త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AP Budget | రూ.3.32 ల‌క్ష‌ల కోట్లతో ఏపీ బడ్జెట్‌.. అమరావతి నిర్మాణానికి 6 వేల కోట్లు

AP Budget | ఆంధ్ర‌ప్ర‌దేశ్ (AP Budget) శాస‌న స‌భ‌లో ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ (Payyavula Keshav) వార్షిక బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్ర‌తిపాదించారు.

G

Andhra pradesh | Published On Feb 14, 2026, 12.18 pm IST

AP Budget | రూ.3.32 ల‌క్ష‌ల కోట్లతో ఏపీ బడ్జెట్‌.. అమరావతి నిర్మాణానికి 6 వేల కోట్లు
Advertisement

AP Budget | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ (AP Budget) శాస‌న స‌భ‌లో ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ (Payyavula Keshav) వార్షిక బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్ర‌తిపాదించారు. బడ్జెట్‌ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని.. అంకెల‌కు అతీత‌మ‌ని చెప్పారు. ప్రతిపాదించే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను సాకారం చేసేందుకు ఉద్దేశించిందేన‌ని తెలిపారు. స్వ‌ర్ణాంధ్ర‌-2047కు అనుగుణంగా బ‌డ్జెట్‌ను రూపొందించామ‌న్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ త‌మ కొత్త విధాన‌మ‌ని తెలిపారు.

రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నామ‌ని వెళ్ల‌డించారు. రాయ‌ల‌సీమ రైతుల క‌ల‌ల‌ను ఈ బ‌డ్జెట్ సాకారం చేస్తుంద‌ని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో యువ‌కు గుండె నిబ్బ‌రాన్ని ఇస్తుంద‌న్నారు. బ‌డ్జెట్‌లో రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు, పోల‌వ‌రం ప్రాజెక్టుకు రూ.6,105 కోట్లు కేటాయించారు. కాగా, ప‌య్యావుల కేశ‌వ్ బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ఇది మూడోసారి.

బడ్జెట్‌ ముఖ్యాంశాలు..

  • రెవెన్యూ వ్యయం- రూ.2,56,143 కోట్లు
  • మూలధన వ్యయం- రూ.53,915 కోట్లు
  • రెవెన్యూ లోటు- రూ.22,002 కోట్లు
  • ద్రవ్య లోటు- రూ.75,868 కోట్లు

కేటాయింపులు ఇలా..

  • పోలవరానికి- రూ.6,105 కోట్లు
  • అమరావతి నిర్మాణానికి- రూ.6 వేల కోట్లు
  • విద్యుత్‌ రంగానికి- రూ.13,934 కోట్లు
  • రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు- రూ.13,546 కోట్లు
  • పరిశ్రమలకు- రూ.3,161 కోట్లు
  • సర్దుబాటు నిధి- రూ.1,500 కోట్లు
  • వీబీ జీ రామ్‌ జీకి- రూ.8365 కోట్లు
  • గృహ నిర్మాణ రంగానికి- రూ.5,451 కోట్లు
  • ఎన్టీఆర్‌ వైద్య సేవకు- రూ.4000 కోట్లు
  • జల్‌ జీవన్‌కు- రూ.4,000 కోట్లు
  • స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు- రూ.1,037 కోట్లు
  • విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు
  • రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు- రూ.30,000 కోట్లు
  • ఎన్టీఆర్ భరోసా- రూ.27,719 కోట్లు
  • దీపం 2.0- రూ.2,601 కోట్లు
  • వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు- రూ.2,320 కోట్లు
  • స్త్రీశక్తి- రూ.1,420 కోట్లు
  • వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్- రూ.600 కోట్లు
  • ఆటో డ్రైవర్ల సేవలో- రూ.450 కోట్లు
  • తల్లికి వందనం- రూ.9,668 కోట్లు
  • స్త్రీ, శిశు సంక్షేమం- రూ.4,581 కోట్లు
  • ఉపకారవేతనాలు- రూ.3,836 కోట్లు
  • సమగ్ర శిక్ష- రూ.2,946 కోట్లు
  • ఉన్నత విద్య- రూ.2,566 కోట్లు
  • డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం- రూ.2,161 కోట్లు
  • మన బడి, మన భవిష్యత్- రూ.1,500 కోట్లు
  • నైపుణ్యాభివృద్ధి- రూ.1,232 కోట్లు
  • పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా- రూ.707 కోట్లు
  • సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర- రూ.654 కోట్లు
  • యువత, క్రీడలు- రూ.438 కోట్లు
  • మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు- రూ.9,906 కోట్లు
  • అన్నదాత సుఖీభవ- రూ.6,600 కోట్లు
  • రాష్ట్రీయ కృషి వికాస్ యోజన- రూ.1,927 కోట్లు
  • ధరల స్థిరీకరణ నిధి- రూ.500 కోట్లు
  • మత్స్యకార సేవలో- రూ.260కోట్లు
  • పంటల బీమా- రూ.250 కోట్లు
  • పీఎం కృషి సించాయి యోజన- రూ.190 కోట్లు
Advertisement
Advertisement