Stock Markets | భారీ నష్టాలతో మొదలై.. స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో సూచీలు నష్టాలతో మొదలైనా వెంటనే రికవరీ అయి క్రితం సెషన్ ముగింపుకు ఎగువన క్లోజ్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 117.54 పాయింట్లు (0.16 శాతం) పెరిగి 75,318.39 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిప్టీ50 సూచీ 41 పాయింట్లు (0.17 శాతం) పెరిగి 23,659 వద్ద స్థిరపడింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో సూచీలు నష్టాలతో మొదలైనా వెంటనే రికవరీ అయి క్రితం సెషన్ ముగింపుకు ఎగువన క్లోజ్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 117.54 పాయింట్లు (0.16 శాతం) పెరిగి 75,318.39 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిప్టీ50 సూచీ 41 పాయింట్లు (0.17 శాతం) పెరిగి 23,659 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వచ్చిన ర్యాలీ కారణంగా, హెవీ వెయిటేజ్ ఉన్న స్టాక్ కావడంతో సూచీలు ఆ స్టాక్ వల్ల లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ సూచీ 0.51 శాతం పెరగ్గా, బీఎస్ఈ 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.09 శాతం పెరుగుదలను నమోదు చేసింది. బుధవారం స్వల్ప లభాల్లో సూచీలు ముగియడంతో బీఎస్ఈలో లిస్ట్ అయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్ ముగింపులోని రూ.459.65 లక్షల కోట్ల నుంచి రూ.461 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు ఒక్క రోజులోనే సుమారుగా రూ.1 లక్ష కోట్ల సంపద ఆర్జించారు.
అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనత..
భారత స్టాక్ మార్కెట్ల బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వచ్చిన ర్యాలీ సూచీల లాభాలకు కారణమైంది. రిలయన్స్ షేర్లు ఒక్క సెషన్‌లోనే ఏకంగా 3 శాతం ఎగబాకాయి. మార్కెట్‌లలో అధిక లాభాలు వచ్చేందుకు కారణం అయ్యాయి. ఇక బజాజ్ ఫిన్ సర్వ్, ట్రెంట్, ఇండిగో, యాక్సిస్ బ్యాంక్‌లకు చెందిన షేర్లు భారీ లాభాల్లో ముగిసి టాప్ గెయినర్లుగా నిలవగా, బెల్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, టాటా స్టీల్ మాత్రం భారీ నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం బలహీనత కనిపించింది. అమెరికాకు చెందిన ఎస్ అండ్ పీ500 ఫ్యూచర్స్ 0.2 శాతం క్షీణించగా, జపాన్ టోపిక్స్ సూచీ 1.7 శాతం పతనమైంది. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ, ఏఎస్ఎక్స్ 200 సూచీ 1.1 శాతం పడిపోయింది. హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 0.9 శాతం పతనమవ్వగా, షాంగై కంపోజిట్ 0.6 శాతం క్షీణించింది.
స్వల్పంగా తగ్గిన చమురు ధరలు, పతనమైన రూపాయి విలువ..
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1.71 శాతం తగ్గి బ్యారెల్‌కు 109.06 డాలర్ల వద్ద ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 1.75 శాతం తగ్గి బ్యారెల్‌కు 101.295 వద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మరోమారు క్షీణించి మళ్లీ ఆల్ టైం కనిష్టాన్ని దాటింది. డాలర్‌కు రూపాయి విలువ 96.81గా ఉంది. ఇక రంగాలవారీగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ 0.29 శాతం పెరగ్గా, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ షేర్లు 0.43 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో షేర్లు 1.59, 0.84 శాతం చొప్పున పెరిగాయి. ఇక నిఫ్టీ మీడియా 1.45 శాతం క్షీణించింది. ఎఫ్ఎంసీజీ సూచీ కూడా 0.71 శాతం పడిపోయింది. ఐటీ సెక్టార్ సూచీ 0.42 శాతం తగ్గింది. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించకపోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో ప్రకటన చేస్తుండడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. అందుకనే మార్కెట్లలో తీవ్ర అస్థిరత కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం ముగిసే వరకు పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



