Baanganga Gold & Diamonds | ఇన్వెస్టర్లకు అలర్ట్.. రూ.720 కోట్లకు ప్రముఖ కంపెనీ ఐపీఓ..
Baanganga Gold & Diamonds | ఆభరణాల తయారీ సంస్థ బాంగంగా (Baanganga) గోల్డ్ అండ్ డైమండ్స్ (ఐ) లిమిటెడ్ ప్రతిపాదిత ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసింది.
Baanganga Gold & Diamonds | ఆభరణాల తయారీ సంస్థ బాంగంగా (Baanganga) గోల్డ్ అండ్ డైమండ్స్ (ఐ) లిమిటెడ్ ప్రతిపాదిత ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసింది. ఈ ఐపీఓలో గరిష్ఠంగా రూ.540 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతోపాటు, రూ.180 కోట్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ఉండనుంది. దీంతో మొత్తం ఐపీఓ పరిమాణం రూ.720 కోట్లకు చేరనుంది. ఓఎఫ్‌ఎస్‌లో ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించనున్నారు. ఇందులో నవ్‌రతన్‌మల్ జీత్‌మల్ గన్నా సుమారు రూ.120 కోట్ల విలువైన షేర్లను, జినేష్ నవ్‌రతన్‌మల్ గన్నా రూ.60 కోట్ల వరకు షేర్లను విక్రయించనున్నారు. ఈ పబ్లిక్ ఇష్యూకు డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తుండగా, కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరించనుంది.
సంస్థకు మరింత గుర్తింపు..
ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను సంస్థ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని బాంగంగా గోల్డ్ అండ్ డైమండ్స్ భావిస్తోంది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ ద్వారా సంస్థకు మరింత గుర్తింపు లభించడం, బ్రాండ్ ఇమేజ్ మెరుగుపడడం, అలాగే ఈక్విటీ షేర్లకు పబ్లిక్ మార్కెట్ ఏర్పడడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని డీఆర్‌హెచ్‌పీలో సంస్థ పేర్కొంది. బాంగంగా గోల్డ్ అండ్ డైమండ్స్ పూర్తిస్థాయిలో సమీకృతమైన బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా బిజినెస్-టు-బిజినెస్ (బీ2బీ) మోడల్‌లో పనిచేస్తున్న ఈ సంస్థ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలోని పెద్ద కార్పొరేట్ జ్యువెలరీ రిటైల్ చైన్లు, హోల్‌సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఆభరణాలను సరఫరా చేస్తోంది.
ఆభరణాల విక్రయాలే అధికం..
సంస్థ ఉత్పత్తుల విభాగంలో పెళ్లి ఆభరణాలు, రోజువారీ వినియోగ ఆభరణాలు, ప్రీమియం ఆభరణాలు ఉన్నాయి. వీటిని 18 క్యారెట్ల, 22 క్యారెట్ల బంగారం విభాగాల్లో తయారు చేస్తోంది. భారత్‌లోని 18 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో బాంగంగా గోల్డ్ అండ్ డైమండ్స్‌కు కస్టమర్ నెట్‌వర్క్ ఉంది. ఈ నెట్‌వర్క్‌లో ప్రముఖ కార్పొరేట్ జ్యువెలరీ రిటైల్ చైన్లు, హోల్‌సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. జోయాలుక్కాస్ ఇండియా లిమిటెడ్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లిమిటెడ్, కల్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్ వంటి ప్రముఖ రిటైల్ చైన్లు కూడా సంస్థ కస్టమర్లలో ఉన్నాయి.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్
- ●Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం
- ●House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి
- ●Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్ - క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●Minister Seethakka | రూ.1000 కోట్లతో 5118 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం : మంత్రి సీతక్క
- ●Minister Vivek | మెదక్‌లో రూ. 100 కోట్లతో పబ్లిక్ స్కూల్

Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్

Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం

House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి

Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్ - క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!






