Anthropic | బెంగళూరులో ఆంథ్రోపిక్ ఆఫీస్ ప్రారంభం.. క్లాడ్ ఏఐకి భారత్‌లో విపరీతమైన ఆదరణ..
Anthropic | కృత్రిమ మేధ (AI) భద్రత, పరిశోధన రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఆంథ్రోపిక్ తన వినియోగదారుల కోసం రూపొందించిన క్లాడ్ (Claude) ఏఐ అసిస్టెంట్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో కీలక అడుగు వేసింది. బెంగళూరులో కొత్త కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించింది.
Anthropic | కృత్రిమ మేధ (AI) భద్రత, పరిశోధన రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఆంథ్రోపిక్ తన వినియోగదారుల కోసం రూపొందించిన క్లాడ్ (Claude) ఏఐ అసిస్టెంట్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో కీలక అడుగు వేసింది. బెంగళూరులో కొత్త కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఆసియాలో ఇప్పటికే టోక్యోలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఇది ఆంథ్రోపిక్‌కు రెండో పెద్ద ఆసియా కార్యాలయంగా మారింది. క్లాడ్ ఏఐ వినియోగంలో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ కార్యాలయం ఏర్పాటుతో పాటు ఎంటర్‌ప్రైజ్, విద్య, ప్రజారంగాల్లో భాగస్వామ్యాలను కూడా ఆంథ్రోపిక్ మరింత విస్తరించనుంది. తాజాగా భారత్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైన ఇరినా ఘోష్ నేతృత్వంలో బెంగళూరు కార్యాలయం పనిచేయనుంది. ప్రాంతీయ కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు స్థానిక ప్రతిభను విస్తృతంగా నియమించుకునే ప్రణాళికను సంస్థ ప్రకటించింది.
50 శాతం మేర ఆయా పనులకే..
ఆంథ్రోపిక్ గణాంకాల ప్రకారం భారత్‌లో క్లాడ్‌ను దాదాపు 50 శాతం మేర కంప్యూటర్, గణిత సంబంధిత పనులకే వినియోగిస్తున్నట్లు తేలింది. అప్లికేషన్ డెవలప్‌మెంట్, సిస్టమ్ మోడర్నైజేషన్, ప్రొడక్షన్ సాఫ్ట్‌వేర్ డెలివరీ వంటి పనుల్లో క్లాడ్ విస్తృతంగా ఉపయోగంలో ఉన్నట్లు తెలిపింది. 2025 అక్టోబర్‌లో భారత్‌లో విస్తరణ ప్రణాళికలను ప్రకటించినప్పటి నుంచి ఇక్కడి ఆదాయం రెట్టింపు అయిందని సంస్థ వెల్లడించింది. ఏఐ మోడళ్లలో ఇంగ్లిషేతర భాషల్లో పనితీరు తక్కువగా ఉండే సమస్యను దృష్టిలో ఉంచుకుని ఆంథ్రోపిక్ కీలక చర్యలు చేపట్టింది. ఆరు నెలల క్రితమే హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, పంజాబీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, ఉర్దూ వంటి పది ప్రధాన భారతీయ భాషల కోసం నాణ్యమైన ట్రైనింగ్ డేటాను సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
క్లాడ్ సేవలను వినియోగిస్తున్న కంపెనీలు..
భారత్‌లో పలు ప్రముఖ సంస్థలు సైతం క్లాడ్ ను తమ కార్యకలాపాల్లో భాగం చేసుకున్నాయి. ఎయిర్ ఇండియా కస్టమ్ సాఫ్ట్‌వేర్ డిప్లాయ్‌మెంట్ వేగవంతం చేయడానికి క్లాడ్ కోడ్ ను వినియోగిస్తోంది. క్రెడ్ కంపెనీ క్లాడ్ కోడ్ ద్వారా ఫీచర్ డెలివరీ వేగాన్ని రెండింతలు చేయగా, టెస్ట్ కవరేజ్‌లో 10 శాతం మెరుగుదల సాధించినట్టు తెలిపింది. ఇక కాగ్నిజెంట్ సంస్థ 3.50 లక్షల మంది ఉద్యోగులకు క్లాడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చి లెగసీ సిస్టమ్‌ల ఆధునీకరణలో ఉపయోగిస్తోంది. స్విగ్గీ కూడా ఆంథ్రోపిక్ రూపొందించిన ఓపెన్ సోర్స్ మోడల్ కాంటెక్ట్స్ ప్రోటోకాల్ (MCP)ను ఉపయోగించి క్లాడ్ ద్వారా కిరాణా ఆర్డర్లు, రిజర్వేషన్లు చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. రేజర్ పే, ఎంటర్‌ప్రిట్, ఎమర్జెంట్ వంటి స్టార్టప్‌లు కూడా తమ ఇంజినీరింగ్, కస్టమర్ ఉత్పత్తుల్లో క్లాడ్ ను వినియోగిస్తున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






