GOBARdhan Scheme India | ఇక నుంచి పెండతో తయారుచేసే బయోగ్యాస్‌తో నడవనున్న కార్లు.. కేంద్రం కొత్త స్కీమ్ షురూ
వ్యవసాయ వ్యర్థాలు, పేడతో వాహనాలకు ఇంధనాన్ని తయారు చేసేందుకు కేంద్రం రూ.23 వేల కోట్లతో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. బయో-సీఎన్‌జీతో వాహనదారులకు లాభమేంటి?
Automobiles | Published On Aug 9, 2026, 6.43 pm IST
సంక్షిప్త సారాంశం
కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG/Bio-CNG) ఉత్పత్తిని పదింతలు పెంచేందుకు రూ.23,731 కోట్లతో 'గోబర్-ధన్' పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, మున్సిపల్ చెత్తతో తయారయ్యేదే బయో-సీఎన్‌జీ. ఇది సాధారణ సీఎన్‌జీకి ఏమాత్రం తీసిపోదు. సీఎన్‌జీ కార్లలో ఎలాంటి మార్పులు చేయకుండానే బయో-సీఎన్‌జీని వాడుకోవచ్చు. రైతులకు అదనపు ఆదాయం, కాలుష్య నియంత్రణ, ఇంధన దిగుమతుల తగ్గింపు లక్ష్యంగా 2026-27 నుంచి ఈ పథకం అమలు కానుంది.
- పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ సక్సెస్
- దీంతో కేంద్రం దృష్టి కంప్రెస్డ్ బయోగ్యాస్‌పై
- పశువుల పేడతో బయో సీఎన్‌జీ తయారు
- రూ.23,731 కోట్లతో గోబర్-ధన్ బయో ఎనర్జీ స్కీమ్
- సీఎన్‌జీ కార్లలో ఎలాంటి మార్పులు లేకుండానే ఈ బయోగ్యాస్‌ను వాడొచ్చు
GOBARdhan Scheme India | త్రినేత్ర.న్యూస్ : కాలుష్య రహిత ఇంధన వినియోగంలో భారత్ మరో ముందడుగు వేస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్(Ethanol) బ్లెండింగ్ సక్సెస్ తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG-సీబీజీ) లేదా బయో-సీఎన్‌జీ(Bio-CNG)పై పడింది. వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, మున్సిపల్ చెత్త నుంచి క్లీన్ ఫ్యూయల్‌ను తయారు చేసే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ భారీ పథకానికి ఆమోదముద్ర వేసింది. దేశీయ సీబీజీ ఉత్పత్తిని రాబోయే పదేళ్లలో ఏకంగా పదింతలు పెంచేందుకు రూ.23,731 కోట్ల బడ్జెట్‌తో నేషనల్ సర్క్యులర్ బయో ఎనర్జీ స్కీమ్ అయిన 'గోబర్-ధన్'(GOBARdhan Scheme) ను ప్రకటించింది. ఈ పథకం 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 వరకు అమల్లో ఉంటుంది. అసలు బయో-సీఎన్‌జీ అంటే ఏమిటి? ఇది సీఎన్‌జీ కారు ఓనర్లకు, రైతులకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.
బయో-సీఎన్‌జీ అంటే ఏంటి? సాధారణ సీఎన్‌జీకి దీనికి తేడా ఏంటి?
భూగర్భంలోని శిలాజ ఇంధన నిల్వల (Fossil fuels) నుంచి సహజ వాయువును వెలికితీసి కంప్రెస్ చేస్తే వచ్చేది సాధారణ సీఎన్‌జీ. అదే వ్యవసాయ వ్యర్థాలు, పేడ తదితర సేంద్రియ వ్యర్థాలను ప్రాసెస్ (Anaerobic digestion) చేయడం ద్వారా బయోగ్యాస్ (Bio Gas) ఉత్పత్తి అవుతుంది. ఆ వాయువులోని మలినాలను తొలగించి మిథేన్ శాతాన్ని పెంచి దాన్ని కంప్రెస్ చేస్తే కంప్రెస్డ్ బయోగ్యాస్ లేదా బయో-సీఎన్‌జీ తయారవుతుంది. కెమికల్ ప్రాపర్టీస్ పరంగా చూస్తే సీబీజీ, సీఎన్‌జీ రెండూ దాదాపు ఒకటే. సాధారణ సీఎన్‌జీ వాడే చోటల్లా ఈ బయో-సీఎన్‌జీని నిస్సంకోచంగా వాడుకోవచ్చు.
సీఎన్‌జీ కారు ఓనర్లకు లాభమేంటి?
కార్లలో బయో-సీఎన్‌జీ వాడటానికి ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు (Modifications) చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న సీఎన్‌జీ పంపుల ద్వారానే ఈ గ్యాస్‌ను కూడా సరఫరా చేయవచ్చు. ట్యాంక్‌లో సాధారణ సీఎన్‌జీ, బయో-సీఎన్‌జీ రెండింటినీ కలిపి కూడా వాడుకోవచ్చు. రాబోయే రోజుల్లో బయో-సీఎన్‌జీ ఉత్పత్తి పెరిగితే.. ఇంధన కొరత తీరుతుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగినా మన దగ్గర సీఎన్‌జీ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది.

గోబర్-ధన్ పథకం ఎలా పనిచేస్తుంది?
ఈ రూ.23,731 కోట్ల పథకం కింద కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
గ్యారెంటీ కొనుగోలు: బయో-సీఎన్‌జీ ప్లాంట్లు ఉత్పత్తి చేసే గ్యాస్‌ను కొనుగోలు చేసేలా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) నెట్‌వర్క్‌లకు ప్రభుత్వం టార్గెట్లు పెట్టింది. 2026-27 నాటికి 3%, ఆ తర్వాత 5% వరకు తప్పనిసరిగా సీబీజీ కొనుగోలు చేయాలి.
స్థిరమైన ధర: ఉత్పత్తిదారులకు భరోసా కల్పించేందుకు ఎంఎంబీటీయూకు(MMBTU) రూ.2,110 చొప్పున 10 ఏళ్ల పాటు స్థిరమైన ధరను ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్థిక సాయం, పైప్‌లైన్లు: కొత్త బయో-సీఎన్‌జీ ప్లాంట్లు పెట్టేవారికి, పాతవాటిని విస్తరించే వారికి మూలధన సాయం అందుతుంది. ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ ఇవ్వడంతో పాటు, ప్లాంట్ల నుంచి పంపిణీ నెట్‌వర్క్‌కు గ్యాస్‌ను తరలించే పైప్‌లైన్ల నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేస్తారు.
రైతులకు డబుల్ ధమాకా
పొలాల్లో మిగిలిపోయే వ్యర్థాలు, పశువుల పేడను ఇన్నాళ్లూ తగలబెట్టడమో, ఊరికే పారేయడమో చేసేవారు. ఇప్పుడు వాటిని బయో-సీఎన్‌జీ ప్లాంట్లకు అమ్మడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ ప్రక్రియలో వ్యర్థాలు కాల్చడం తగ్గుతుంది కాబట్టి కాలుష్యం (Stubble burning) అదుపులోకి వస్తుంది. పైగా, ఈ ప్లాంట్ల నుంచి వచ్చే బై-ప్రొడక్ట్‌ను సేంద్రియ ఎరువుగా (Organic manure) వాడుకోవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు






