LPG | ఎల్పీజీ కొరతతో MSME లపై తీవ్ర ప్రభావం.. ఉద్యోగాలు కోల్పోయే అవకాశం..
LPG | ఎల్పీజీ తీవ్రమైన కొరత కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs) కార్యకలాపాల సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఎంట్రప్రెన్యూర్స్ హెచ్చరించింది. ఈ పరిస్థితి కొనసాగితే ఇదే రంగంలో ఉద్యోగాల కోత సంభవించే ప్రమాదం ఉందని పేర్కొంటూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది.
LPG | ఎల్పీజీ తీవ్రమైన కొరత కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs) కార్యకలాపాల సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఎంట్రప్రెన్యూర్స్ హెచ్చరించింది. ఈ పరిస్థితి కొనసాగితే ఇదే రంగంలో ఉద్యోగాల కోత సంభవించే ప్రమాదం ఉందని పేర్కొంటూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఎంట్రప్రెన్యూర్స్ జాతీయ అధ్యక్షుడు కె.ఇ. రఘునాథన్ మాట్లాడుతూ వేలాది చిన్న పరిశ్రమలు, కమర్షియల్ కిచెన్లు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకు ఎల్పీజీ కేవలం ఇంధనం మాత్రమే కాదు, రోజువారీ ఉత్పత్తికి జీవనాధారమని తెలిపారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ సరఫరా అనిశ్చితంగా మారి ధరలు ఒక్కసారిగా పెరిగితే MSMEలు ఆ ప్రభావాన్ని భరించలేవని అన్నారు.
ఎల్‌పీజీ సరఫరాను పెంచాలి..
పెద్ద సంస్థలతో పోలిస్తే MSMEలు చాలా తక్కువ లాభాలపై పనిచేస్తాయని, ఇంధన ఖర్చులు ఒక్కసారిగా పెరగడం లేదా ఎల్పీజీ సరఫరా తగ్గడం వల్ల అనేక యూనిట్లు ఉత్పత్తిని తగ్గించాల్సి రావచ్చని అన్నారు. అలాగే కార్మికుల సంఖ్యను తగ్గించడం లేదా తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేయడం కూడా జరిగే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితి కొనసాగితే ఉపాధి, సరఫరా చెయిన్స్, స్థానిక ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే చెయిన్ ప్రక్రియకు దారితీయవచ్చని ఆయన హెచ్చరించారు. పరిస్థితి అదుపు తప్పడానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సరిదిద్దే చర్యలు తీసుకోవాలని రఘునాథన్ కోరారు. ముఖ్యంగా MSMEలు, అత్యవసర పరిశ్రమలకు ఎల్పీజీ సరఫరాను ప్రాధాన్యంగా ఇవ్వాలని సూచించారు. అలాగే MSMEలు ఉపయోగించే పెట్రోలియం ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం, వ్యాట్‌ను తాత్కాలికంగా తగ్గించాలని కోరారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా స్టోర్ చేయడం, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు కఠినమైన పర్యవేక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
తమిళనాడులో విద్యుత్‌పై సబ్సిడీ..
కాగా మార్చి 14న తమిళనాడు ప్రభుత్వం ఓ ముఖ్య నిర్ణయం ప్రకటించింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టవ్‌లను ఉపయోగించి వ్యాపారాలు నిర్వహించే రెస్టారెంట్లు, హోటళ్లు, టీ దుకాణాలకు యూనిట్ విద్యుత్‌పై రూ.2 సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అనుమతి పొందిన తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో 60,698 ఫ్యాక్టరీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని అదనపు ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు. ఇకపై ఈ ఫ్యాక్టరీలు కిరోసిన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించడానికి అదనపు సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●BSNL | శాటిలైట్ ఫోన్ సేవలను ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు ఎవరైనా కొనవచ్చు.. ధర ఎంతంటే..?
- ●Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ వద్దిరాజు.. నియమించిన కేసీఆర్
- ●Meta Muse Image | మెటా మ్యూస్ ఇమేజ్ వచ్చేసింది.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐతో ఫొటోలకు కొత్త రూపం..
- ●Konda Surekha | కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోండి... పీసీసీ చీఫ్ మహేశ్‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
- ●Koppula Eshwar | తాడిచర్ల బ్లాక్‌ను సింగరేణియే గుర్తించింది.. కాంగ్రెస్, బీజేపీలు గొప్పలు చెప్తుంటే నవ్వొస్తుంది
- ●Chamala Kiran Kumar Reddy | పదవుల కోసం రోడ్డెక్కి కొట్టుకుంటే.. ప్రజల్లో చులకనౌతాం: ఎంపీ చామల

BSNL | శాటిలైట్ ఫోన్ సేవలను ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు ఎవరైనా కొనవచ్చు.. ధర ఎంతంటే..?

Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ వద్దిరాజు.. నియమించిన కేసీఆర్

Meta Muse Image | మెటా మ్యూస్ ఇమేజ్ వచ్చేసింది.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐతో ఫొటోలకు కొత్త రూపం..

Konda Surekha | కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోండి... పీసీసీ చీఫ్ మహేశ్‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు






