Airtel | డేటా అవసరం లేదా? కాల్స్ కోసమే రీఛార్జ్.. ఎయిర్టెల్ మూడు అదిరిపోయే ప్లాన్లు!
Airtel | మొబైల్లో ఇంటర్నెట్ డేటా అవసరం లేకపోయినా.. అపరిమిత కాలింగ్ కోసం ఖరీదైన అదనంగా రీఛార్జ్ కోసం ఖర్చు చేసుకోవాల్సి వస్తోందా? అయితే అలాంటి వినియోగదారులకు భారతీ ఎయిర్టెల్ ప్రత్యామ్నాయంగా మూడు వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. రూ.185, రూ.203, రూ.206 ధరలతో లభించే ఈ ప్లాన్లలో అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉన్నాయి.
Airtel | మొబైల్లో ఇంటర్నెట్ డేటా అవసరం లేకపోయినా.. అపరిమిత కాలింగ్ కోసం ఖరీదైన అదనంగా రీఛార్జ్ కోసం ఖర్చు చేసుకోవాల్సి వస్తోందా? అయితే అలాంటి వినియోగదారులకు భారతీ ఎయిర్టెల్ ప్రత్యామ్నాయంగా మూడు వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. రూ.185, రూ.203, రూ.206 ధరలతో లభించే ఈ ప్లాన్లలో అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇంటర్నెట్ డేటా అవసరం లేని వృద్ధులు, ఫీచర్ ఫోన్లు వినియోగించేవారికి ఉపయోకరంగా ఈ ప్లాన్లు ఉండనున్నాయి.
రూ.185 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ
ఎయిర్టెల్ అందిస్తున్న మూడు ప్లాన్లలో రూ.185 రీఛార్జ్ అత్యంత తక్కువ ధరతో లభిస్తోంది. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. దేశీయ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. మొత్తం 300 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్‌లో మొబైల్ డేటా ఉండదు. 300 ఎస్ఎంఎస్ల పరిమితి దాటితే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. లోకల్ ఎస్ఎంఎస్కు రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్కు రూ.1.50 చొప్పున వసూలు చేస్తారు.
రూ.203 ప్లాన్.. 30 రోజుల వ్యాలిడిటీ
రూ.203 ప్లాన్‌లోనూ రూ.185 రీఛార్జ్ తరహా ప్రయోజనాలే లభిస్తాయి. అయితే వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది. అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు 300 ఎస్ఎంఎస్లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్‌లోనూ ఇంటర్నెట్ డేటా ఉండదు. రూ.185 ప్లాన్‌తో పోలిస్తే రూ.18 అదనంగా చెల్లించి మరో రెండు రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. నెలవారీ రీఛార్జ్ చేసుకునేవారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఎస్ఎంఎస్ పరిమితి దాటిన తర్వాత అదనపు ఛార్జీలు వర్తిస్తాయి.
రూ.206 ప్లాన్.. నెల రోజుల వ్యాలిడిటీ
మూడో ఆప్షన్‌గా ఎయిర్టెల్ రూ.206 ప్లాన్‌ను ప్రకటించింది. ఇందులోనూ అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. మొబైల్ డేటా మాత్రం ఉండదు. ఈ ప్లాన్ ప్రత్యేకత నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఎయిర్టెల్ ప్రకటించిన ఈ మూడు ప్లాన్లలో కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు ఉచిత హలోట్యూన్స్ సదుపాయం కూడా ఉంది. ప్రతి 30 రోజులకు ఒక ట్యూన్‌ను అదనపు చార్జీలు లేకుండానే సెట్ చేసుకోవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MVSR Student death Case | ఎంవీఎస్ఆర్ స్టూడెంట్‌కు కోటి పరిహారం ఇవ్వండి.. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి
- ●Jyoti Poorvaj | హీరోయిన్గా గుప్పెడంత మనసు సీరియల్ నటి - భర్తతో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ
- ●BRS Party | ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’.. 'వెలుగు' యాజమాన్యానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
- ●Jalamandali | తాగునీటి దుర్వినియోగం.. ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ. 20 వేల జరిమానా
- ●CP Sajjanar | డ్రగ్స్ కట్టడిపై మీ ఆలోచన సూపర్.. ఈ ప్రయత్నం ప్రతొక్కరికీ మార్గదర్శకం కావాలి
- ●Vijay - Rashmika | పెళ్లి చేసుకుందామని వంద సార్లు అడిగింది - కాఫీ విత్ కరణ్ షోలో రష్మికపై విజయ్ కామెంట్స్

MVSR Student death Case | ఎంవీఎస్ఆర్ స్టూడెంట్‌కు కోటి పరిహారం ఇవ్వండి.. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి

Jyoti Poorvaj | హీరోయిన్గా గుప్పెడంత మనసు సీరియల్ నటి - భర్తతో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ

BRS Party | ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’.. 'వెలుగు' యాజమాన్యానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు

Jalamandali | తాగునీటి దుర్వినియోగం.. ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ. 20 వేల జరిమానా






