త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amazon Great Summer Sale 2026 | అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ షురూ.. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల‌పై భారీ తగ్గింపు ధ‌ర‌లు..

Amazon Great Summer Sale 2026 | ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న ఇండియా సైట్‌లో గ్రేట్ సమ్మర్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో డెల్, సోనీ, శాంసంగ్ తదితర ప్రముఖ బ్రాండ్లకు చెందిన హెడ్‌ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు సహా పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా అమ్ముడయ్యే గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపు ధ‌ర‌ల‌ను ఇస్తోంది.

S

Business | Published On May 8, 2026, 4.25 pm IST

Amazon Great Summer Sale 2026 | అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ షురూ.. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల‌పై భారీ తగ్గింపు ధ‌ర‌లు..
Advertisement

Amazon Great Summer Sale 2026 | ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న ఇండియా సైట్‌లో గ్రేట్ సమ్మర్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో డెల్, సోనీ, శాంసంగ్ తదితర ప్రముఖ బ్రాండ్లకు చెందిన హెడ్‌ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు సహా పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా అమ్ముడయ్యే గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపు ధ‌ర‌ల‌ను ఇస్తోంది. సేల్ ముగింపు తేదీని అమెజాన్ అధికారికంగా ప్రకటించకపోయినా, బ్యాంక్ ఆఫర్ల గడువును బట్టి మే 13 వరకు కొనసాగవచ్చని తెలుస్తోంది. అయితే స్టాక్ ఉన్నంత వ‌ర‌కే సేల్‌ను నిర్వ‌హిస్తారు క‌నుక వినియోగ‌దారులు త్వ‌ర‌ప‌డాల్సిందిగా అమెజాన్ సూచిస్తోంది.

ల్యాప్‌టాప్‌ల‌పై డిస్కౌంట్లు..

లెనోవో యోగా స్లిమ్ 7 ల్యాప్ టాప్ ధ‌ర ఈ సేల్‌లో రూ.77,990 ఉండ‌గా, అసుస్ వివోబుక్ ఎస్16 ధ‌ర రూ.79,490గా ఉంది. అలాగే అసుస్ జెన్‌బుక్ 14ను త‌గ్గింపు అనంత‌రం రూ.1,06,490 కి అందిస్తున్నారు. రెడ్‌మీ ప్యాడ్ 2, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్, గెలాక్సీ ట్యాబ్ ఎస్11 త‌దిత‌ర బ్యాబ్‌ల‌పై కూడా వినియోగ‌దారులు డిస్కౌంట్ల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే రే-బాన్ మెటా జెన్ 1 స్మార్ట్ ఏఐ గ్లాసెస్, గ్యాబిట్ స్మార్ట్ రింగ్ - ఏఐ హెల్త్ కోచ్, రే-బాన్ మెటా వే ఫెరర్ జెన్ 2 వంటి వియ‌ర‌బుల్స్‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ఇస్తున్నారు. ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు తగ్గింపు ధ‌ర‌లు ల‌భిస్తుండ‌గా, అల్టిమస్ ఏపెక్స్ ప్రో, ఏసర్ ఆస్పైర్ లైట్, అసుస్ వివోబుక్ 16, హెచ్‌పీ ఓమ్నీబుక్ 5 ఓఎల్ఈడీ, డెల్ 15 ఏఐ పవర్డ్ ల్యాప్‌టాప్, ఏసర్ నైట్రో వి15 గేమింగ్ ల్యాప్‌టాప్, యాపిల్ 2026 మాక్‌బుక్ ఎయిర్ 13 ఇంచుల మోడ‌ల్ (ఎం5 చిప్‌) వంటి ఉత్ప‌త్తుల‌ను వినియోగ‌దారులు డిస్కౌంట్ ధ‌ర‌ల‌కు కొన‌వ‌చ్చు.

ట్యాబ్‌లు, ఇత‌ర ఉత్ప‌త్తుల‌పైనా..

అలాగే రెడ్‌మీ ప్యాడ్ 2, ఏసర్ ఐకానియా ట్యాబ్ ఐఎం11-12ఎం, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్10 లైట్, షియోమీ ప్యాడ్ 8, బ్రేవ్ ఆర్క్ టాబ్లెట్ ల‌ను సైతం ఇందులో భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు. ఇక నాయిస్‌, జేబీఎల్‌, బోట్‌, శాంసంగ్‌, రియ‌ల్‌మి, వ‌న్‌ప్ల‌స్ కంపెనీల‌కు చెందిన టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌పై బెస్ట్ డీల్స్‌ను అందిస్తున్నారు. బోట్‌, జీబ్రానిక్స్‌, నాయిస్‌, సెన్‌హైజ‌ర్‌, మార్ష‌ల్ మేజ‌ర్ కంపెనీల హెడ్‌ఫోన్స్‌ను ఉత్త‌మ డీల్స్‌కు పొంద‌వ‌చ్చు. అలాగే అమెజాన్ బేసిక్స్, పోర్ట్రోనిక్స్‌, బోట్‌, ఫిలిప్స్‌, జేబీఎల్‌, క్రాస్ బీట్స్‌, షియోమీ కంపెనీల బ్లూటూత్ స్పీక‌ర్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ఇస్తున్నారు. ఇక ఫైర్ బోల్ట్‌, బోట్‌, పెబుల్‌, గోబోల్ట్‌, అమేజ్‌ఫిట్‌, వ‌న్‌ప్ల‌స్‌, యాపిల్ కంపెనీల వాచ్‌ల‌ను సైతం త‌గ్గింపు ధ‌ర‌ల‌కు సొంతం చేసుకోవ‌చ్చు. ఈ సేల్‌లో ప‌లు కంపెనీల‌కు చెందిన కెమెరాలు, వాటి యాక్స‌స‌రీలు, ప్రింట‌ర్లు వంటి ఉత్ప‌త్తుల‌పైనా త‌గ్గింపు ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు.

బ్యాంకు ఆఫ‌ర్లు కూడా..

అమెజాన్ ప్రైమ్ స‌భ్యుల‌కు అద‌న‌పు ప్ర‌యోజ‌నాల‌ను ఇస్తున్నారు. రూ.2,500 ఖర్చుపై రూ.250 క్యాష్‌బ్యాక్, 2 లక్షలకుపైగా ఉత్పత్తులపై అదనంగా 3 శాతం వరకు ఆదా, ఎంపిక చేసిన ఉత్పత్తులపై ప్రత్యేక ప్రైమ్ ఆఫర్లు వంటి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ సేవింగ్స్ పొంద‌వ‌చ్చు. అలాగే ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం, ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ సమ్మర్ సేల్ ప్రస్తుతం లైవ్‌లో ఉంది. మరిన్ని ఆఫర్ల కోసం ఆఫర్ పేజీని సందర్శించవచ్చు.

Advertisement
Advertisement