Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు
Mobile Phone | అప్పటివరకు కలిసిమెసిలి ఉన్న విద్యార్థినుల మధ్య సెల్‌ఫోన్ (Mobile Phone) చిచ్చుపెట్టింది. చార్జింగ్ పెట్టిన ఫోన్ కనిపించకుండా పోవడంతో ఈశాన్య రాష్ట్రాల స్టూడెంట్లు, ఆంధ్రా విద్యార్థినుల (Nursing Students) మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది.
Andhra pradesh | Published On Aug 23, 2026, 10.19 am IST
Mobile Phone | త్రినేత్ర.న్యూస్: అప్పటివరకు కలిసిమెసిలి ఉన్న విద్యార్థినుల మధ్య సెల్‌ఫోన్ (Mobile Phone) చిచ్చుపెట్టింది. చార్జింగ్ పెట్టిన ఫోన్ కనిపించకుండా పోవడంతో ఈశాన్య రాష్ట్రాల స్టూడెంట్లు, ఆంధ్రా విద్యార్థినుల (Nursing Students) మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గొడవ కాస్తా ఘర్షణగా మారడంతో జుట్లు పట్టుకుని, కర్రలతో కొట్టుకున్నారు. చెప్పులు, బకెట్లు విసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో (Kakinada) ఉన్న ఎస్‌కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో చోటుచేసుకుంది.
కాకినాడలోని వైద్యనగర్‌లో ఉన్న ఎస్‌కే కాలేజీ ఆఫ్ నర్సింగ్, ఆర్కే స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో సుమారు 400 మంది తెలుగు విద్యార్థినులతోపాటు, మణిపూర్, అసోం, నాగాలాండ్‌కు చెందిన 31మంది విద్యార్థినులు నర్సింగ్ కోర్సు చదువుతున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో మణిపూర్‌కు చెందిన ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టుకోగా అది కనిపించకుండా పోయింది. ఫోన్ గురించి తెలుగు విద్యార్థినులను అడగ్గా వారు తమకు తెలియదని చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మణిపూర్ విద్యార్థిని తన ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అది దొరికినప్పటికీ ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరింది.
పరస్పర దాడి.. అధికారుల జోక్యం..
ఈ క్రమంలో మణిపూర్‌కు చెందిన విద్యార్థులంతా తెలుగు విద్యార్థినులపై దాడికి పాల్పడగా, వారు ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తొలుత కాలేజీలో తర్వాత రోడ్డుపైకి వచ్చి గొడవపడి తోపులాటకు దిగారు. కర్రలు, మాబ్‌లు, వాటర్ క్యాన్లు, చెప్పులు, బకెట్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరు మణిపూర్, తెలుగు విద్యార్థినులకు గాయాలయ్యాయి. వారిని జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. కాగా, తెలుగు విద్యార్థులు తమపై దాడికి పాల్పడ్డారంటూ మణిపూర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఏపీ సీఎంవో ఆఫీసుకు సమాచారం అందింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ కాలేజీకి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మణిపుర్ విద్యార్థులను సమీపంలోని సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేసిన మరో హాస్టల్‌కు తరలించారు. అక్కడ వారికి వసతి, ఆహారం తదితర సౌకర్యాలను కల్పించారు.
మొబైల్ ఫోన్‌కు సంబంధించి చిన్నపాటి అపార్థం వల్లే వివాదం తలెత్తిందని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు. ఇరు వర్గాల విద్యార్థినులతో మాట్లాడి సమస్యను శాంతియుతంగా పరిష్కరించారన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఎస్పీ చెప్పారు. నార్త్‌ఈస్ట్ విద్యార్థులతో పాటు స్థానిక విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. విద్యార్థినులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దీర్ఘకాలిక పరిష్కారం కోసం చర్యలు చేపడుతున్నామన్నారు.
Deeply concerned by reports of a clash at S.K. School of Nursing in Andhra Pradesh involving students from the Northeast, including Manipur.
I request Hon’ble CM Shri @ncbn ji to kindly look into the matter and ensure the safety and fair treatment of the students. Our children… https://t.co/Owk2rWOBcU
— N. Biren Singh (@NBirenSingh) August 22, 2026
తాజావార్తలు
- ●Free Travel for Women | రాఖీపౌర్ణమి కానుక.. మహిళలతోపాటు మరొకరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- ●Nayanthara | నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే? - సీక్రెట్ రివీల్ చేసిన లేడీ సూపర్ స్టార్
- ●Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ అప్‌గ్రేడ్.. ఇక 24 బోగీలతో పరుగులు..!
- ●Laptop Catches Fire | విమానం ల్యాండ్ అవుతుండగా.. ల్యాప్‌టాప్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
- ●Cargo Ship | ఒడిశాతీరంలో నీట మునిగిన కార్గో నౌక.. 22 మంది గల్లంతు
- ●Toxic | టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అపశృతి..

Free Travel for Women | రాఖీపౌర్ణమి కానుక.. మహిళలతోపాటు మరొకరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

Nayanthara | నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే? - సీక్రెట్ రివీల్ చేసిన లేడీ సూపర్ స్టార్

Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ అప్‌గ్రేడ్.. ఇక 24 బోగీలతో పరుగులు..!

Laptop Catches Fire | విమానం ల్యాండ్ అవుతుండగా.. ల్యాప్‌టాప్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం






