Stock Market | నిఫ్టీ ఎక్స్‌పైరీ… గ్యాప్ అప్ ఓపెన్ అయినా సైడ్ వేస్ మార్కెట్
నిఫ్టీ 26,205 వద్ద ఓపెన్ అయి ఆ తర్వాత ఒక్క నిమిషంలోనే దాదాపుగా 40 పాయింట్లు డ్రాప్ అయింది. ప్రస్తుతం నిన్న క్లోజ్ అయిన పాయింట్ల వద్ద 26,160 వద్ద నిఫ్టీ కొనసాగుతోంది.
Stock Market | భారత స్టాక్ మార్కెట్లలో కీలక ఇండెక్స్‌లు అయిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్‌తో ఇవాళ ఓపెన్ అయినా వెంటనే కిందికి పడిపోయాయి. కాసేపు బేరిష్ మోడ్‌లోకి వెళ్లిన ఈ రెండు ఇండెక్స్‌లు ఆ తర్వాత సైడ్ వేస్ అయ్యాయి. గ్యాప్ అప్‌లో ఓపెన్ కావడంతో ఇవాళ మార్కెట్ బుల్లిష్ ఉంటుందని ట్రేడర్లు, ఇన్వెస్టర్లు భావించారు. కానీ.. నిన్నటి లాగానే మార్కెట్ ఎటూ కదలకుండా సైడ్ వేస్‌గా మారింది. ఉదయమే మార్కెట్ ఇంత బోరింగ్‌గా ఉంటే రోజంతా ఎలా ట్రేడింగ్ చేయాలని ఎఫ్ అండ్ ఓ ట్రేడర్స్ తలలు పట్టుకుంటున్నారు. అందులోనూ ఈరోజు నిఫ్టీ 50 ఎక్స్‌పైరీ ఉంది. ప్రతి మంగళవారం నిఫ్టీ 50 వీక్లీ ఎక్స్‌పైరీ ఉంటుంది.
నిఫ్టీ 26,205 వద్ద ఓపెన్ అయి ఆ తర్వాత ఒక్క నిమిషంలోనే దాదాపుగా 40 పాయింట్లు డ్రాప్ అయింది. ప్రస్తుతం నిన్న క్లోజ్ అయిన పాయింట్ల వద్ద 26,160 వద్ద నిఫ్టీ కొనసాగుతోంది. ఈరోజు హై 26,206 వరకు వెళ్లిన నిఫ్టీ ఈ రోజు లో 26,119 పాయింట్లను తాకింది.
Stock Market | 59,308 వద్ద బ్యాంక్ నిఫ్టీ
బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్న ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ 59,304 వద్ద నిన్న ముగిసింది. ప్రస్తుతం చూస్తే అక్కడే కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ 59,308 వద్ద కొనసాగుతుండగా, 59,334 పాయింట్ల వద్ద గ్యాప్ అప్‌తో ఓపెన్ అయింది. ఈరోజు లో 59,216 కాగా, ఈ రోజు హై 59,402 గా ఉంది.
ఫైనాన్షియల్ కంపెనీలను కలిగి ఉన్న ఫిన్ నిఫ్టీ ఇండెక్స్ కూడా సైడ్ వేస్ గానే ఉంది. ప్రస్తుతం నిఫ్టీ ఫిన్ సర్వీస్ ఇండెక్స్ 27,536 వద్ద కొనసాగుతుండగా, నిన్నటి క్లోజ్ అయిన పాయింట్లు 27,479 కాగా, ఈరోజు ఓపెనింగ్ 27,513, ఈరోజు లో 27,483, ఈ రోజు హై 27,566 గా ఉంది.
మీడియం సైజ్ కంపెనీలతో ఉన్న నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా సైడ్ వేస్ గానే ఉంది. ప్రస్తుతం నిఫ్టీ మిడ్ క్యాప్ 13,927 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఉదయం 13,978 పాయింట్ల వద్ద నిఫ్టీ మిడ్ క్యాప్ ఓపెన్ కాగా, దాని లో 13,892 కాగా, దాని హై 13,985 గా ఉంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






