NPS Sanchay | గ్రామీణ భారత్‌పై ఫోకస్.. ఎన్‌పీఎస్ సంచయ్ కి కొత్త ప్రోత్సాహకాలు..
NPS Sanchay | దేశవ్యాప్తంగా రిటైర్మెంట్ సేవింగ్స్‌ను గ్రామీణ స్థాయికి విస్తరించేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌పీఎస్ సంచయ్ కార్యక్రమం కింద కొత్త ఇన్సెంటివ్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేస్తూ పెన్షన్ ఖాతాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది.
NPS Sanchay | దేశవ్యాప్తంగా రిటైర్మెంట్ సేవింగ్స్‌ను గ్రామీణ స్థాయికి విస్తరించేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌పీఎస్ సంచయ్ కార్యక్రమం కింద కొత్త ఇన్సెంటివ్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేస్తూ పెన్షన్ ఖాతాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఫార్మల్ రిటైర్మెంట్ సేవింగ్స్‌కు ప్రజల ప్రాప్తి ఇంకా పరిమితంగానే ఉండటంతో స్థానిక ఏజెంట్ల ద్వారా నమోదు సంఖ్యను పెంచేందుకు ఈ చర్యలు తీసుకుంది. పీఎఫ్‌ఆర్డీఏ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం కొత్తగా ప్రారంభించిన ఎన్‌పీఎస్ సంచయ్ కింద ప్రతి సబ్‌స్క్రైబర్‌కు రూ.100 ఇన్సెంటివ్‌ను PoPలకు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ప్రయోజనం ఇప్పుడు అనుమతి పొందిన ఆన్‌బోర్డింగ్ ఛానల్స్‌కు మరింత విస్తృతంగా వర్తించనుంది.
షరతుల ప్రకారమే చెల్లింపు..
ఈ కార్యక్రమంలో గ్రామీణ స్థాయి కార్యకర్తలకు కీలక పాత్ర కల్పించారు. ముఖ్యంగా సీఎస్‌సీ విలేజ్ లెవల్ ఎంట్రప్రెన్యూర్స్ (సీఎస్‌సీ-వీఎల్‌ఈలు), బిజినెస్ కరస్పాండెంట్స్ (బీసీలు) లేదా పెన్షన్ సఖీలు, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ (పీఏసీఎస్) లను పెన్షన్ వ్యవస్థలో భాగస్వాములుగా చేశారు. ఈ ఏజెంట్లు గ్రామాలు, చిన్న పట్టణాల్లో చివరి మైలు కనెక్టర్లుగా పనిచేస్తూ ప్రజలకు జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద ఖాతాలు ప్రారంభించడంలో సహాయం చేస్తారు. దీంతో అసంఘటిత రంగ కార్మికులు కూడా పెన్షన్ వ్యవస్థలోకి రావడానికి మార్గం సుగమం కానుంది. ఇన్సెంటివ్ మొత్తాన్ని ప్రతి సబ్‌స్క్రైబర్‌కు రూ.100గా నిర్ణయించినప్పటికీ, కొన్ని నిర్దిష్ట షరతులు నెరవేర్చినప్పుడే ఈ చెల్లింపు వర్తిస్తుంది. పీఎఫ్‌ఆర్డీఏ నిర్ణయించిన ప్రారంభ కాంట్రిబ్యూషన్ మొత్తం జమ కావాలి. అలాగే అవసరమైన కాంట్రిబ్యూషన్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
అదనంగా చెల్లింపులు..
అదేవిధంగా ఈ ఇన్సెంటివ్ ఎన్‌పీఎస్ సంచయ్ కింద ఇప్పటికే అమల్లో ఉన్న ఆన్‌బోర్డింగ్ ఛార్జీలకు అదనంగా చెల్లించడం జరుగుతుందని సర్క్యులర్ స్పష్టం చేసింది. ఈ ప్రోత్సాహక పథకం పూర్తిగా లక్ష్యిత వర్గాలకే పరిమితం కానుంది. పైన పేర్కొన్న గ్రామీణ పెన్షన్ ఏజెంట్ల ద్వారా జరిగే నమోదులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. అలాగే ఈ విధానం 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. అవసరమైతే అథారిటీ ముందుగానే సమీక్షించవచ్చు, సవరించవచ్చు లేదా ఉపసంహరించవచ్చని పేర్కొంది. ఈ సర్క్యులర్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్-2013 సెక్షన్ 14 కింద కల్పించిన అధికారాలను వినియోగిస్తూ జారీ చేసినట్లు వెల్లడించింది. అసంఘటిత రంగ కార్మికులను పెన్షన్ వ్యవస్థలోకి తీసుకువచ్చి, భవిష్యత్ రిటైర్మెంట్ భద్రతను విస్తరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!






