగవంతమైన అప్రూవ‌ల్‌ ప్రక్రియ కోరుకునే అభ్యర్థులకు ఇది ఇప్పుడు సాధ్యమవుతోంది. సాంకేతిక పురోగతి, ఆర్థిక లావాదేవీల‌పై ప్రభుత్వం, అనుబంధ సంస్థలు పెడుతున్న దృష్టి కారణంగా చాలా మంది సుల‌భంగా క్రెడిట్ కార్డుల‌ను పొంద‌గ‌లుగుతున్నారు. అయితే ఇటీవల అనేక స్వతంత్ర ఆర్థిక సంస్థలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, అలాగే ఫిన్‌టెక్ సంస్థలు, సేవింగ్స్ ఖాతా తప్పనిసరి లేకుండా క్రెడిట్ కార్డుల‌ను అందిస్తున్నాయి. ఈ కార్డులు కూడా బ్యాంకుల ద్వారా జారీ అయ్యే కార్డుల్లాగే కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులు, ప్రయాణ బుకింగ్ వంటి సేవలను అందిస్తున్నాయి. అంతేకాదు, మంచి క్రెడిట్ హిస్ట‌రీని బిల్డ్ చేయ‌డంలో కూడా ఇవి సహాయపడుతున్నాయి. సాధారణంగా క్రెడిట్ హిస్ట‌రీ స్ట్రాంగ్‌గా ఉన్న వారికి మంచి క్రెడిట్ స్కోరు కూడా ఉంటుంది.

ఈ అర్హ‌త‌లు త‌ప్ప‌నిస‌రి..

క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసే వారు కొన్ని అర్హతలను తప్పనిసరిగా పాటించాలి. దరఖాస్తుదారు కనీసం 21 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. నిరంతర ఆదాయం ఉండాలి. అది జీతం అయినా, వ్యాపార ఆదాయం అయినా సరే, స్థిరమైన ఆదాయ వనరు అవసరం. సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే అప్రూవ‌ల్ చాన్స్‌లు మెరుగ్గా ఉంటాయి. స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే ఆమోదం అంత సులభత‌రం అవుతుంది. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటోలు, చిరునామా నిర్ధారణకు విద్యుత్ బిల్లు వంటి పత్రాలు, పే స్లిప్పులు లేదా స్వయం ఉపాధి ఉన్నవారికి బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఆదాయపు పన్ను వివరాలు అవసరం అవుతాయి.

కొన్ని నిమిషాల్లోనే కార్డు..

ఫిన్‌టెక్ సంస్థలు, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు లేదా రిటైల్ భాగస్వామ్య కార్డు ఆఫర్లపై పరిశోధన చేయాలి. బ్యాంకు ఖాతా అవసరం లేని కార్డు ఆఫర్లను ఎంపిక చేసుకోవాలి. వయస్సు, ఆదాయం, నివాస ప్రమాణాలు వంటి అర్హతలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేయాలి. కేవైసీ పత్రాలు, ఆదాయ నిర్ధారణ, ఆధార్ వివరాలు, ఫొటోలు వంటి అన్ని అవసరమైన పత్రాలను సక్రమంగా సిద్ధం చేసుకోవాలి. సంస్థ ఆన్‌లైన్ వేదిక లేదా సమీప శాఖను సందర్శించి దరఖాస్తు సమర్పించాలి. కొన్ని సంస్థలు అర్హతలు సరిపోతే వెంటనే లేదా చాలా తక్కువ సమయంలో అప్రూవ‌ల్‌ ఇచ్చి వెంట‌నే కార్డుల‌ను వ‌ర్చువ‌ల్‌గా మంజూరు చేస్తారు. త‌రువాత ఫిజిక‌ల్ కార్డు 15 రోజుల్లోగా ఇంటికి కొరియర్‌లో వ‌స్తుంది.

స‌రైన కార్డు ఎంపిక అవ‌సరం..

ఇక బ్యాంకు ఖాతా అవసరం లేని క్రెడిట్ కార్డులకు అనేక లాభాలు ఉంటాయి. బ్యాంకు ఖాతాలో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం ఉండదు. యూపీఐ, డిజిటల్ చెల్లింపు యాప్‌లు లేదా కౌంటర్ ద్వారా బిల్లులు చెల్లించే సౌలభ్యం ఉంటుంది. గిగ్ వర్కర్లు, నగదు ప్రాధాన్యం ఇచ్చే వారు, క్రెడిట్ వ్యవస్థలో కొత్తగా అడుగుపెడుతున్నవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. బ్యాంకు ఖాతాకు అనుసంధానం లేకుండానే చెల్లింపు విధానం, రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు, క్రెడిట్ స్కోరు పెరుగుదల వంటి అవకాశాలు లభిస్తాయి. అయితే బ్యాంకు ఖాతా లేక‌పోయినా క్రెడిట్ కార్డును సులభంగా పొంద‌వ‌చ్చు. కానీ స‌రైన కార్డును ఎంచుకోవడం ముఖ్యం. వినియోగ‌దారులు త‌మ అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా కార్డుల‌ను తీసుకుంటే దాంతో ఎక్కువ లాభాల‌ను పొందేందుకు అవ‌కాశాలు ఉంటాయి.

Advertisement
Advertisement