త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaikunta Dwara Darshan | శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు.. 27న వైకుంఠద్వార దర్శన టికెట్లు రిలీజ్‌!

Vaikunta Dwara Darshan | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం భ‌క్తులు శుభ‌వార్త చెప్పింది. అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని కల్పించనున్న వైకుంఠద్వార దర్శనం క‌ల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

P

Devotional | Published On Nov 24, 2026, 7.30 am IST

Vaikunta Dwara Darshan | శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు.. 27న వైకుంఠద్వార దర్శన టికెట్లు రిలీజ్‌!
Advertisement

Vaikunta Dwara Darshan | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం భ‌క్తులు శుభ‌వార్త చెప్పింది. అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని కల్పించనున్న వైకుంఠద్వార దర్శనం క‌ల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 27న ద‌ర్శ‌నం టికెట్ల‌ను విడుద‌ల చేయ‌నుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైకుంఠద్వార దర్శన ఏర్పాట్లు, భక్తుల రద్దీ నియంత్రణ, టికెట్ల కేటాయింపు తదితర అంశాలపై టీటీడీ అధికారులు సీఎంతో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం 27న టికెట్ల విడుదల ప్రక్రియ చేపట్టే అవ‌కాశాలున్నాయి.

తొలి రెండు రోజులు ఈ-డిప్ ద్వారా టోకెన్లు

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా తొలి రెండు రోజుల దర్శనాలకు ఎలక్ట్రానిక్ డిప్ (ఈ-డిప్) విధానంలో భక్తులకు టోకెన్లు కేటాయించనున్నారు. ఈ రెండు రోజులు పూర్తయిన తర్వాత మిగిలిన ఎనిమిది రోజుల పాటు టోకెన్లు లేకుండానే భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయాలని టీటీడీ యోచిస్తోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. పది రోజుల పాటు కొనసాగనున్న వైకుంఠద్వార దర్శనాల కోసం రోజుకు 15వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు టీటీడీ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లకు సహకరించాలని కోరారు.

Advertisement
Advertisement