త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amazon Great Summer Sale 2026 | అమెజాన్ లో గ్రేట్ స‌మ్మర్ సేల్‌.. ఏఐతో ఈజీగా షాపింగ్ చేయొచ్చు..

Amazon Great Summer Sale 2026 | ఈ ఏడాది అమెజాన్ తన గ్రేట్ సమ్మర్ సేల్ ను మే 8 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఆధ్వర్యంలో నిర్వహించ‌నున్న‌ ఈ సీజనల్ షాపింగ్ ఈవెంట్‌లో ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్స్, ఫ్యాషన్, హోమ్ ఎసెన్షియల్స్ వంటి అనేక కేటగిరీలలో విస్తృతంగా ఉత్పత్తులు అందుబాటులో ఉండ‌నున్నాయి.

S

Business | Published On May 3, 2026, 10.18 am IST

Amazon Great Summer Sale 2026 | అమెజాన్ లో గ్రేట్ స‌మ్మర్ సేల్‌.. ఏఐతో ఈజీగా షాపింగ్ చేయొచ్చు..
Advertisement

Amazon Great Summer Sale 2026 | ఈ ఏడాది అమెజాన్ తన గ్రేట్ సమ్మర్ సేల్ ను మే 8 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఆధ్వర్యంలో నిర్వహించ‌నున్న‌ ఈ సీజనల్ షాపింగ్ ఈవెంట్‌లో ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్స్, ఫ్యాషన్, హోమ్ ఎసెన్షియల్స్ వంటి అనేక కేటగిరీలలో విస్తృతంగా ఉత్పత్తులు అందుబాటులో ఉండ‌నున్నాయి. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా భారీ డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు, ప్రత్యేక బెనిఫిట్స్ ను వినియోగదారులకు అందించేందుకు అమెజాన్ సిద్ధమైంది. ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేకంగా అదనంగా 3 శాతం డిస్కౌంట్‌ను 2 లక్షలకు పైగా ఉత్పత్తులపై అందించనుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా ఈజీ ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసిన వారికి 10 శాతం అద‌నంగా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఏఐతో షాపింగ్ మ‌రింత ఈజీ..

పేమెంట్ సౌలభ్యాల పరంగా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి, ఇవి రోజుకు రూ.9తో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. అలాగే గ్రేట్ ప్రైసెస్ పేరిట ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, డిజిటల్ కూపన్ల‌ ద్వారా మరింత తగ్గింపులు పొందే అవకాశం ఉంటుంది. వినియోగదారుల ఆసక్తిని పెంచేందుకు ప్రోమోకోడ్ హంట్ అనే ఇంటరాక్టివ్ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది, దీని ద్వారా అదనపు డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంటుంది. షాపింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి అమెజాన్ పలు సాంకేతిక ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. రూఫస్ అనే ఏఐ ఆధారిత షాపింగ్ అసిస్టెంట్ ద్వారా వినియోగదారులు వ్యక్తిగత సూచనలు పొందవచ్చు. ఉదాహరణకు సమ్మర్ ఎసెన్షియల్స్ ను సూచించండి లేదా రూ.2వేల లోపు బెస్ట్ డీల్స్ చెప్పండి వంటి ప్రశ్నలు అడిగితే తగిన ఉత్పత్తులను సూచిస్తుంది. అంతేకాకుండా ఉత్పత్తులపై గత 30 నుంచి 90 రోజుల ధరల చరిత్రను కూడా చూపిస్తూ నిజమైన డిస్కౌంట్ ఉందో లేదో వినియోగదారులు తెలుసుకునేలా వీలు కల్పిస్తుంది.

ముందుగానే చెక్ చేసుకోవ‌చ్చు..

ఇక వ్యూ ఇన్ యువర్ రూమ్ అనే అగ్మెంటెడ్ రియాలిటీ ఫీచర్ ద్వారా ఫర్నిచర్, డెకార్ లేదా అప్లయన్సెస్ వంటి ఉత్పత్తుల‌ను వినియోగ‌దారులు తమ ఇంట్లో ఎలా కనిపిస్తాయో ముందుగానే చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్రేట్ సమ్మర్ సేల్ ద్వారా వినియోగదారులు సీజనల్ అవసరాల‌ను కొనుగోలు చేయ‌డం, టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయ‌డం, ఫ్యాషన్‌లో మార్పులు వంటి స‌దుపాయాల‌ను డిస్కౌంట్లు, ఏఐ ఆధారిత టూల్స్ సహాయంతో సులభంగా పొందవచ్చు.

Advertisement
Advertisement