Stock Market | బోరింగ్ మార్కెట్.. ఉదయం ట్రేడ్ చేసిన వాళ్లే లక్కీ.. ఆ తర్వాత సైడ్‌వేస్
ఇక బ్యాంకింగ్ స్టాక్స్ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ 59,304 వద్ద ముగిసింది. ఓవరాల్‌గా ఇవాళ 234 పాయింట్లు పైకి వెళ్లింది. బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్‌లో ఓపెన్ కావడంతో కొందరు ట్రేడర్లకు కలిసివచ్చింది.
Stock Market | ఇండియన్ స్టాక్ మార్కెట్ 22 డిసెంబర్ 2025, సోమవారం ఓపెన్ అవడమే గ్యాప్ అప్‌తో ఓపెన్ అయింది. అది ఒక్కటే ట్రేడర్స్‌కి కలిసి వచ్చింది. గ్యాప్ అప్‌లో ఓపెన్ అవడంతో పాటు తొలి 10 నిమిషాలు జెట్ స్పీడ్‌లో పైకి దూసుకెళ్లడంతో ట్రేడర్స్, ఇన్వెస్టర్లు ఉత్సాహంతో స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఉదయం 9.30 తర్వాత ఇక మార్కెట్ ఎటూ కదలకుండా ఉండిపోయింది. మధ్యాహ్నం 2.30 వరకు కూడా సైడ్‌వేస్‌లోనే ఉంది. దీంతో కాల్, పుట్ రెండు వైపుల ట్రేడ్ చేసేందుకు ప్రయత్నించిన చాలా మంది ట్రేడర్లు, టైమ్ డికే వల్ల నష్టపోవాల్సి వచ్చింది.
గ్యాప్ అప్‌తో 26,055 వద్ద ఓపెన్ అయిన ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ 50 ఓ 70 నుంచి 80 పాయింట్ల వరకు బాగానే మూవ్ అయింది. ఆ తర్వాత సైడ్ వేస్ అయింది. లాస్ట్‌కి మార్కెట్ ముగిసే ముందు కాస్త పైకి వెళ్లినట్టు అనిపించినా బోరింగ్ మార్కెట్‌గానే ఈ రోజు క్లోజ్ అయింది. ఇవాళ నిప్టీ 50.. 26,172 వద్ద క్లోజ్ అయింది. 26,180 వరకు పైకి వెళ్లి మళ్లీ కిందికి వచ్చింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ రోజు గ్యాప్ అప్ అవడం వల్ల నిఫ్టీ 206 పాయింట్లు పైకి ఎగబాకింది.
Stock Market | 59,304 వద్ద ముగిసిన బ్యాంక్ నిఫ్టీ
ఇక బ్యాంకింగ్ స్టాక్స్ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ 59,304 వద్ద ముగిసింది. ఓవరాల్‌గా ఇవాళ 234 పాయింట్లు పైకి వెళ్లింది. బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్‌లో ఓపెన్ కావడంతో కొందరు ట్రేడర్లకు కలిసివచ్చింది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ కూడా ఇవాళ సేమ్ టు సేమ్ నిఫ్టీ లాగానే ప్రవర్తించింది. 638 పాయింట్ల పైకి వెళ్లి 85,567.48 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం బీటీఎస్‌టీతో కాల్ ట్రేడ్‌ని క్యారీ ఫార్వార్డ్ చేసిన వాళ్లు మాత్రమే ఈరోజు లాభపడ్డారు. మిగితా వాళ్లు నష్టపోయారు.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026

Nithin Kamath | బ్రోకరేజీ సంస్థలకు జీరోధా నితిన్ కామత్ హెచ్చరిక.. ఎంటీఎఫ్లపై అంత ఎక్స్పోజర్ వద్దు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



