త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Diwali Bonus | రైల్వే ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. 11.40 లక్షల మందికి ప్రయోజనం..!

Diwali Bonus | పండుగ వేళ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుమారు 11.40 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన పనితీరు ఆధారిత బోనస్‌ చెల్లించేందుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బోనస్‌ కోసం మొత్తం రూ.2,009 కోట్లు వెచ్చించనున్నారు.

P

National | Published On Oct 14, 2026, 9.23 pm IST

Diwali Bonus | రైల్వే ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. 11.40 లక్షల మందికి ప్రయోజనం..!
Advertisement

Diwali Bonus | పండుగ వేళ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుమారు 11.40 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన పనితీరు ఆధారిత బోనస్‌ చెల్లించేందుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బోనస్‌ కోసం మొత్తం రూ.2,009 కోట్లు వెచ్చించనున్నారు. రైల్వే ఉద్యోగులకు ఇది దీపావళి కానుక అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. పండుగల సమయంలోనూ రైల్వే ఉద్యోగులు నిరంతరం విధులు నిర్వర్తిస్తూ ప్రయాణికులకు సేవలందిస్తున్నారని వైష్ణవ్‌ పేర్కొన్నారు. రైల్వే ట్రాక్‌లు, ఇంజిన్లు, వర్క్‌షాప్‌లతో పాటు వివిధ విభాగాల్లో రేయింబవళ్లు శ్రమిస్తున్న ఉద్యోగుల కృషికి గుర్తింపుగా ఈ బోనస్‌ అందిస్తున్నట్లు తెలిపారు.

ఐడీబీఐ బ్యాంక్‌ వాటాల విక్రయానికి ఆమోదం

మరో కీలక నిర్ణయంలో భాగంగా ఐడీబీఐ బ్యాంక్‌లో 60.72 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ అనుబంధ సంస్థ కెనడా ఇంక్‌.కు విక్రయించేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ లావాదేవీ విలువ రూ.52,878.08 కోట్లుగా నిర్ణయించారు. ఈ ఒప్పందంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం, ఎల్‌ఐసీకి చెందిన 30.24 శాతం వాటాలను విక్రయించనున్నారు. విక్రయం పూర్తయిన తర్వాత ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా 15 శాతానికి, ఎల్‌ఐసీ వాటా 19 శాతానికి చేరుతుంది. ఈ రెండింటి మొత్తం వాటా 34 శాతంగా ఉండనుంది. ఈ నిర్ణయంతో బ్యాంకులో కీలక పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం కానుంది.

Advertisement
Advertisement