Talasani Srinivas Yadav | అధికారిక శిలాఫలకాలపై ఓడిపోయిన నాయకుల పేర్లా..? : ఎమ్మెల్యే తలసాని
Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ పాటించడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. అధికారిక శిలాఫలకాలపై ఓడిపోయిన నాయకుల పేర్లు ఎలా పెడతారు అని నిలదీశారు.
Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ పాటించడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. అధికారిక శిలాఫలకాలపై ఓడిపోయిన నాయకుల పేర్లు ఎలా పెడతారు అని నిలదీశారు. స్పీకర్ దృష్టికి తీసుకొచ్చిన స్పందన లేదు అని ఆయన వాపోయారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో రహదారుల మౌలిక సదుపాయాలపై తలసాని మాట్లాడారు.
నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు లేక చిన్న చిన్న పనులకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. హైదరాబాద్ అందమైన నగరం. కాలక్రమేణా వచ్చిన ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేపట్టాయి. దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన వారు స్థిరపడ్డారు. హైదరాబాద్ అన్ని విధాలుగా నివాస యోగ్యమైన, సురక్షితప్రాంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వం లో కేటీఆర్ ఆధ్వర్యంలో ఫ్లై ఓవర్‌లు, ఆర్‌యూబీలు, అండర్ పాస్‌లు, స్కై వాక్‌ను నిర్మించాం. 10 సంవత్సరాలలో 63 వేల కోట్ల రూపాయలతో రహదారులు, డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ లైన్, వంటి అభివృద్ధి పనులు ప్రణాళికా బద్దంగా చేయడం జరిగింది అని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
మూసీలో మురికి నీటిని శుద్ధి చేయాలని ఎస్టీపీలను నిర్మించిన ఘనత కేటీఆర్‌ది. 28 నెలల్లో వర్షాలతో రోడ్లు కొట్టుకపోతే మరమ్మతులు లేవు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇస్తే నియోజకవర్గాల లో అభివృద్ధి పనులు చేసేవారం. జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌ల పదవీ కాలం ముగింపు సమయంలో ఒక్కో కార్పొరేటర్‌కు 2 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు ఇస్తామన్న నిధులు నేటి వరకు ఇవ్వలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిధులు ఇవ్వడం లేదు. మేము చేసిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ప్రోటోకాల్ పాటించడం లేదు. ఫతేనగర్ ఫ్లై ఓవర్ విస్తరణకు తమ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే రెండేళ్ళు దాటినా ఎలాంటి కదలిక లేదు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ దృష్టికి తీసుకొచ్చారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mahesh Kumar Goud | తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి: టీపీసీసీ చీఫ్
- ●New Pensions | గుడ్‌న్యూస్.. పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లు..
- ●KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
- ●Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
- ●Horoscope | జూలై 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!

Mahesh Kumar Goud | తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి: టీపీసీసీ చీఫ్

New Pensions | గుడ్‌న్యూస్.. పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లు..

KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు






