త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Power Cut | విద్యుత్‌ బకాయిలపై ఉక్కుపాదం.. 747 గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసుల‌కు క‌రెంట్ క‌ట్‌!

Power Cut | క‌రెంట్ బిల్లుల బ‌కాయిల‌పై రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (Discom) కొర‌ఢా ఝులిపిస్తున్నాయి. భారీగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిల (Electricity Dues) వసూలు, స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల (Smart Prepaid Meter) నిబంధనల అమలుపై క‌ఠిన చ‌ర్య‌ల‌కు శ్రీకారం చుట్టింది.

G

National | Published On Sep 15, 2026, 11.41 am IST

Power Cut | విద్యుత్‌ బకాయిలపై ఉక్కుపాదం.. 747 గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసుల‌కు క‌రెంట్ క‌ట్‌!
Advertisement

Power Cut | త్రినేత్ర‌.న్యూస్‌: క‌రెంట్ బిల్లుల బ‌కాయిల‌పై రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (Discom) కొర‌ఢా ఝులిపిస్తున్నాయి. భారీగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిల (Electricity Dues) వసూలు, స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల (Smart Prepaid Meter) నిబంధనల అమలుపై క‌ఠిన చ‌ర్య‌ల‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నిబంధనలను బేఖాత‌రు చేస్తూ మొండిబ‌కాయిదారుగా మారిన ప‌లు ప్రభుత్వ శాఖలకు విద్యుత్ స‌ర‌ఫ‌రాను (Power Cut) ఛ‌త్తీస్‌గ‌ఢ్ విద్యుత్ శాఖ‌ నిలిపివేసింది. వారం వ్య‌వ‌ధిలో వివిధ జిల్లాల్లోని 747 ప్రభుత్వ కార్యాలయాలకు క‌రెంట్ క‌ట్ చేసింది. దీంతో 417 కార్యాలయాలు వెంటనే స్పందించి తమ బకాయిలను చెల్లించారు. త‌ద్వారా పవర్ డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీ ఖాతాలోకి రూ.4.43 కోట్లు జమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఈ 747 కనెక్షన్లు మొత్తంగా రూ. 12.83 కోట్ల బకాయిలు పడ్డాయి. పలు కార్యాలయాలు నెలల తరబడి, కొన్ని చోట్లయితే ఏడాదికి పైగా బిల్లులు చెల్లించడం లేద‌ని అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు డిస్కామ్‌కు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు రూ.3,000 కోట్లకుపైగా ఉండ‌టం గమనార్హం. వాటిలో పట్టణ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ రూ.1,200 కోట్లకు పైగా బకాయిలతో అగ్రస్థానంలో ఉండ‌గా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ (PHE), పాఠశాల విద్య, అటవీ, ఆరోగ్య, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖలు కూడా కోట్లాది రూపాయల బకాయిల జాబితాలో ఉన్నాయి.

కేంద్ర నిధుల కోత భయంతోనే..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (RDSS) నిబంధనల పరిపాలనా ఒత్తిడితో డిస్కామ్ చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు తమ పాత విద్యుత్ బకాయిలను క్రమబద్ధంగా క్లియర్ చేస్తేనే కేంద్ర నిధుల తదుపరి విడత విడుదలవుతుంది. నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో డిస్కామ్ కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ కనెక్షన్లలో 80 శాతం మీటర్లను స్మార్ట్ మీటర్లుగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, తప్పనిసరి ప్రీపెయిడ్ విధానంలోకి మారేందుకు ప్రభుత్వ శాఖలు ఆసక్తి చూపడం లేదు. ఆగస్టు 1 నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని డిస్కామ్ ప్రకటించినా, మెజారిటీ కార్యాలయాలు కాలయాపన చేశాయి. ఇప్పటివరకు కేవలం రూ. 1.5 కోట్లు మాత్రమే ప్రీపెయిడ్ రీఛార్జ్‌ల రూపంలో వచ్చాయి. బకాయిలను వాయిదాల పద్ధతిలో కట్టుకునే వెసులుబాటు కల్పించినా, పదే పదే రిమైండర్లు పంపినా స్పందించకపోవడంతోనే డిస్కామ్ మేనేజ్‌మెంట్ చివరకు కనెక్షన్లు కట్ చేసే అస్త్రాన్ని ప్రయోగించింది.

Advertisement
Advertisement