Amazon | తెల్లవారుజామునే ఇ-మెయిల్.. 250 మంది ఉద్యోగులకు అమెజాన్ షాక్
Amazon | ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరోసారి తన ఉద్యోగులకు షాకిచ్చింది. డివైజెస్ అండ్ సర్వీసెస్ (Devices and Services Unit) విభాగంలో సుమారు 250 మంది ఉద్యోగులను (Layoffs) తొలగించింది.
International | Published On Oct 29, 2026, 9.38 am IST
Amazon | త్రినేత్ర న్యూస్: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరోసారి తన ఉద్యోగులకు షాకిచ్చింది. డివైజెస్ అండ్ సర్వీసెస్ (Devices and Services Unit) విభాగంలో సుమారు 250 మంది ఉద్యోగులను (Layoffs) తొలగించింది. ఈమేరకు తెల్లవారుజామునే ప్రభావితమైన ఉద్యోగులకు ఉదయాన్నే టెక్ట్స్ మెసేజ్‌లు, ఈ-మెయిళ్ల ద్వారా సమాచారం అందించింది. కొత్తగా కిండిల్ ఈ-రీడర్స్, ట్యాబ్లెట్ కంప్యూటర్లతో సహా పలు సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని వారాలకే లేఆఫ్స్ ప్రకటించడం గమనార్హం. అయితే నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడమే లక్ష్యంగా ఉద్యోగులను తొలగించింది. ఇందులో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్ విభాగాలకు చెందినవారిని లక్ష్యంగా చేసుకుంది.

ఉద్యోగుల తొలగింపును అమెజాన్ దృవీకరించింది. `కొద్ది సంఖ్యలో ఉద్యోగాలను తొలగించాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. ఇది కంపెనీ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, భవిష్యత్తు ఉత్పత్తి ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగడానికి సహాయపడుతంది` అని కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగంలో ఈ కోతలు ఉన్నాయని తెలిపారు. కాగా, కంపెనీ అంతర్గత నిర్మాణాన్ని పూర్తిగా సమీక్షించామని, అందువల్లే ఈ ఉద్యోగాల కోత తప్పలేదని ఉద్యోగులకు పంపిన సందేశాల్లో డివైసెస్ అండ్ సర్వీసెస్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ చెరీ రాబిన్సన్ (Cherie Robinson) పేర్కొన్నారు.
ఈ నెలలో ఇది రెండోసారి..
అక్టోబర్ నెలలో అమెజాన్ ఉద్యోగులకు కోత విధించడం ఇది రెండోసారి. ఈ నెలారంభంలో కంపెనీ తన ప్రధాన రిటైల్ విభాగంలో దాదాపు 1000 మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా డివైజెస్ విభాగంలో మరో 250 మందిపై వేటు వేసింది. అయితే త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న సమయంలో ఉద్యోగులను తొలగించడం గమనార్హం. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత అమెజాన్ తన మూడో త్రైమాసిక (Q3) ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Middle East Conflict | పశ్చిమాసియాలో ఘర్షణలు.. 14 మంది నావికులు సహా 22 మంది భారతీయులు మృతి
- ●Sanjay Gaikwad | ఆత్మహత్య చేసుకునే రైతుల అంత్యక్రియలకు ఎవరూ హజరుకావొద్దు: ఎమ్మెల్యే సంజయ్
- ●ISRO URSC Recruitment | పదో తరగతి, ఐటీఐ అర్హతతో.. ఇస్రోలో టెక్నీషియన్, డ్రైవర్ పోస్టులు
- ●వంద సీట్లు.. అంత ఈజీనా? కాంగ్రెస్ ధీమా వెనుక లెక్కేంటి?
- ●Harish Rao | తప్పుడు లెక్కలు చెప్పి వాస్తవాల నుంచి తప్పించుకోలేరు.. మంత్రి ఉత్తమ్‌పై హరీశ్ ఫైర్
- ●Horoscope | అక్టోబర్ 29 రాశిఫలాలు.. ఈ రాశివారు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం!

Middle East Conflict | పశ్చిమాసియాలో ఘర్షణలు.. 14 మంది నావికులు సహా 22 మంది భారతీయులు మృతి

Sanjay Gaikwad | ఆత్మహత్య చేసుకునే రైతుల అంత్యక్రియలకు ఎవరూ హజరుకావొద్దు: ఎమ్మెల్యే సంజయ్

ISRO URSC Recruitment | పదో తరగతి, ఐటీఐ అర్హతతో.. ఇస్రోలో టెక్నీషియన్, డ్రైవర్ పోస్టులు
వంద సీట్లు.. అంత ఈజీనా? కాంగ్రెస్ ధీమా వెనుక లెక్కేంటి?






