Car AC | వేసవిలో కార్ ఏసీ మెరుగ్గా పనిచేయాలంటే.. ఈ సూచనలు పాటించండి..
Car AC | వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో కార్లలో ప్రయాణించే వారు ఏసీ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తీవ్రమైన వేడి వల్ల కార్ త్వరగా చల్లబడకపోవడం, ఏసీ పనితీరు తగ్గడం, ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే డ్రైవింగ్‌లో కార్ ఏసీ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుంది.
Automobiles | Published On Apr 27, 2026, 2.39 pm IST
Car AC | వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో కార్లలో ప్రయాణించే వారు ఏసీ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తీవ్రమైన వేడి వల్ల కార్ త్వరగా చల్లబడకపోవడం, ఏసీ పనితీరు తగ్గడం, ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే డ్రైవింగ్‌లో కార్ ఏసీ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మంది వాహనదారులు కొన్ని సాధారణ అలవాట్లను పట్టించుకోరు. ఇవి పాటిస్తే కూలింగ్ మెరుగుపడటమే కాకుండా వాహనంపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. వేసవిలో కారులో చల్లగా ప్రయాణించాలంటే ఏసీ విషయంలో పలు ముఖ్యమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది.
ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గించాలి..
ఎండలో నిలిపిన కార్‌లో వేడి గాలి ఎక్కువగా పేరుకుపోతుంది. కాబట్టి ఏసీ ఆన్ చేసే ముందు డోర్లు లేదా విండోలు ఒక నిమిషం పాటు తెరిచి ఉంచాలి. దీంతో లోపలి వేడి గాలి బయటకు వెళ్లి ఏసీ త్వరగా పనిచేస్తుంది. ఏసీని వెంటనే అత్యల్ప ఉష్ణోగ్రతకు సెట్ చేయడం మంచిది కాదు. ముందుగా డ్రైవ్ ప్రారంభిస్తే కంప్రెసర్, ఎయిర్ ఫ్లో మెరుగ్గా పనిచేస్తాయి. తరువాత క్రమంగా టెంపరేచర్ తగ్గిస్తే సిస్టమ్‌పై అదనపు ఒత్తిడి పడదు. రీ సర్క్యులేషన్ మోడ్ కార్ లోపల చల్లని గాలిని నిలుపుతుంది. బయట వేడి గాలి లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఎక్కువ వేడి లేదా ట్రాఫిక్‌లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే దీన్ని ఎక్కువసేపు వాడితే గాలి నాణ్యత తగ్గుతుంది. కనుక ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఉపయోగిస్తే మంచిది. సాధారణ హైవే ప్రయాణాల్లో దీన్ని వాడాల్సిన పనిలేదు.
నీడలో పార్క్ చేయాలి..
నీడ ఉన్న ప్రదేశాల్లో పార్క్ చేయడం లేదా సన్‌షేడ్ ఉపయోగించడం వల్ల కార్ లోపలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో ఏసీపై ఒత్తిడి తగ్గి ఫ్యూయల్ ఎఫిషెన్సీ మెరుగుపడుతుంది. క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్లను శుభ్రపరచడం లేదా మార్చడం, రిఫ్రిజిరెంట్ స్థాయిలను చెక్ చేయడం, లీకేజ్ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. రెగ్యులర్ సర్వీసింగ్ ద్వారా కూలింగ్ పనితీరు మెరుగవుతుంది, అనుకోని సమస్యలను నివారించవచ్చు. వేసవిలో పెరుగుతున్న వేడి పరిస్థితుల్లో ఈ చిన్న చిట్కాలను పాటించడం ద్వారా కార్ ఏసీ పనితీరు మెరుగుపడి, ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. అదే సమయంలో వాహన భాగాల ఆయుష్షు కూడా పెరుగుతుంది. కార్ ఎక్కువ కాలం పాటు మన్నికగా పనిచేస్తుంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






