త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో న‌ష్టాలు.. స్టాక్ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త‌..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వ‌ల్ప న‌ష్టాల్లో ముగిశాయి. ఉద‌యం ట్రేడింగ్ సెష‌న్ లాభాల్లో ప్రారంభ‌మైనా పెట్టుబ‌డిదారులు ఆందోళ‌న‌తో లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గు చూపారు. దీంతో సూచీలు ఏ ద‌శ‌లోనూ రిక‌వ‌రీ అవ‌లేదు.

S

Business | Published On May 21, 2026, 4.08 pm IST

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో న‌ష్టాలు.. స్టాక్ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త‌..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వ‌ల్ప న‌ష్టాల్లో ముగిశాయి. ఉద‌యం ట్రేడింగ్ సెష‌న్ లాభాల్లో ప్రారంభ‌మైనా పెట్టుబ‌డిదారులు ఆందోళ‌న‌తో లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గు చూపారు. దీంతో సూచీలు ఏ ద‌శ‌లోనూ రిక‌వ‌రీ అవ‌లేదు. ఈ క్ర‌మంలోనే సెన్సెక్స్ 135.03 పాయింట్లు (0.18 శాతం) త‌గ్గి 75,183.36 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ50 సూచీ 4.30 పాయింట్లు (0.02 శాతం) త‌గ్గి 23,654.70 వ‌ద్ద స్థిర‌ప‌డింది. సూచీలు ప్రారంభం స‌మ‌యం నుంచి దిగువ‌కు ప్ర‌యాణం చేశాయి. దీంతో ఇంట్రా డే గ‌రిష్టాల నుంచి దిగువ‌కు వ‌చ్చి క‌నిష్టాల‌ను న‌మోదు చేశాయి. ఇక అమెరికాకు చెందిన ఎస్ అండ్ పీ 500 ఫ్యూచ‌ర్స్ 0.1 శాతం పెర‌గ్గా, నాస్డాక్ 100 ఫ్యూచ‌ర్స్ స్వ‌ల్ప మార్పుల‌కు గుర‌య్యాయి. ఎంఎస్‌సీఐ ఆసియా ప‌సిఫిక్ ఇండెక్స్ 2.3 శాతం ఎగ‌బాకింది.

టాప్ గెయిన‌ర్లు, లూజర్లు..

ఇంట‌ర్ గ్లోబ్ ఏవియేష‌న్ లిమిటెడ్ (ఇండిగో) సంస్థ షేర్లు 3.15 శాతం ఎగ‌బాకి టాప్ గెయిన‌ర్ల జాబితాలో తొలి స్థానంలో నిల‌వ‌గా, త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా ట్రెంట్ లిమిటెడ్‌, భార‌త్ ఎల‌క్ట్రానిక్స్‌, అల్ట్రా టెక్ సిమెంట్ లిమిటెడ్‌, అదానీ పోర్ట్స్ అండ్ స్పెష‌ల్ ఎక‌నామిక్ జోన్ లిమిటెడ్ నిలిచాయి. టాప్ లూజ‌ర్ల జాబితాలో బ‌జాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ 1.63 శాతం ప‌త‌నంతో తొలి స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్‌, టెక్ మ‌హీంద్రా, హిందూస్థాన్ యూనిలివ‌ర్‌, బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్‌లు త‌రువాతి స్థానాల్లో నిలిచాయి.

బ‌ల‌ప‌డ్డ రూపాయి, పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాల‌ర్ తో పోలిస్తే గురువారం రూపాయి విలువ బ‌ల‌ప‌డింది. డాల‌ర్‌కు 0.6 శాతం పెరిగిన రూపాయి 96.20 వ‌ద్ద స్థిర‌ప‌డింది. రోజు రోజుకీ ప‌త‌నమ‌వుతున్న రూపాయి విలువ‌ను స్థిరీక‌రించేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. ఈ నేప‌థ్యంలో 5 బిలియ‌న్ డాల‌ర్ల విదేశీ మార‌క నిల్వ‌ల‌ను విక్ర‌యించేందుకు సిద్ధ‌మైంది. దీంతో రూపాయి విలువ పుంజుకుంది. అయితే దీర్ఘ‌కాలంలో ప‌రిస్థితి ఇలాగే ఉంటే అప్పుడు ఆర్‌బీఐ కూడా జోక్యం చేసుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని, అందువ‌ల్ల కేంద్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, లేదంటే రూపాయి విలువ మ‌రింత ప‌డిపోయి డాల‌ర్‌కు రూ.100కు పైగా చేరినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని నిపుణులు అంటున్నారు. ఇక అంతర్జాతీయ క‌మోడిటీ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు గురువారం స్వ‌ల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.10 శాతం పెరిగి 106 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.13 శాతం ఎగ‌బాకి బ్యారెల్‌కు 99 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. అయితే అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌ల‌పై స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతోనే మార్కెట్ల‌లో ఈ తీవ్ర అస్థిర ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Advertisement
Advertisement