Airtel | ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. ఒకసారి రీచార్జి చేస్తే ఏడాదంతా వస్తుంది..
Airtel | టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మరో నూతన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.2249కు అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ యాన్యువల్ ప్లాన్‌గా అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు కాగా ఒకసారి రీచార్జి చేసుకుంటే ఇక ఏడాది పాటు నెల నెలా రీచార్జి చేయాలన్న టెన్షన్ ఉండదని కంపెనీ చెబుతోంది.
Airtel | టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మరో నూతన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.2249కు అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ యాన్యువల్ ప్లాన్‌గా అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు కాగా ఒకసారి రీచార్జి చేసుకుంటే ఇక ఏడాది పాటు నెల నెలా రీచార్జి చేయాలన్న టెన్షన్ ఉండదని కంపెనీ చెబుతోంది. తరచూ రీచార్జిలు చేయాల్సి వస్తుందని ఇబ్బందిగా ఫీలయ్యేవారు, డేటా వాడకం అంతగా లేదని భావించే వారు ఈ ప్లాన్‌ను తీసుకోవచ్చని సూచించింది. ఇందులో భాగంగా పలు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నట్లు తెలిపింది.
లిమిటెడ్ డేటా..
ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన రూ.2249 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే ముందు చెప్పినట్లు కస్టమర్లకు ఏడాది పాటు (365 రోజులు) వాలిడిటీ లభిస్తుంది. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా సరే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను చేసుకోవచ్చు. ఏడాది మొత్తానికి కలిపి 3600 ఎస్ఎంఎస్‌లను ఉచితంగా ఇస్తారు. 30జీబీ డేటాను ఇస్తారు. దీన్ని కూడా ఏడాది లోపు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. అయితే తక్కువ డేటా లభిస్తుంది కనుక వినియోగదారులు ఈ డేటాను కేవలం బేసిక్ అవసరాలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. మెసేజ్‌లను పంపించుకోవడం, వాట్సాప్ కాల్స్, మ్యాప్స్ నావిగేషన్, సాధారణ బ్రౌజింగ్ అవసరాలకు ఈ డేటా సరిపోతుంది. కానీ వీడియోలను చూస్తే మాత్రం ఒకేసారి డేటా అయిపోతుంది. ఆ తరువాత అదనపు డేటా ప్యాక్‌లను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.
ఉచితంగా అడోబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్..
ఇక ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు ఏడాది పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నట్లు తెలియజేసింది. ఇందులో భాగంగా వినియోగదారులు అడోబ్‌కు చెందిన ఫొటోషాప్ వంటి టూల్స్‌ను ఫోన్‌లో ఉచితంగా ఉపయోగించుకుని ఫొటోలను ఎడిట్ చేసుకోవచ్చు. కంటెంట్ క్రియేషన్ అవసరాల కోసం ఆ టూల్స్‌ను వాడుకోవచ్చు. కేవలం నంబర్ మాత్రం యాక్టివ్‌గా ఉంటే చాలు, డేటా అవసరం లేదు, కాల్స్ మాత్రమే వాడుతాం, సెకండరీ సిమ్ కోసం అని అనుకునే వారు, సీనియర్ సిటిజెన్లు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఇది వారికి సరిగ్గా సరిపోతుంది.
సంబంధిత వార్తలు

Airtel | ఎయిర్‌టెల్ నుంచి ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్.. ఆ యూజర్లకే మొదటి ప్రాధాన్యత..
మే 19, 2026

Postpaid Family Plans | ఇంట్లో అందరూ ఇప్పటికీ ప్రీపెయిడ్ వాడుతున్నారా..? పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు చాలా బెటర్..
మే 16, 2026

BSNL Recharge Plan | బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. 70 రోజుల వ్యాలిడిటీ, హైస్పీడ్ డేటాతో రూ.599 కొత్త రీఛార్జ్ ప్లాన్..!
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



