Gold Exchange | పాత బంగారం మార్చుకుంటే లక్షల రూపాయల పన్ను భారం.. ఇలా తప్పించుకోవచ్చు..
Gold Exchange | పాత బంగారు ఆభరణాలను జ్యువెలరీ షోరూమ్‌లలో కొత్త ఆభరణాలతో మార్చుకోవడం వల్ల భారీ పన్ను భారం పడే అవకాశం ఉంటుంది. పాత బంగారాన్ని విక్రయించినట్లుగా పరిగణించి మూలధన లాభాల పన్ను విధించడంతోపాటు, కొత్త ఆభరణాల కొనుగోలుపై 3 శాతం జీఎస్టీ కూడా చెల్లించాల్సి వస్తుంది. అయితే పాత బంగారంతోనే కొత్త ఆభరణాలను తయారు చేయించుకునే రీమోడలింగ్ విధానాన్ని ఎంచుకుంటే పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
Gold Exchange | పాత బంగారు ఆభరణాలను జ్యువెలరీ షోరూమ్‌లలో కొత్త ఆభరణాలతో మార్చుకోవడం వల్ల భారీ పన్ను భారం పడే అవకాశం ఉంటుంది. పాత బంగారాన్ని విక్రయించినట్లుగా పరిగణించి మూలధన లాభాల పన్ను విధించడంతోపాటు, కొత్త ఆభరణాల కొనుగోలుపై 3 శాతం జీఎస్టీ కూడా చెల్లించాల్సి వస్తుంది. అయితే పాత బంగారంతోనే కొత్త ఆభరణాలను తయారు చేయించుకునే రీమోడలింగ్ విధానాన్ని ఎంచుకుంటే పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది..?
పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారు ఆభరణాల షోరూమ్‌లు పాత బంగారం మార్పిడి ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. పాత ఆభరణాలను ఇచ్చి కొత్త నగలు తీసుకుంటే వాటి ధరలో వ్యత్యాసం మాత్రమే చెల్లించాలనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విధానంలో పన్ను అంశాలను చాలామంది వినియోగదారులు పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు.. 15 ఏళ్ల క్రితం రూ.7 లక్షలకు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాల ప్రస్తుత విలువ రూ.40 లక్షలకు చేరుకుంటే, రూ.33 లక్షల మూలధన లాభం వస్తుంది. 24 నెలలకు మించి కలిగి ఉన్న బంగారంపై 12.5 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను, దానిపై 4 శాతం సెస్ కలిపి మొత్తం 13 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన సుమారు రూ.4.29 లక్షల పన్ను భారం పడుతుంది. దీనికి కొత్త ఆభరణాల కొనుగోలుపై పూర్తి రూ.40 లక్షల విలువకు 3 శాతం జీఎస్టీ వర్తిస్తే మరో రూ.1.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం పన్ను భారం సుమారు రూ.5.49 లక్షలకు చేరుతుంది. అయితే పాత బంగారం మార్పిడిపై జీఎస్టీని పూర్తి విలువపైనా, అదనంగా కొనుగోలు చేసిన బంగారం విలువపైనా విధించాలనే విషయంలో జ్యువెలర్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు మరో మార్గం..
పాత బంగారాన్ని విక్రయించి కొత్తది కొనుగోలు చేయడానికి బదులుగా, అదే బంగారాన్ని కరిగించి కొత్త డిజైన్‌లో ఆభరణాలు తయారు చేయించుకోవడాన్ని రీమోడలింగ్ అంటారు. ఈ విధానంలో బంగారం యాజమాన్యం వినియోగదారుడి దగ్గరే కొనసాగుతుంది. ఎలాంటి విక్రయం లేదా బదిలీ జరగనందున మూలధన లాభాల పన్ను వర్తించదు. అయితే తయారీ ఛార్జీలపై 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఉదాహరణకు రూ.2 లక్షల తయారీ ఛార్జీలకు రూ.36వేల జీఎస్టీ అవుతుంది. బంగారం కరిగించే సమయంలో కొంత నష్టం జరగడం, తయారీకి ఎక్కువ సమయం పట్టడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త డిజైన్‌కు అదనపు బంగారం అవసరమైతే దానిపై 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఆభరణాల తయారీకి ఇచ్చిన బంగారం బరువు, స్వచ్ఛత, తిరిగి అందుకున్న బంగారం వివరాలు, తయారీ ఛార్జీలను ఇన్వాయిస్‌లో స్పష్టంగా నమోదు చేయించుకోవాలి. బంగారాన్ని కొనుగోలు చేసినట్లు విక్రేతలు ఇన్వాయిస్‌లో చూపిస్తే అది మళ్లీ మార్పిడి లావాదేవీగానే పరిగణించబడుతుంది.
జ్యువెలర్‌ను సంప్రదించాలి..
2001 ఏప్రిల్‌కు ముందు కొనుగోలు చేసిన బంగారానికి ఆ తేదీ నాటి సరసమైన మార్కెట్ విలువను కొనుగోలు వ్యయంగా పరిగణించే అవకాశం ఉంటుంది. వారసత్వంగా వచ్చిన బంగారానికి మాత్రం అసలు యజమాని కొనుగోలు ధర, బంగారం కలిగి ఉన్న కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల పాత బంగారాన్ని మార్చుకునే ముందు జ్యువెలర్‌ను సంప్రదించి, అది కొనుగోలు లావాదేవీనా లేదా రీమోడలింగ్ ప్రక్రియనా అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. మార్పిడి చేసుకుంటే పాత ఆభరణాలకు ఇచ్చిన విలువను తెలిపే ఇన్వాయిస్‌తోపాటు, వాటిని మొదట కొనుగోలు చేసిన ఆధారాలను భద్రపరచుకోవాలి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో ఈ వివరాలు అవసరమవుతాయి.
సంబంధిత వార్తలు

Gold Investment | రూ.50 వేలతో బంగారం కొనాలా? ఆభరణాలు, నాణేలు, డిజిటల్ గోల్డ్‌లో ఏది బెటర్?
నవంబర్ 9, 2026

Gold-Silver Rate | ధన్తేరస్ వేళ వెలవెలబోయిన బంగారం.. వెండి మెరుపులు.. ధరలు భారీగా పతనం..!
నవంబర్ 6, 2026

Dhanteras Offers | ధన్తేరస్ ఆఫర్లలో ఏది బెటర్? 20 శాతం మేకింగ్ ఛార్జీల తగ్గింపా.. ఉచిత బంగారు నాణెమా?
నవంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | మోదీ ఎన్నిక చెల్లనప్పుడు.. రేవంత్ ఎన్నిక కూడా చెల్లదు
- ●CM Revanth Reddy | 2022లోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు అనుమతిచ్చారు
- ●బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీకగా సేవాలాల్ ఆలయం
- ●Anthropic IPO | ఆంథ్రోపిక్ షేర్లలో భారీ పతనం.. ఇప్పుడు కొనొచ్చా?
- ●Dhuandhar Waterfall | నర్మదా నది సృష్టించే ప్రకృతి అద్భుతం.. పొగమంచులా కనువిందు చేసే 'ధువాంధర్ వాటర్‌ఫాల్' విశేషాలివే!
- ●Thalapathy Vijay | అనిరుధ్, కావ్యమారన్ రిసెప్షన్లో సీఎం విజయ్ ధరించిన సూట్ ఖరీదు ఎన్ని లక్షలంటే?

Ramchandar Rao | మోదీ ఎన్నిక చెల్లనప్పుడు.. రేవంత్ ఎన్నిక కూడా చెల్లదు

CM Revanth Reddy | 2022లోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు అనుమతిచ్చారు

బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీకగా సేవాలాల్ ఆలయం

Anthropic IPO | ఆంథ్రోపిక్ షేర్లలో భారీ పతనం.. ఇప్పుడు కొనొచ్చా?



