త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Toxic | టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి..

Toxic | రాకింగ్ స్టార్‌ యశ్‌ (Yash) హీరోగా న‌టించిన టాక్సిక్ (Toxic) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. ఫ్ల‌డ్‌లైట్ స్తంభం మీద‌ప‌డ‌టంతో న‌లుగురు గాయ‌ప‌డ్డారు.

G

Movies | Published On Aug 23, 2026, 6.46 am IST

Toxic | టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి..
Advertisement

Toxic | త్రినేత్ర‌.న్యూస్‌: రాకింగ్ స్టార్‌ యశ్‌ (Yash) హీరోగా న‌టించిన టాక్సిక్ (Toxic) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. ఫ్ల‌డ్‌లైట్ స్తంభం మీద‌ప‌డ‌టంతో న‌లుగురు గాయ‌ప‌డ్డారు. గీతు మోహ‌న్‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్టు 26 (బుధ‌వారం) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో శ‌నివారం రాత్రి హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Pre Release Event) నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద సంఖ్య‌లో యువ‌త హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా యశ్‌ మాట్లాడుతుండగా భారీ సౌండ్ బాక్స్ సెట్ కుప్పకూలింది. దీంతో ఇద్దరు యువకులు కాళ్లు విరిగినట్లు స‌మాచారం. మరో ఇద్దరమ్మాయిలకి గాయాల‌య్యాయి. వారిలో ఓ యువ‌తి స్పృహ కోల్పోయింది. న‌లుగురిని ద‌వాఖాన‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఈవెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కాగా, య‌శ్ మాట్లాడుతూ.. నిజాయితీ, సంక‌ల్పంతో ప‌నిచేస్తే ప్రేక్ష‌కులు ఎవ‌రినైనా స‌పోర్ట్ చేస్తార‌ని నిరూపించార‌న్నారు. సినిమాకు స‌రిహద్దులు లేవ‌ని, భాష‌ను, స‌రిహ‌ద్దుల‌ను మించి మాన‌వ‌త్వం, ప్రేమ‌, నిజాయితీ ఉన్నాయ‌ని చూపించార‌ని తెలిపారు. ఇండియ‌న్ సినిమా ప్ర‌పంచ స్థాయిలో నిల‌బ‌డాలి. మ‌నంద‌రం క‌లిసి ఇండియ‌న్ సినిమాను గ్లోబ‌ల్ సినిమాలో ఒక ప్ర‌త్యేక స్థానంలో నిల‌బెట్టాలన్నారు. మీరంతా యువ‌త. మీరు అనుకున్న‌ది మ‌న‌సులో బ‌లంగా సంక‌ల్పించుకుని ప్ర‌య‌త్నిస్తే క‌చ్చితంగా అనుకున్న విజ‌యాల‌ను సాధిస్తారు. ముందుగా మీపై మీరు న‌మ్మ‌కం ఉంచుకోండి. ఇత‌రుల మాట‌ల‌ను ప‌ట్టించుకోకుండా ప‌నిచేస్తే త‌ప్ప‌న‌సిరిగా స‌క్సెస్ వ‌స్తుంది అని చెప్పారు. ఈ మూవీఓ యశ్‌ ద్విపాత్రాభినయం చేస్తుండ‌గా, నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతమందించాడు.

Advertisement
Advertisement