Janhvi Kapoor | అభిమాని చేసిన పనికి షాకైన జాన్వీకపూర్..! అసలేమైందంటే..?
Janhvi Kapoor | ఓ అభిమాని చేసిన పనికి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గుండె ఆగినంత పనైంది. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక షాక్‌కు గురైంది. మెగాస్టార్ రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ ఊహించని ఘటన జరిగింది. విజయవాడ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.
Entertainment | Published On Jun 3, 2026, 3.55 pm IST
Janhvi Kapoor | ఓ అభిమాని చేసిన పనికి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గుండె ఆగినంత పనైంది. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక షాక్‌కు గురైంది. మెగాస్టార్ రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ ఊహించని ఘటన జరిగింది. విజయవాడ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. విజయవాడలో నిర్వహించిన భారీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ వేదికపై పక్కపక్కనే కూర్చుని అభిమానులను పలకరిస్తున్నారు. అదే సమయంలో ఓ అభిమాని ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చాడు. సెక్యూరిటీని దాటుకుని వేగంగా వచ్చాడు. బ్యాలెన్స్ కోల్పోయి నేరుగా జాన్వీ కపూర్ కూర్చున్న సోఫా హ్యాండిల్‌పై పడిపోయాడు.
ఈ హఠాత్ పరిణామంతో జాన్వీ కపూర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. క్షణాల్లోనే వేదికపై గందరగోళ వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన రామ్ చరణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది స్పందించి ఆ అభిమానిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. పరిస్థితి మరింత తీవ్రమవకుండా వెంటనే నియంత్రణలోకి తెచ్చారు. ఈ ఘటనపై అక్కడున్న అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ భద్రతా సిబ్బంది చర్యలను ప్రశంసిస్తున్నారు. పలువురు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సెక్యూరిటీ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఈవెంట్ ముగిసిన తర్వాత రామ్ చరణ్ అదే అభిమానిని ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. ఆ సమయంలో భావోద్వేగానికి లోనైన ఆ అభిమాని, చరణ్‌కు కృతజ్ఞతలు తెలిపి ఆయన పాదాలకు నమస్కరించడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్‌తో పాటు జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితర నటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ ఓపెనింగ్స్‌పై అంచనాలు నెలకొన్న వేళ, ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన కూడా సినిమాపై మరింత దృష్టిని ఆకర్షించింది.
Kevin kunta what a man 🗿🔥🔥 pic.twitter.com/nz43wywQgP
— 🔥 (@alwaysharthik) June 2, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్
సెప్టెంబర్ 1, 2026

Pak Cricket | 70 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.. పాక్ క్రికెట్ పతనంపై డానిష్ కనేరియా కామెంట్స్..!
సెప్టెంబర్ 1, 2026

Mahesh Babu Son | టాక్సిక్ మూవీకి 0.5 రేటింగ్ ఇచ్చిన మహేష్‌బాబు కొడుకు – నెటిజన్ల ట్రోలింగ్
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Mamata Banerjee | మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. ఆటో, రియాల్టీ షేర్లకు దెబ్బ..
- ●Pak Cricket | 70 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.. పాక్ క్రికెట్ పతనంపై డానిష్ కనేరియా కామెంట్స్..!
- ●Mahesh Babu Son | టాక్సిక్ మూవీకి 0.5 రేటింగ్ ఇచ్చిన మహేష్‌బాబు కొడుకు - నెటిజన్ల ట్రోలింగ్
- ●Theenmar Mallanna | జెన్-Z చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు.. విద్యకే మా తొలి ప్రాధాన్యం

Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్

Mamata Banerjee | మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య

Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. ఆటో, రియాల్టీ షేర్లకు దెబ్బ..

Pak Cricket | 70 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.. పాక్ క్రికెట్ పతనంపై డానిష్ కనేరియా కామెంట్స్..!



