AI Technology | మెరుగైన విద్యుత్ సరఫరాకు ఏఐ టెక్నాలజీని వినియోగించండి: సీఎం రేవంత్
Revanth Reddy | సరఫరా లోపాలు, మెరుగైన విద్యుత్ సరఫరాకు ఏఐ సాంకేతికతను (AI Technology) వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (Rythu Discom)లో చేరిక పై ఉద్యోగులు, సిబ్బందికి ఉన్న అపోహలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
AI Technology | త్రినేత్ర.న్యూస్: సరఫరా లోపాలు, మెరుగైన విద్యుత్ సరఫరాకు ఏఐ సాంకేతికతను (AI Technology) వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (Rythu Discom)లో చేరిక పై ఉద్యోగులు, సిబ్బందికి ఉన్న అపోహలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్లపై ఓవర్ లోడ్ పడకుండా చూడాలన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఎంసీహెచ్ఆర్డీలో విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి డెవలప్‌మెంట్ నేపథ్యంలో డిమాండ్‌కు తగిన విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్ స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు.
గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ప్రాధాన్యక్రమంలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. భారీ డాటా సెంటర్లకు అవసరమైన అనుమతులు ఇవ్వాలన్నారు. సోలార్ పవర్‌పై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. సబ్ స్టేషన్స్ పక్కనే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద భూమి అందుబాటులో ఉన్న చోట ఉమ్మడి జిల్లాలో రెండు సబ్ స్టేషన్ల పక్కన సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పాలన్నారు. ఇందులో భాగంగా చేపట్టే 18 సోలార్ పవర్ ప్లాంట్లు (హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో జిల్లాకు రెండు చొప్పున) నిర్మాణానికి నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు. సోలార్ స్టవ్‌ల వినియోగంపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు.
తాజావార్తలు
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్






