త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Business Ideas | కేవ‌లం రూ.1 ల‌క్ష ఉంటే చాలు.. ఈ వ్యాపారాల‌ను సుల‌భంగా చేయ‌వ‌చ్చు..!

Business Ideas | ఒకప్పుడు వ్యాపారం మొదలుపెట్టాలంటే భారీ పెట్టుబడులు అవసరమన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎక్కువ‌ డబ్బు కంటే మంచి ఆలోచన, సరైన ప్రణాళిక, నిరంతర కృషి ఉంటే చాలు. సుమారుగా లక్ష రూపాయల పెట్టుబడితోనే ఎవరైనా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టవచ్చు.

S

Business | Published On Feb 3, 2026, 6.50 am IST

Business Ideas | కేవ‌లం రూ.1 ల‌క్ష ఉంటే చాలు.. ఈ వ్యాపారాల‌ను సుల‌భంగా చేయ‌వ‌చ్చు..!
Advertisement

Business Ideas | ఒకప్పుడు వ్యాపారం మొదలుపెట్టాలంటే భారీ పెట్టుబడులు అవసరమన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎక్కువ‌ డబ్బు కంటే మంచి ఆలోచన, సరైన ప్రణాళిక, నిరంతర కృషి ఉంటే చాలు. సుమారుగా లక్ష రూపాయల పెట్టుబడితోనే ఎవరైనా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టవచ్చు. ఈ తక్కువ పెట్టుబడి వ్యాపారాలు కాలేజ్ విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. చాలా వ్యాపారాల‌ను ఇంటి నుంచే లేదా పార్ట్‌టైమ్‌గా కూడా నిర్వహించవచ్చు.

ఇంటి నుంచే క్యాటరింగ్ వ్యాపారం..

వంట చేయడం ఇష్టమైతే క్యాటరింగ్ వ్యాపారం మంచి ఆరంభం. పుట్టినరోజులు, ఆఫీస్ మీటింగ్‌లు, కుటుంబ కార్యక్రమాలకు చిన్న ఆర్డర్లతో మొదలుపెట్టవచ్చు. రుచి, పరిశుభ్రత ఉంటే నోటి మాటే ప్రచారంగా మారుతుంది. క్రమంగా ఆర్డర్లు పెరిగి ఆదాయం కూడా పెరుగుతుంది. తర్వాత ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వేదికల ద్వారా కూడా సేవలు అందించవచ్చు.

పూల వ్యాపారం..

వివాహాలు, పండుగలు, పూజలు.. పూలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. చిన్న స్థలంతో పూల దుకాణం లేదా ఇంటి నుంచే ఆన్‌లైన్ డెలివరీ ప్రారంభించవచ్చు. అందమైన బొకేలు, నాణ్యమైన పూలతో కస్టమర్ల నమ్మకం సంపాదిస్తే స్థిరమైన ఆదాయం వస్తుంది.

మొబైల్ ఫుడ్ వ్యాన్..

రెస్టారెంట్ పెట్టాలనే కల ఉన్నా పెట్టుబడి తక్కువైతే మొబైల్ ఫుడ్ వ్యాన్ మంచి ప్రత్యామ్నాయం. సెకండ్ హ్యాండ్ వాన్‌లో చిన్న వంటగది ఏర్పాటు చేసుకుని కాలేజీలు, ఆఫీసులు, ఈవెంట్ల దగ్గర నిలిపి వ్యాపారం చేయవచ్చు. పని సమయాల్లో స్వేచ్ఛ ఉండటంతో పాటు రోజువారిగా మంచి అమ్మకాలు సాధ్యమవుతాయి.

మసాలాలు, ఊరగాయల తయారీ..

ఇంట్లో తయారయ్యే ఊరగాయలు, మసాలాలకు ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుంది. చిన్న బ్యాచ్‌లతో ఇంటి నుంచే ఈ వ్యాపారం మొదలుపెట్టవచ్చు. మొదట స్థానిక మార్కెట్లలో అమ్మకాలు చేసి, తర్వాత ఆన్‌లైన్ ద్వారా దేశవ్యాప్తంగా కస్టమర్లను చేరుకోవచ్చు. నాణ్యత, సంప్రదాయ రుచి ఈ వ్యాపారానికి ప్రధాన బలం.

హ్యాండ్‌మేడ్ కొవ్వొత్తులు..

డెకరేటివ్, సువాసన కొవ్వొత్తులకు యువతలో మంచి ఆదరణ ఉంది. కొవ్వొత్తి మైనం, మోల్డ్‌లు, సువాసన ఆయిల్‌లతో ఇంటి నుంచే తయారీ ప్రారంభించవచ్చు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌లు, గిఫ్ట్ షాపుల ద్వారా విక్రయిస్తే తక్కువ సమయంలోనే లాభాల దారిలోకి వెళ్లొచ్చు.

చిన్నగా ప్రారంభించడమంటే చిన్నగా ఆలోచించడం కాదు. సరైన ఐడియా, నిబద్ధత, పరిమిత పెట్టుబడి ఉంటే క్రమంగా విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించవచ్చు. కొన్నిసార్లు వ్యాపార ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి లక్ష రూపాయలే సరిపోతాయి. క‌నుక ప్ర‌య‌త్నించి చూడ‌డంలో త‌ప్పు లేదు.

Advertisement
Advertisement