Laptop Catches Fire | విమానం ల్యాండ్ అవుతుండగా.. ల్యాప్‌టాప్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
Laptop Catches Fire | అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు (American Airlines) చెందిన విమానంలో పెను ప్రమాదం తప్పింది. విమానం మరికొద్దిసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటుండగా అనుకోని ఘటన జరిగింది.
International | Published On Aug 23, 2026, 7.59 am IST
Laptop Catches Fire | త్రినేత్ర.న్యూస్: అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు (American Airlines) చెందిన విమానంలో పెను ప్రమాదం తప్పింది. విమానం మరికొద్దిసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటుండగా అనుకోని ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లో ఒక్కసారిగా మంటలు (Laptop Catches Fire) చెలరేగాయి. దీంతో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 2398 DFW అట్లాంటా (Atlanta) నుంచి డాలస్‌కు (Dallas) వెళ్తున్నది. విమానంలో సిబ్బందితో సహా 133 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం డాలస్‌లోని ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్ధమవుతుండగా.. విమానం వెనుకభాగంలోని క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఓ ప్రయాణికుడి వద్దనున్న ల్యాప్‌టాప్‌కు మంటలు అంటుకోవడంతో తోటి ప్రయాణికులు దానిని పక్కకు జరపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఐదుగురు గాయపడ్డారు. మంటలు వ్యాపించకుండా ఫ్లైట్ అటెండెంట్లు మంటలను అదుపుచేశారు. అనంతరం ల్యాప్‌టాప్‌ను విమానం మధ్యభాగానికి తరలించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానాశ్రయ అత్యవసర సిబ్బంది, వైద్య బృందాలు విమానం వద్దకు చేరుకుని.. గాయపడిన ప్రయాణికులకు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని అమెరికన్ ఎయిర్‌లైన్ ప్రకటించింది. ల్యాడింగ్ సమయంలో ఓ ప్రయానికుడి వద్ద నున్న ల్యాప్‌టాప్‌లో మంటలు చెలరేగాయని, సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాద తీవ్రతను తగ్గించగలిగారని తెలిపింది.
సంబంధిత వార్తలు

iPad Vs Laptop | ఐప్యాడ్, ల్యాప్‌టాప్.. రెండింటిలో ఏది ఉత్తమ ప్రదర్శన ఇస్తుంది.. దేన్ని కొనాలి..?
జులై 23, 2026

Laptop | ఆఫీస్ పనికోసం ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా.. ఈ 5 మోడల్స్‌పై లుక్కేయండి..
జులై 4, 2026

Laptop | మ్యాక్‌బుక్ వర్సెస్ థింక్‌ప్యాడ్.. ఏ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలి..?
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●Cargo Ship | ఒడిశాతీరంలో నీట మునిగిన కార్గో నౌక.. 22 మంది గల్లంతు
- ●Toxic | టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అపశృతి..
- ●Horoscope | ఆగస్టు 23 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆ విషయాల పట్ల జాగ్రత్త అవసరం!
- ●Moon Study | చంద్రుడిపై సూక్ష్మజీవుల మనుగడపై కొత్త అధ్యయనం.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- ●S301 Star | బాప్రే సెకనుకు 25వేల కిలోమీటర్ల వేగం.. అత్యంత వేగంగా దూసుకెళ్తున్న నక్షత్రం !
- ●Cloudscape Observer | మేఘాలను వీడియో తీస్తే రూ.8.5 లక్షల జీతం!

Cargo Ship | ఒడిశాతీరంలో నీట మునిగిన కార్గో నౌక.. 22 మంది గల్లంతు

Toxic | టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అపశృతి..

Horoscope | ఆగస్టు 23 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆ విషయాల పట్ల జాగ్రత్త అవసరం!

Moon Study | చంద్రుడిపై సూక్ష్మజీవుల మనుగడపై కొత్త అధ్యయనం.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు



